
సాక్షి, నెల్లూరు : ఒకప్పుడు సుడిగాలిని చూస్తే .. బెంబేలెత్తిపోతేవారు. సుడిగాలి రాగానే దెయ్యాలు భూతాలు అంటూ భ్రమ పడేవారు. కొంతమంది సుడిగాలి కనపడగానే దేవుళ్ళ పేర్లు తలుచుకొని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు. అయితే నెల్లూరు నగరంలో అలాంటి సుడిగాలిలో యువకులు క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. స్థానిక వీఆర్సీ కాలేజి గ్రౌండ్లో బుధవారం భారీ సుడిగాలి ఒకటి చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడే క్రికెట్ ఆడుతున్న యువకులు దాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఓ యువకుడైతే దట్టమైన ఇసుకపొరతో సుడులు తిరుగుతున్న సుడిగాలి మధ్యన బ్యాట్ పట్టుకు నిలబడి ఎంజాయ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment