హైదరాబాద్ భూములను విక్రయిస్తాం: హెచ్‌డీఐఎల్ | HDIL in talks to sell 200 acre land in Baroda, Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ భూములను విక్రయిస్తాం: హెచ్‌డీఐఎల్

Published Mon, May 18 2015 1:35 AM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

హైదరాబాద్ భూములను విక్రయిస్తాం: హెచ్‌డీఐఎల్ - Sakshi

హైదరాబాద్ భూములను విక్రయిస్తాం: హెచ్‌డీఐఎల్

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజ సంస్థ హెచ్‌డీఐఎల్ దాదాపు 200 ఎకరాల భూములను విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, నిధుల సమీకరణకు హెచ్‌డీఐఎల్ హైదరాబాద్, బరోడాలోని స్థలాల్ని విక్రయించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ భారాన్ని (అప్పులను) 15 శాతం తగ్గించుకోవాలని (రూ.2,500 కోట్ల దిగువకు) లక్ష్యంగా నిర్దేశించుకుంది. హెచ్‌డీఐఎల్ అప్పులు ఈ ఏడాది మార్చి చివరి నాటికి 10 శాతంమేర తగ్గి రూ.2,942 కోట్లకు చేరాయి.

గత జనవరి-మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఐఎల్ నికర లాభం 72 శాతం తగ్గి రూ.31 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 162 కోట్లకు తగ్గింది. ‘తమ భూ విక్రయ చర్చలు తుది దశలో ఉన్నాయని, ఈ ఏడాది చివరకు బరోడా, హైదరాబాద్‌లోని స్థల విక్రయ ఒప్పందాలు ఖరారు అవుతాయి’ అని హెచ్‌డీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరి ప్రకాశ్ పాండే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement