భార్యను తీసుకొని ఆసుపత్రికి వెళితే.. కారుతో డ్రైవర్‌ ఉడాయింపు | Police Registered Case Against Driver Who Ran Away With Car In Amakur | Sakshi
Sakshi News home page

భార్యను తీసుకొని ఆసుపత్రికి వెళితే.. కారుతో డ్రైవర్‌ ఉడాయింపు

Published Wed, Aug 17 2022 3:47 PM | Last Updated on Wed, Aug 17 2022 3:53 PM

Police Registered Case Against Driver Who Ran Away With Car In Amakur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు: కారుతో ఉడాయించిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరులో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న అదే మండలం అప్పారావుపాళేనికి చెందిన పెంచలయ్యకు హ్యుండయ్‌ వెన్యూ కారు ఉంది. యాక్టింగ్‌ డ్రైవర్‌గా అప్పారావుపాళేనికి చెందిన బాలకృష్ణ పనిచేసేవారు. డయాలసిస్‌ నిమిత్తం పెంచలయ్య, ఆయన భార్యను ఆస్పత్రికి కారులో సోమవారం తీసుకొచ్చారు.

వారు ఆస్పత్రి లోపలికి వెళ్లగా, అదునుగా భావించిన బాలకృష్ణ కారుతో ఉడాయించాడు. రాత్రి ఏడు గంటలకు బయటకొచ్చిన పెంచలయ్య ఆయనకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. బెంగళూరు సమీపంలోని టోల్‌ప్లాజాను కారు దాటినట్లు పెంచలయ్య ఫోన్‌కు మంగళవారం ఉదయం మెసేజ్‌ వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement