
ముంబై : రియల్ ఎస్టేట్ దిగ్గజం హెచ్‌డీఐఎల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్లు రాకేష్ కుమార్ వధ్వాన్, సారంగ్ వధ్వాన్‌లను ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో అరెస్ట్ చేశారు. వారికి చెందిన రూ.3,500 కోట్ల ఆస్తులను అధికారులు స్తంభింపచేశారు. మరోవైపు పీఎంసీ బ్యాంక్ నుంచి వీరికి చెందిన హెచ్‌డీఐఎల్ అక్రమంగా రూ. 6000 కోట్లు పైబడి రుణాలు పొందిన ఉదంతం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అంతకుముందు ప్రభుత్వం వీరిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది.
కాగా పీఎంసీ బ్యాంక్ నుంచి ఇతర బోర్డు సభ్యుల అనుమతి లేకుండా హెచ్‌డీఐఎల్‌కు రూ. 6500 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు బ్యాంకుకు చెందిన సస్పెండైన మేనేజింగ్ డైరెక్టర్ జే థామస్ అంగీకరించారు. హెచ్‌డీఐఎల్ ప్రస్తుతం కుర్లా, నహర్, ములుంద్, పాల్ఘర్ ప్రాంతాల్లో 86.22 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేస్తోంది. 2019 మార్చి 31 నాటికి ఈ కంపెనీ ముంబై పరిధిలో 193 మిలియన్ చదరపు అడుగుల భూమిని అభివృద్ధి చేస్తోందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment