PMC Bank Scam
-
పీఎంసీ బ్యాంక్‌పై మరో మూడు నెలలు ఆంక్షలు
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌పై ఆంక్షలను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. దీనితో పీఎంసీపై మరో మూడు నెలలు అంటే 2022 మార్చి వరకూ ఆంక్షలు కొనసాగుతాయి. సంక్షోభంలో ఉన్న పీఎంసీ బ్యాంకును ఢిల్లీకి చెందిన యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూఎస్‌బీఐ ) స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డ్రాఫ్ట్ స్కీమ్ పక్రియ ఇంకా పూర్తి కానుందున ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పీఎంసీ బ్యాంక్ విలీన పక్రియకు సెంట్రల్ బ్యాంక్ ముసాయిదా స్కీమ్‌ను సిద్ధం చేసింది. దీనిపై సూచనలను, అభ్యంతరాలను కోరుతూ నవంబర్ 22న ప్రజా బాహుళ్యంలో ఉంచింది. దీనికి సంబంధించిన గడువు డిసెంబర్10వ తేదీన ముగిసింది. తదుపరి చర్యల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆర్బీఐ తన తాజా ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పలు సార్లు... రియల్ ఎస్టేట్ డెవలపర్ హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలను దాచిపెట్టడం, తప్పుగా నివేదించడం వంటి కొన్ని ఆర్థిక అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసింది. ఆ బ్యాంక్ ఖాతాదారుల ఉపసంహరణలపై పరిమితులుసహా పలు నియంత్రణలు విధించింది. ఆ తర్వాత పలుమార్లు ఆంక్షలు పొడిగించింది. సంబంధిత ఆదేశాలను చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో పొడిగించడం జరిగింది. డిసెంబర్ 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా ఆంక్షల పొడిగింపు నిర్ణయం తీసుకుంది. విలీనం ముసాయిదా పథకం ప్రకారం, యూఎస్‌ఎఫ్‌బీ ద్వారా డిపాజిట్లతో సహా పీఎంసీ బ్యాంక్ ఆస్తులు, రుణాలు స్వాధీనం అవుతాయి. తద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలకు కూడా అధిక రక్షణ కలుగుతుందని గత నెల్లో ఆర్బీఐ తెలిపింది. యూఎస్ఎఫ్బీని ‘జాయింట్ ఇన్వెస్టర్’గా సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెసైలెంట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తున్నాయి. దీనికి 2021 అక్టోబర్‌లో బ్యాంకింగ్ లైసెన్స్ కూడా లభించింది. నవంబర్ 1 నుంచీ యూఎస్‌ఎఫ్‌బీ కార్కకలాపాలు ప్రారంభమయ్యాయి. చదవండి: బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి -
నిలువునా ముంచేసిన బ్యాంకు.. 200 మంది మరణం.. చివరకు స్వల్ప ఊరట
PMC Crisis: పంజాబ్ మహరాష్ట్ర నేషనల్ బ్యాంక్ (పీఎంసీ బ్యాంక్) కుంభకోణంలో డిపాజిట్‌దారులకు స్వల్ప ఊరట లభించింది. స్వల్ప మొత్తాల డిపాజిట్లకు సంబంధించిన చెల్లింపుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా తాజాగా జారీ చేసిన ఆదేశాలు బాధితులకు కొంత మేర ఉపశమనం కలిగించాయి. 90 రోజుల్లో బ్యాంక్ మేనేజర్ అడ్డదారులు తొక్కడంతో పీఎంసీ బ్యాంకు నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 2019 సెప్టెంబరు నుంచి డిపాజిట్‌దారులు తమ సొమ్ములు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై ఆర్బీఐ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులో దాచుకున్న సొమ్ము వడ్డీతో కలిపి మొత్తం ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత 90 రోజుల్లోగా నగదు చెల్లింపులు ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. డిపాజిట్ ఇన్సురెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ద్వారా ఈ చెల్లింపులు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల లక్ష మంది వరకు బాధితులకు ఊరట లభించనుంది. మరి వారి సంగతి ముంబై ప్రధాన కార్యాలయంగా పంజాబ్ మహారాష్ట నేషనల్ బ్యాంకుకి దాదాపు పది లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కేవలం లక్ష మంది వరకు సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు. కానీ మిగిలిన డిపాజిటర్ల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఇందులో 43,000ల మంది ఖాతాదారులైతే భారీ మొత్తంలో తమ సొమ్మును ఈ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఎదిగిన తీరు పీఎంసీ బ్యాంకుని 1984లో నవీ ముంబైలో ఏర్పాటు చేశారు. ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో ముంబైలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ఈ బ్యాంకును ఆదరించారు. దీంతో అనతి కాంలోనే మహారాష్ట్ర, పంజాబ్‌లతో పాటు దేశమంతటా 130 వరకు బ్రాంచీలకు విస్తరించింది. ఖాతాదారుల సంఖ్య పది లక్షల వరకు చేరుకుంది. దేశంలో ఉన్న సహాకార బ్యాంకుల్లో 11 శాతం డిపాజిట్లతో అగ్రగామి బ్యాంకుగా పీఎంసీ ఎదిగింది. కుప్ప కూలిన వైనం మహారాష్ట్రలోని బందూప్ బ్రాంచ్‌లో తొలిసారిగా కుంభకోణానికి బీజం పడింది. ఇక్కడి నుంచి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి నిబంధనలకు తూట్లు పొడుస్తూ బాం్యకు సిబ్బంది రూ. 6500 కోట్ల రూపాయల రుణం మంజూరు చేశారు. అంతేకాకుండా ఊరుపేరు ఖాతాలు సృష్టించి సామాన్యుల నుంచి సేకరించిన సొమ్మును తరించారు. చివరకు 2019 సెప్టెంబరులో ఈ పాపం వెలుగులోకి వచ్చింది. కష్టాల్లోకి ఖాతాదారులు దీంతో 2019 సెప్టెంబరులో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లావాదేవీలు నిలిపేసింది. దీంతో కష్టపడి ఈ బ్యాంకులో సొమ్ములు దాచుకున్న ఎందరో ఆందోళన చెందారు. తమ డబ్బులు వెనక్కి తీసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కుంభ కోణం వెలుగు చూసిన నెల రోజుల వ్యవధిలోనే 20 మందికి పైగా ఖాతాదారులు మరణించారు. కానీ ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం లభించలేదు. కరోనా ఎఫెక్ట్‌తో కూలిన బతుకులు బ్యాంకు సంక్షోభం రేపోమాపో చక్కబడుతుందనుకులోగా కరోనా వచ్చి పడింది. దాని వెంటే లాక్డౌన్ రావడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ బ్యాంకులో డబ్బులు దాచుకున్న డిపాజిట్లు అష్టకష్టాలు పడ్డారు. పీఎంసీ బ్యాంకు ఫైట్ పేరుతో గ్రూపులుగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. వీరు చెప్పిన వివరాల ప్రకారమే కేవలం ఈ బ్యాంకు చేసిన ద్రోహం కారణంగా ఇప్పటి వరకు 200ల మందికి పైగా ఖాతాదారులు మరణించారు. ఇందులో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు అక్కరలో డబ్బులు అందక మరణించారు. మరెంతో మంది ఆర్థిక ఆధారం లేక దుర్బర జీవితం గడుపుతున్నారు. అందర్నీ ఆదుకోవాలి ముంబైలో పని చేసే కార్మికులు, ఉద్యోగస్తులు చిరు వ్యాపారాలు చేయాలని, ఇళ్లు కట్టుకోవాలనే లక్ష్యంతో తమ రెక్కల కష్టాన్ని ఈ బ్యాంకులో దాచుకున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయం కొంత మేరకు ఊరట ఇచ్చినా.. చాలా మంది ఇంకా తమ కష్టాల నుంచి గట్టెక్కలేదు. డిపాజిట్ ఇన్సురెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ద్వారా అందరికీ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. చదవండి : ఆర్బీఐ కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్! -
సెంట్రమ్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనుమతులు
ముంబై: స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తద్వారా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)ని సెంట్రమ్ టేకోవర్ చేయడానికి మార్గం సుగమం అయింది. ప్రైవేట్ రంగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటు మార్గదర్శకాలకు అనుగుణంగా సంస్థకు సూత్రప్రాయ అనుమతినిచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు భారీగా ఇచ్చిన రుణాల విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలతో పీఎంసీ బ్యాంకును ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పునర్నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి పీఎంసీ బ్యాంకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) ఆహ్వానించింది. బ్యాంకును టేకోవర్ చేసేందుకు దరఖాస్తులు సమర్పించిన నాలుగు సంస్థల్లో ఒకటైన సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు తాజాగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి దక్కింది. హెచ్‌డీఐఎల్‌కు పీఎంసీ సుమారు రూ. 6,500 కోట్లు్ల పైగా రుణాలిచ్చింది. -
సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ముంబై : పీఎంసీ బ్యాంక్ నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో డిసెంబర్ 29న విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది మూడో సారి. తొలి రెండుసార్లు అనారోగ్య కారణాలు చూపుతూ ఆమె విచారణకు హాజరుకాలేదు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రుణ కుంభకోణంపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు పవన్ రౌత్ భార్యకు, వర్షా రౌత్‌కు మధ్య 50 లక్షల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ మొత్తాన్ని వర్షా రౌత్ ఆస్తి కొనుగోలు కోసం వినియోగించినట్లు సమాచారం. (చదవండి: ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!) ఇక ఎవరికైనా ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేస్తే.. వారు స్పందించపోతే.. సదరు వ్యక్తులపై లీగల్ యాక్షన్ తీసుకునే అధికారం ఈడీకి ఉంటుంది. ఇక సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయంపై బీజేపీ నాయకులు స్పందించారు. శివసేన రెండు నాల్కల ధోరణిని విడిచిపెట్టి.. ఈ ఆరోపణలపై స్పందించాలని.. వాస్తవాలను ప్రజలకు బహిరంగపర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల చర్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని తెలిపారు. -
పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఎంసీ బ్యాంకు సంక్షోభానికి కారకులైన రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు షాకిచ్చింది. రూ.4,355 కోట్ల విలువైన స్కాంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారి చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే నేతృత్వంలో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కమిటీ వాదనలను పరిశీలించింది. బాంబే హైకోర్టు అసాధారణంగా ఈ ఉత్తర్వులిచ్చిందనీ, హైకోర్టు వాస్తవంగా వారికి బెయిల్ మంజూరు చేసిందన్నవాదనను సుప్రీం సమర్ధించింది. రియల్ ఎస్టేట్ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేశ్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌ను గృహ నిర్బంధంలో ఉంచడానికి అనుమతించిన బొంబాయి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వేల కోట్ల కుంభకోణంలో అరెస్టైన వారిద్దరినీ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి మార్చడానికి వీల్లేదని ఆదేశించింది. కాగా పీఎంసీ బ్యాంకు వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు వాద్వాన్ సోదరులను జైలు నుంచి తరలించాల్సిందగా దాఖలపై పిటిషన్నువిచరించిన కోర్టు వారిని గృహనిర్బంధంలోకి మార్చేందుకు అంగీకరించింది. అంతేకాదు బాధితుల డిపాజిట్ సొమ్మును రికవరీ చేసే చర్యల్లో భాగంగా కంపెనీ ఆస్తులనువేలానికి త్రిసభ్య కమిటీనొకదాన్ని కూడా కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలను తక్షణమే విచారించాల్సిందిగా కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) కేసులో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ కుమార్ వాధ్వాన్, ఆయన కుమారుడు, మేనేజింగ్ డైరెక్టర్ సారంగ్ వాధ్వాన్‌ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులుగత ఏడాది అక్టోబరులో అరెస్ట్ చేశారు. రాకేశ్ కుమార్ వాధ్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాధ్వాన్ ఫైల్ ఫోటో -
పీఎంసీ బ్యాంక్ స్కాంపై 32 వేల పేజీల చార్జిషీట్
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ స్కాంకు సంబంధించి ఐదుగురు నిందితులపై 32 వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జిషీట్లో ఆ బ్యాంకు మాజీ ఎండీ జాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యమ్ సింగ్, మాజీ డైరక్టర్ సుర్జిత్ సింగ్ ఆరోరాతో పాటు, హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) ప్రమోటర్లు రాకేశ్ వర్ధమాన్, సారంగ్ వర్ధమాన్ నిందితులుగా పేర్కొన్నారు. మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించడానికి సంబంధించి ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. వీరిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. కాగా ఈ 32 వేల పేజీల చార్జిషీట్లో పీఎంసీ బ్యాంక్ ఫోరెన్సిక్ అడిట్ రిపోర్టు, బ్యాంకు సొమ్ముతో నిందితుల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాదారులతో పాటు 340 మంది సాక్షుల వాంగ్మూలాలు తదితర వివరాలు ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
పీఎంసీ స్కాం, భారీ చార్జిషీట్
సాక్షి, ముంబై: సంచలనం రేపిన పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో చార్జిషీటు దాఖలైంది. సుమారు రూ.6,700 కోట్ల కుంభకోణంలో ఐదుగురిపై 32వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించింది. మోసం, మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టడం వంటి ఆరోపణలతో నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. చార్జిషీట్లో బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యమ్ సింగ్, బ్యాంక్ మాజీ డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాతో పాటు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్డిఐఎల్) ప్రమోటర్లు రాకేశ్ వాధవన్, ఆయన కుమారుడు సారంగ్ వాధవన్ కూడా ఉన్నారు. బ్యాంకులో ఖాతాదారులతో సహా 340 మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద పోలీసులు కీలకమైన నలుగురు సాక్షుల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు, ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు, పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. అయితే వీరిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. పీఎంసీ బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాల్లో 75 శాతం దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్ కే వెళ్లాయి. హెచ్‌డీఐల్ ప్రమోటర్లు, తప్పుడు పత్రాలతో 21 వేల ఫేక్ ఖాతాల ద్వారా పీఎంసీ నుంచి రుణాలను పొందారన్నది ప్రధాన ఆరోపణ. బ్యాంకు వార్షిక నివేదికల్లో సైతం హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాల వివరాలను పొందుపరచలేదు. అలాగే దివాలా తీసిన తరువాత కూడా ఆ సంస్థకు పీఎంసీ రుణాలను మంజూరు చేస్తూ పోయింది. -
సహకార బ్యాంకుల పనితీరుపై ఆర్బీఐ సమీక్ష
భువనేశ్వర్: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ) స్కామ్‌తో లక్షల మంది డిపాజిటర్లు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ సహకార బ్యాంకుల పనితీరును రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శనివారం సమీక్షించింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్గతంగాను.. అంతర్జాతీయంగాను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన అంశాలు కూడా చర్చించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన సెంట్రల్ బోర్డు.. పట్టణ ప్రాంత కోఆపరేటివ్ బ్యాంకులు, వాటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు మొత్తం రూ. 6,226 కోట్ల మేర రుణాలిచ్చినప్పటికీ .. పీఎంసీ బ్యాంకు కేవలం రూ. 440 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఆర్బీఐకి చూపించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ బైటపడటంతో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల విత్డ్రాయల్స్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. -
పీఎంసీ స్కాం, మరో బాధితుని కన్నుమూత
సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణం బాధితుల్లో మరొకరు అకస్మాత్తుగా ప్రాణాలు విడవడం విషాదాన్ని నింపింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ బ్యాంక్) లో డబ్బులు దాచుకున్న ప్రతాప్ జియందాని (71) ములుండ్‌లోని తన నివాసంలోగుండెపోటుతో మరణించారు. ఈ సమాచారాన్ని ఆయన బంధువు ముఖేష్ చండిరామణి శుక్రవారం వెల్లడించారు. కాగా గత రెండు నెలల కాలంలో పెద్దమొత్తంలో పీఎంసీలో డబ్బులు దాచుకున్న డిపాజటర్లలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరో ఏడుగురు డిపాజిటర్లు గుండెపోటుతో మరణించారు. సుమారు 16 లక్షల మంది డిపాజిటర్లను కలిగి ఉన్న పీఎంసీలో రూ 4355 కోట్ల రూపాయల కుంభకోణం సెప్టెంబరు మాసంలో వెలుగులోకి రావడంతో ఆర్బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు విధించింది. కస్టమర్లు వెయ్యిరూపాయల మాత్రమే విత్ డ్రా చేసుకోగలరని నిబంధనలు విధించింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకులో నగదును డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని అంటూ నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో విత్‌డ్రా పరిమితిని రూ.40,000 నుంచి 50 వేలకు పెంచింది. అయితే 78 శాతం ఖాతాదారులు తమ మొత్తం బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. మెడికల్ ఎమర్జెన్సీ, వివాహాలు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో పీఎంసీ డిపాజిటర్ రూ.1 లక్ష వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చంటూ వారికి భారీ ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. -
ఆ డిపాజిటర్లకు భారీ ఊరట..
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన పీఎంసీ బ్యాంక్‌కు చెందిన వేలాది డిపాజిటర్లకు భారీ ఊరట లభించింది. పీఎంసీ కేసులో ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేసి వాటి వేలానికి అవసరమైన చర్యలను ఆర్బీఐ చేపట్టింది. ఈ ఆస్తుల విక్రయం దిశగా అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేసి వేలం ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని ఈఓడబ్య్లూను ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ర్టేటర్ కోరారు. ఆర్బీఐ నిర్ణయం పీఎంసీ బ్యాంకులో తమ సొమ్మును పొదుపు చేసుకున్న వేలాది డిపాజిటర్లకు ఊరట కల్పించింది. ఆర్బీఐ అడ్మినిస్ర్టేటర్‌కు ఆస్తులను అప్పగించేందుకు అనుమతించాలని ముంబై పోలీసులు న్యాయస్ధానాన్ని కోరనున్నారు. బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్వాన్స్ సైతం ఆస్తుల వేలానికి అంగీకరించారు. ఈ కేసులో రూ 3500 కోట్లు పైగా ఆస్తులను ఈఓడబ్ల్యూ అటాచ్ చేసింది. మరోవైపు ఆస్తుల వేలం ద్వారా సమకూరిన సొమ్మును ప్రొ రేటా ప్రాతిపదికన డిపాజిటర్లకు పంచనున్నారు. -
పీఎంసీ స్కామ్ : మరో డిపాజిటర్ మృతి
ముంబై : పీఎంసీ బ్యాంక్ కుంభకోణం మరో డిపాజిటర్‌ను బలితీసుకుంది. తన కష్టార్జితం దాచుకున్న బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన కేష్ముల్ హిందుజా గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈనెల 29న గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన 68 ఏళ్ల హిందుజా మరుసటి రోజు మరణించారని ఆయన కుమార్తె చెప్పారు. తన తండ్రికి ఇతర అనారోగ్యం ఏమీ లేదని, పీఎంసీ బ్యాంక్ సంక్షోభంపై తీవ్ర ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. ముంబైలోని ములుంద్ ప్రాంతంలో హిందుజా కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడని ఆమె చెప్పారు. అయితే బ్యాంకులో ఆయనకు ఎంత సొమ్ము డిపాజిట్‌గా ఉందన్నది తనకు తెలియదని ఆయన కుమార్తె పేర్కొన్నారు. పీఎంసీ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత హిందుజా మరణంతో ఇప్పటివరకూ బ్యాంక్ బాధితులు ఏడుగురు మరణించడం గమనార్హం. -
పీఎంసీ స్కాం: తాజా బాధితురాలు డైరెక్టర్
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు రేపిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు కుంభకోణంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాను కూడా బాధితురాలేనంటూ స్వయంగా పీఎంసీ డైరెక్టర్ డాక్టర్ పర్మీత్ సోధి తాజాగా ఆరోపించారు. ఈ స్కాం నేపథ్యంలో తనకు అరెస్ట్ తప్పదని ఆమె ఆందోళపడుతున్నారు. ఈ క్రమలోనే ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేషన బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన పర్మీత్ అసలు ఈ కుంభకోణం గురించి తనకు ఎంతమాత్రం తెలియదని వాపోయారు. ముఖ్యంగా హెచ్‌డీఐఎల్ లోన్ల అస్సలు గురించి తెలియదనీ, అందుకే ఇటీవల తాను రూ. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో విహారయాత్రలో ఉన్న తాను అక్టోబర్ 28 న భారతదేశానికి తిరిగి రానున్నాననీ, వచ్చిన వెంటనే అరెస్టు చేస్తారని భయపడుతున్నానని చెప్పారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో బ్యాంకుకు చెందిన పలువురు కీలకవ్యక్తులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులకు చెందిన ఎకనామిక్ నేరాల విభాగం (ఇఓడబ్ల్యూ) తనకు అరెస్ట్ చేస్తుందని అనుమానిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకు లావాదేవీలపై ఆరు నెలలపాటు ఆంక్షలు విధించడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. దీంతో కేవలం రూ. 1000 మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా నిబంధన విధించింది. దీంతో వేలాదిమంది ఖాతాదారులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. బిడ్డ పెళ్లి, చదువు, ఆరోగ్య ఖర్చులు, తదితర అవసరాల కోసం బ్యాంకులో నగదును డిపాజిట్ చేసుకున్న కస్టమర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు తమ కష్టార్జితం తమ చేతికి దక్కకుండాపోయిందన్న ఆవేదనతో ఇప్పటికే అయిదుగురు ఖాతాదారులు కన్నుమూయడం విషాదం. మరోవైపు ఆర్బీఐ నగదు ఉపసంహరణ పరిమితి ప్రస్తుతం రూ. 50 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కాంలోఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసిన ఆర్థికనేరాల విభాగం 17 మందిపై లుక్-అవుట్ సర్క్యులర్లు (ఎల్ఓసి) జారీ చేసింది. పీఎంసీ బ్యాంక్ మాజీ ఎండీజాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యం సింగ్, డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాతో పాటు హెచ్డిఐఎల్ ప్రమోటర్లు రాకేశ్, సారంగ్ వాధవన్లను అరెస్ట్ చేసింది. హెచ్‌డిఐఎల్‌కు రుణాల మంజూరు సహాయం చేసిన పీఎంసీ బ్యాంక్ డైరెక్టర్ దల్జిత్ సింగ్ బాల్ పరారీలో ఉన్నాడు. బ్యాంక్ లోన్ కమిటీలోని ముఖ్య సభ్యులలో ఒకరైన దల్జిత్ సింగ్ బాల్, సుర్జిత్ సింగ్ అరోరాతో కలిసి రుణాలను సిఫారసు చేయడంలో కీలకపాత్ర పోషించారని ముంబై ఇఓడబ్ల్యూ రిమాండ్ రిపోర్ట్ తెలిపింది. బాధిత ఖాతాదారుల ఆందోళన -
సందిగ్ధంలో రూ 2.25 కోట్లు : ఆగిన మహిళ గుండె..
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన పీఎంసీ బ్యాంక్‌లో కుమార్తెకు ఖాతా ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురైన 73 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించారు. తన కుమార్తె కుటుంబానికి సంబంధించి రూ 2.25 కోట్ల నిధులు పీఎంసీ బ్యాంక్‌లో ఇరుక్కుపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై షోలాపూర్‌లో భారతి సదరంగని అనే వృద్ధురాలు మరణించారు. గత రెండు నెలలుగా ఆమె తమకు ప్రతిరోజూ ఫోన్ చేసి బ్యాంక్‌లో తమ డిపాజిట్ల పరిస్థితి ఏమిటని వాకబు చేసేవారని, తమ డబ్బు సురక్షితంగా ఉందని తాము చెప్పినా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవారని బాధితురాలి అల్లుడు చందన్ చెప్పారు. ఒత్తిడికి గురైన తమ అత్త హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ఈ బ్యాంక్‌లో దాచామని చెప్పారు. ముంబైలోని ములుంద్‌లో తమ ఇంటికి ఎదురుగా ఉన్న పీఎంసీ బ్యాంక్‌లో తమ నిధులను డిపాజిట్ చేశామని, బ్యాంక్ సేవలు కూడా సంతృప్తికరంగా ఉండేవని అనూహ్యంగా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని చందన్ ఆందోళన చెందారు. భారతి సదనందన్ మృతితో ఈ కుటుంబం తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. -
