జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఎన్‌ఆర్‌ఐ విభాగ నాయకులు
సాక్షి, నాయుడుపేటటౌన్: ప్రజాసంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సింగపూర్ ఎన్‌ఆర్‌ఐ విభాగ జిల్లా సభ్యుడు పిట్ల కస్తూరి పేర్కొన్నారు. సింగపూర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ విభాగ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే నవరత్నాల పథకాలకు సంబంధించి డిజిటల్ దండోర సీడీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో జగనన్నను కలిసి ఆయన చేతుల మీదుగా సీడీని ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామగ్రామాన నవరత్నాల పథకాలకు సంబంధించిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టే అనేక కార్యక్రమాలను జగనన్న దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
సింగపూర్ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో ఉన్న జిల్లా ప్రధాన సభ్యులైన నాయుడుపేట మండలం, గొట్టిప్రోలు గ్రామానికి చెందిన పిట్ల కస్తూరి ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐ విభాగం తరపున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇందుకుగాను సింగపూర్ ఎన్‌ఆర్‌ఐ విభాగ నాయకులు ఇప్పటికే కార్యచరణను రూపొందించి ఆయా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు తదితర నాయకుల సారథ్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని డిజిటల్ విధానంతో జగనన్న చేపట్టే అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుంటామన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో విదేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా సింగపూర్‌తోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలను సైతం చైతన్యపరచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుంటే రాష్ట్రంలో చేపట్టే అనేక సంక్షేమ పథకాలను చిత్రాల రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడిండారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో సింగపూర్ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ కన్వీనర్ బొమ్మిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దక్కత జయప్రకాష్, కోర్‌కమిటీ, సోషల్ మీడియా ఇన్‌చార్జి పిల్లి సంతోష్‌రెడ్డి, సురేష్, నర్సింగ్ గౌడ్, మురళి, లోకేష్ ఉన్నట్లు కస్తూరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment