HDIL
-
హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లపై మరో సీబీఐ కేసు
న్యూఢిల్లీ: హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేష్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌లపై మరో బ్యాంక్ మోసం కేసును సీబీఐ నమోదుచేసింది. వారి అనుబంధ సంస్థ గురుఆశిష్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన రూ.140 కోట్ల మోసం విషయంలో కొత్త కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుకు సంబంధించి రూ.4,300 కోట్ల కుంభకోణం కేసులో ఇప్పటికే ఇరుక్కున్న ఈ వ్యాపారవేత్తలపై తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై తాజా చర్య ప్రా రంభించినట్లు వారు తెలిపారు. యస్ బ్యాంక్‌కు సంబంధించి రూ.200 కోట్ల కుంభకోణంలో కూడా వాధ్వాన్‌లపై కేసు దాఖలైంది. -
సెంట్రమ్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనుమతులు
ముంబై: స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తద్వారా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)ని సెంట్రమ్ టేకోవర్ చేయడానికి మార్గం సుగమం అయింది. ప్రైవేట్ రంగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటు మార్గదర్శకాలకు అనుగుణంగా సంస్థకు సూత్రప్రాయ అనుమతినిచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు భారీగా ఇచ్చిన రుణాల విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలతో పీఎంసీ బ్యాంకును ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పునర్నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి పీఎంసీ బ్యాంకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) ఆహ్వానించింది. బ్యాంకును టేకోవర్ చేసేందుకు దరఖాస్తులు సమర్పించిన నాలుగు సంస్థల్లో ఒకటైన సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు తాజాగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి దక్కింది. హెచ్‌డీఐఎల్‌కు పీఎంసీ సుమారు రూ. 6,500 కోట్లు్ల పైగా రుణాలిచ్చింది. -
పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఎంసీ బ్యాంకు సంక్షోభానికి కారకులైన రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు షాకిచ్చింది. రూ.4,355 కోట్ల విలువైన స్కాంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారి చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే నేతృత్వంలో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కమిటీ వాదనలను పరిశీలించింది. బాంబే హైకోర్టు అసాధారణంగా ఈ ఉత్తర్వులిచ్చిందనీ, హైకోర్టు వాస్తవంగా వారికి బెయిల్ మంజూరు చేసిందన్నవాదనను సుప్రీం సమర్ధించింది. రియల్ ఎస్టేట్ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేశ్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌ను గృహ నిర్బంధంలో ఉంచడానికి అనుమతించిన బొంబాయి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వేల కోట్ల కుంభకోణంలో అరెస్టైన వారిద్దరినీ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి మార్చడానికి వీల్లేదని ఆదేశించింది. కాగా పీఎంసీ బ్యాంకు వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు వాద్వాన్ సోదరులను జైలు నుంచి తరలించాల్సిందగా దాఖలపై పిటిషన్నువిచరించిన కోర్టు వారిని గృహనిర్బంధంలోకి మార్చేందుకు అంగీకరించింది. అంతేకాదు బాధితుల డిపాజిట్ సొమ్మును రికవరీ చేసే చర్యల్లో భాగంగా కంపెనీ ఆస్తులనువేలానికి త్రిసభ్య కమిటీనొకదాన్ని కూడా కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలను తక్షణమే విచారించాల్సిందిగా కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) కేసులో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ కుమార్ వాధ్వాన్, ఆయన కుమారుడు, మేనేజింగ్ డైరెక్టర్ సారంగ్ వాధ్వాన్‌ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులుగత ఏడాది అక్టోబరులో అరెస్ట్ చేశారు. రాకేశ్ కుమార్ వాధ్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాధ్వాన్ ఫైల్ ఫోటో -
పీఎంసీ స్కాం, భారీ చార్జిషీట్
సాక్షి, ముంబై: సంచలనం రేపిన పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో చార్జిషీటు దాఖలైంది. సుమారు రూ.6,700 కోట్ల కుంభకోణంలో ఐదుగురిపై 32వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించింది. మోసం, మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టడం వంటి ఆరోపణలతో నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. చార్జిషీట్లో బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యమ్ సింగ్, బ్యాంక్ మాజీ డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాతో పాటు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్డిఐఎల్) ప్రమోటర్లు రాకేశ్ వాధవన్, ఆయన కుమారుడు సారంగ్ వాధవన్ కూడా ఉన్నారు. బ్యాంకులో ఖాతాదారులతో సహా 340 మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద పోలీసులు కీలకమైన నలుగురు సాక్షుల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు, ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు, పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. అయితే వీరిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. పీఎంసీ బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాల్లో 75 శాతం దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్ కే వెళ్లాయి. హెచ్‌డీఐల్ ప్రమోటర్లు, తప్పుడు పత్రాలతో 21 వేల ఫేక్ ఖాతాల ద్వారా పీఎంసీ నుంచి రుణాలను పొందారన్నది ప్రధాన ఆరోపణ. బ్యాంకు వార్షిక నివేదికల్లో సైతం హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాల వివరాలను పొందుపరచలేదు. అలాగే దివాలా తీసిన తరువాత కూడా ఆ సంస్థకు పీఎంసీ రుణాలను మంజూరు చేస్తూ పోయింది. -
ఆ స్కామ్‌స్టర్ గ్యారేజ్‌లో విమానం, నౌక..
ముంబై : పీఎంసీ బ్యాంకు స్కామ్‌కు సంబంధించి హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లపై ఈడీ జరిపిన దాడుల్లో పోగేసిన అక్రమార్జన ఆనవాళ్లు బయటపడ్డాయి. హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేష్, సారంగ్ వాధ్వాన్‌లకు చెందిన ప్రైవేట్ జెట్, పలు విలాసవంతమైన కార్లను గతవారం సీజ్ చేసిన ఈడీ సోమవారం అలీబాగ్‌లో 22 గదులతో కూడిన భారీ భవంతి, మరో విమానం, ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న నౌకను గుర్తించింది. ఈ ఆస్తులను ఈడీ త్వరలో అటాచ్ చేయనుంది. హెచ్‌డీఐఎల్ కంపెనీ మహారాష్ట్రలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీ భవంతులను రాజకీయ నాయకులకు బహుమతిగా ఇచ్చినట్టు ఈ దాడుల్లో ఈడీ గుర్తించింది. ఏయే రాజకీయ నేతలకు ఈ ఖరీదైన బహుమతులు ముట్టాయనే వివరాలను ఈడీ బహిర్గతం చేయలేదు. వాధ్వాన్ల సన్నిహితుల ఆస్తులనూ సోదా చేసేందుకు ఈడీ బృందాలు సన్నద్ధమయ్యాయి. మరోవైపు పీఎంసీ కేసులో ముంబై పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం రూ 4000 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, చరాస్తులు, పొదుపు ఖాతాలను ఇప్పటికే సీజ్ చేసింది. హెచ్‌డీఐఎల్ సీనియర్ అధికారులు, పీఎంసీ బ్యాంక్ అధికారులు సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జే థామస్‌లను ఈడీ అధికారులు రూ 4355 కోట్ల స్కామ్ గురించి విచారిస్తున్నారు. -
రూ.350 కోట్లు మోసపోయాం... కాపాడండి!
సాక్షి, ముంబై: రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలకు గృహకొనుగోలుదారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీకావు. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, పీఎంసీ బ్యాంకు స్కాంకు ప్రధాన కారణమై హెచ్‌డీఐల్ వినియోగదారులు రోడ్డెకారు. 350 కోట్ల రూపాయల మేర ఇరుక్కుపోయాం కాపాడమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొంతమంది గృహ కొనుగోలుదారులు లేఖ రాశారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రాజక్టులో చిక్కుకున్నామని వాపోయారు. సబర్బన్ ములుండ్ ప్రాజెక్టులోని 450 మంది హెచ్డిఐఎల్ బాధితులు ఈ లేఖ రాశారు. దివాలా తీసిన హెచ్‌డీఐఎల్ రియల్టర్‌కు మొత్తం 350 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తమను ఈ కష్టాలనుంచి గట్టెక్కించాలని, విస్పరింగ్ టవర్స్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది. 2010లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో బుకింగ్ చేసుకున్నామనీ, అయితే గత తొమ్మిదేళ్లలో 46 అంతస్తుల టవర్‌లో 18 అంతస్తులు మాత్రమే నిర్మించారనీ, రెండవ దశలో కూడా పనులు ప్రారంభించలేదని అసోసియేషన్ ఆరోపించింది. ముంబై ప్రాజెక్టు కోసం రియల్టర్లు అలహాబాద్ బ్యాంక్, జెఅండ్‌కె బ్యాంక్, సిండికేట్ బ్యాంకునుంచి రూ .517 కోట్లు తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. మరో 525 కోట్ల రూపాయలను హెచ్డిఐఎల్ సమీకరించిందని, ఆ ఇంటి యజమానులు భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చాలా కాలంగాఈ ప్రాజెక్టు నిలిచిపోవడంతో తమ సొమ్ము ఇరుక్కుపోయిందని ఆందోళనవ్యక్తం చేశారు. గృహ కొనుగోలుదారులకు ఫ్లాట్ల అమ్మకాలపై అలహాబాద్ బ్యాంకుకు తెలియజేయకుండా హెచ్‌డీఐఎల్ మోసం చేసిందని, వివిధ రుణదాతల నుండి గృహ రుణాలు తీసుకున్నందుకు బ్యాంకు నుండి ఎన్ఓసిలను జారీ చేయకుండా వినియోగదారులను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు విధించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.6,500 కోట్ల ఈ స్కాంనకు సంబంధించిన కేసులో అక్టోబర్ 3న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు, రాకేశ్ వాధవన్ అతని కుమారుడు సారంగ్ వాధవన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్ రుణాలే ముంచాయ్! -
పీఎంసీ కేసులో హెచ్‌డీఐఎల్ డైరెక్టర్ల అరెస్ట్
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) డైరెక్టర్లు ఇరువురు అరెస్ట్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణ డిఫాల్ట్‌కు సంబంధించి రాకేష్ వాద్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాద్వాన్లను అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌డీఐఎల్‌కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్‌డీఐఎల్ సీనియర్ అధికారులపై ఈఓడబ్ల్యూ ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో సస్పెండయిన పీఎంసీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, చైర్మన్ వార్యాన్ సింగ్, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల పేర్లను చేర్చారు. కేసులో దర్యాప్తునకు సిట్ కూడా ఏర్పాటయ్యింది. రూ.25,000 వరకు ఉపసంహరణకు అవకాశం కాగా పీఎంసీ బ్యాంకుపై తన ఆంక్షలను ఆర్బీఐ గురువారం మరింత సడలించింది. ఒక్కో ఖాతా నుంచి ఉపసంహరణ పరిమితిని రూ.25,000కు పెంచింది. కొద్ది రోజుల కిందట కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు అవకాశం ఇవ్వగా, అటుతర్వాత ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. ఈ పరిమితిని తాజాగా రూ.25,000కు పెంచడంతో 70 శాతం మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. వీరు 25,000 వరకూ విత్‌డ్రా చేసుకోగలుగుతారు. ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. -
హెచ్‌డీఐఎల్ ఎండీ, సీఈవో అరెస్ట్
ముంబై : రియల్ ఎస్టేట్ దిగ్గజం హెచ్‌డీఐఎల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్లు రాకేష్ కుమార్ వధ్వాన్, సారంగ్ వధ్వాన్‌లను ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో అరెస్ట్ చేశారు. వారికి చెందిన రూ.3,500 కోట్ల ఆస్తులను అధికారులు స్తంభింపచేశారు. మరోవైపు పీఎంసీ బ్యాంక్ నుంచి వీరికి చెందిన హెచ్‌డీఐఎల్ అక్రమంగా రూ. 6000 కోట్లు పైబడి రుణాలు పొందిన ఉదంతం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అంతకుముందు ప్రభుత్వం వీరిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. కాగా పీఎంసీ బ్యాంక్ నుంచి ఇతర బోర్డు సభ్యుల అనుమతి లేకుండా హెచ్‌డీఐఎల్‌కు రూ. 6500 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు బ్యాంకుకు చెందిన సస్పెండైన మేనేజింగ్ డైరెక్టర్ జే థామస్ అంగీకరించారు. హెచ్‌డీఐఎల్ ప్రస్తుతం కుర్లా, నహర్, ములుంద్, పాల్ఘర్ ప్రాంతాల్లో 86.22 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేస్తోంది. 2019 మార్చి 31 నాటికి ఈ కంపెనీ ముంబై పరిధిలో 193 మిలియన్ చదరపు అడుగుల భూమిని అభివృద్ధి చేస్తోందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొంది. -
పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్ రుణాలే ముంచాయ్!
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు సంక్షోభానికి... రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు బ్యాంకు భారీగా రుణాలను సమర్పించుకోవడమేనని వెల్లడైంది. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్ అంగీకరించినట్టు సమాచారం. అంటే రుణ ఆస్తుల్లో 73 శాతాన్ని ఒకే ఖాతాకు బ్యాంకు ఎలా ఇచ్చిందన్నది పెద్ద ప్రశ్న. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం ఇది. ఆర్బీఐ నిర్దేశించిన పరిమితి కంటే నాలుగు రెట్లు ఎక్కువ. పీఎంసీ చైర్మన్ వర్యమ్‌సింగ్‌ను గతేడాదే తొలగించాలని, మహారాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్‌కు ఆర్బీఐ సూచించింది. కానీ, బ్యాంకు చైర్మన్‌గా సింగ్ ఇటీవలి కాలం వరకు కొనసాగారు. ‘దిద్దుబాటు చర్యల’ చట్రంలోకి ఎల్వీబీ లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ‘తక్షణ దిద్దుబాటు చర్యల’(పీఎంసీ) అస్త్రాన్ని ప్రయోగించింది. అధిక మొండిబకాయిల (ఎన్పీఏ) భారం, ఇబ్బందుల నిర్వహణకు తగిన మూలధన పెట్టుబడులు లేకపోవడం, రుణాలపై ప్రతికూల రిటర్న్స్ వంటి అంశాలు దీనికి కారణం. మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోర్డ్‌పై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఫిర్యాదు దాఖలైంది. -
హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంక్ దివాలా పిటిషన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: భారీగా బాకీపడిన రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) దాఖలు చేసిన దివాలా దరఖాస్తును ఆంధ్రా బ్యాంకు ఉపసంహరించుకుంది. రుణబాకీలను సెటిల్ చేసుకునేందుకు తాము సిధ్ధమైనందున ఆంధ్రా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌డీఐఎల్ పేర్కొంది. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించినట్లు తెలిపింది. అయితే, ఎంత మొత్తం చెల్లించినదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సుమారు రూ.55 కోట్ల రుణాలు బాకీ పడిందంటూ అక్టోబర్ 30న హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంకు.. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. -
ఫలితాల్లో నీరసించిన హెచ్‌డీఐఎల్
ముంబై: రియల్టీ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) కు ఈ సం.రం ఆర్థిక ఫలితాల్లో ఎదురు దెబ్బ తగిలింది. క్యూ2లో నికర లాభం భారీగా క్షీణతను నమోదు చేసి నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. 36 శాతం క్షీణించి రూ. 37 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 57 కోట్లు. నిర్వహణ ఆదాయం 8 శాతం తగ్గి రూ. 218.54 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది జులై క్వార్టర్ లో ఇది 237 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 223 కోట్లను సాధించినట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో సంస్థ తెలిపింది. గత ఏడాది మొత్తం ఆదాయం రూ.243కోట్లుగా నిలిచింది. అలాగే స్టాండెలోన్ ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 31 శాతం తగ్గి రూ. 110 కోట్లను తాకగా, ఇబిటా మార్జిన్లు 67.7 శాతం నుంచి 50.5 శాతానికి మందగించాయి. హెచ్‌డీఐఎల్ షేరు 0.73 శాతం నష్టంతో రూ.61.35 వద్ద ముగిసింది. -
హైదరాబాద్ భూములను విక్రయిస్తాం: హెచ్‌డీఐఎల్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజ సంస్థ హెచ్‌డీఐఎల్ దాదాపు 200 ఎకరాల భూములను విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, నిధుల సమీకరణకు హెచ్‌డీఐఎల్ హైదరాబాద్, బరోడాలోని స్థలాల్ని విక్రయించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ భారాన్ని (అప్పులను) 15 శాతం తగ్గించుకోవాలని (రూ.2,500 కోట్ల దిగువకు) లక్ష్యంగా నిర్దేశించుకుంది. హెచ్‌డీఐఎల్ అప్పులు ఈ ఏడాది మార్చి చివరి నాటికి 10 శాతంమేర తగ్గి రూ.2,942 కోట్లకు చేరాయి. గత జనవరి-మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఐఎల్ నికర లాభం 72 శాతం తగ్గి రూ.31 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 162 కోట్లకు తగ్గింది. ‘తమ భూ విక్రయ చర్చలు తుది దశలో ఉన్నాయని, ఈ ఏడాది చివరకు బరోడా, హైదరాబాద్‌లోని స్థల విక్రయ ఒప్పందాలు ఖరారు అవుతాయి’ అని హెచ్‌డీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరి ప్రకాశ్ పాండే అన్నారు.