ముంబై: స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తద్వారా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)ని సెంట్రమ్ టేకోవర్ చేయడానికి మార్గం సుగమం అయింది. ప్రైవేట్ రంగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటు మార్గదర్శకాలకు అనుగుణంగా సంస్థకు సూత్రప్రాయ అనుమతినిచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు భారీగా ఇచ్చిన రుణాల విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలతో పీఎంసీ బ్యాంకును ఆర్‌బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పునర్‌నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి పీఎంసీ బ్యాంకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) ఆహ్వానించింది. బ్యాంకును టేకోవర్ చేసేందుకు దరఖాస్తులు సమర్పించిన నాలుగు సంస్థల్లో ఒకటైన సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు తాజాగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి దక్కింది. హెచ్‌డీఐఎల్‌కు పీఎంసీ సుమారు రూ. 6,500 కోట్లు్ల పైగా రుణాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment