
న్యూఢిల్లీ: భారీగా బాకీపడిన రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో (ఎన్‌సీఎల్‌టీ) దాఖలు చేసిన దివాలా దరఖాస్తును ఆంధ్రా బ్యాంకు ఉపసంహరించుకుంది. రుణబాకీలను సెటిల్ చేసుకునేందుకు తాము సిధ్ధమైనందున ఆంధ్రా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌డీఐఎల్ పేర్కొంది.
ఇప్పటికే కొంత మొత్తం చెల్లించినట్లు తెలిపింది. అయితే, ఎంత మొత్తం చెల్లించినదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సుమారు రూ.55 కోట్ల రుణాలు బాకీ పడిందంటూ అక్టోబర్ 30న హెచ్‌డీఐఎల్‌పై ఆంధ్రా బ్యాంకు.. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.