మహా కుంభకోణం
-
రూ. కోటి డిపాజిట్.. డాక్టర్ ఆత్మహత్య
ముంబై : పీఎంసీ బ్యాంక్ కుంభకోణం మరొకరిని బలితీసుకుంది. సంక్షోభంలో కూరుకుపోయిన పీఎంసీ బ్యాంక్‌లో ఖాతాకలిగిన ముంబైకి చెందిన డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధితురాలిని డాక్టర్ నివేదితా బిజ్లాని(39)గా గుర్తించారు. పీఎంసీ డిపాజిటర్ సంజయ్ గులాటీ ఆత్మహత్యకు పాల్పడిన రోజే ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెడిసిన్‌లో పీజీ చేసిన బిజ్లాని సోమవారం సాయంత్రం సబర్బన్ వెర్సోవా ప్రాంతంలోని తన నివాసంలో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా డాక్టర్ నివేదిత బిజ్లానికి పీఎంసీ బ్యాంక్‌లో కోటి రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఆమె తండ్రి తెలిపారు. మరోవైపు భర్త నుంచి విడిపోయిన నివేదిత కుంగుబాటుతో బాధపడుతున్నారని ఆమె మరణానికి పీఎంసీ సంక్షోభానికి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇక పీఎంసీ బ్యాంకుకు చెందిన మరో డిపాజిటర్ ఫతోమల్ పంజాబీ మంగళవారం మరణించారు. బ్యాంకు సంక్షోభంపై మధనపడుతూ తీవ్ర ఒత్తిడికి లోనై ఫతోమల్ ప్రాణాలు తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. 4355 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగుచూసిన పీఎంసీ బ్యాంక్‌కు సంబంధించి ఖాతాదారుల లావాదేవీలపైనా ఆర్బీఐ పలు నియంత్రణలు విధించడంతో డిపాజిటర్లు తమ సొమ్ము వెనక్కుతీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదవండి : రూ 90 లక్షలు చేజారడంతో ఆగిన గుండె -
రూ. 90 లక్షలు చేజారడంతో ఆగిన గుండె..
ముంబై : పీఎంసీ బ్యాంక్ స్కామ్ ఖాతాదారులు, డిపాజిట్‌దారుల ఉసురు తీస్తోంది. పీఎంసీ స్కామ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని ఇంటికి తిరిగివచ్చిన సంజయ్ గులాటీ అనే వ్యక్తి గుండె పోటుకు గురై మరణించిన ఘటన వెలుగుచూసింది. ముంబైలోని ఓషివర ప్రాంతానికి చెందని తపోర్‌వాలా గార్డెన్స్‌లో నివసించే సంజయ్ గులాటీకి పీఎంసీ బ్యాంక్ ఓషివర బ్రాంచ్‌లో రూ.90 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. సంజయ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. మూతపడిన జెట్ ఎయిర్వేస్లో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన సంజయ్‌ను పీఎంసీ బ్యాంక్ స్కామ్ మరింత విచారానికి లోనుచేసింది. పీఎంసీ డిపాజిటర్ల విత్‌డ్రాయల్ పరిమితిపై ఆర్బీఐ నియంత్రణలు విధించడం ఆయనను బాధించింది. పీఎంసీ బ్యాంక్‌లో సంజయ్ ఆయన భార్య, తల్లితండ్రులకు సంబంధించి మొత్తం నాలుగు ఖాతాల్లో రూ. 90 లక్షల డిపాజిట్లున్నాయి. తాను ఉద్యోగం కోల్పోవడం, తమ డిపాజిట్లున్న పీఎంసీ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడంతో తీవ్ర మనస్ధాపానికి లోనైన సంజయ్ గుండెపోటుతో మరణించారు. సోమవారం ఎర్రకోట సమీపంలోని కిల్లా కోర్టు వద్ద జరిగిన నిరసనలో సంజయ్ గులాటీ పాల్గొని మధ్యాహ్నం ఇంటికి తిరిగివచ్చి భార్యను భోజనం తీసుకురమ్మని కోరారని, లంచ్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని ఆయన బంధువు రాజేష్ దువా తెలిపారు. సంజయ్‌ను కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. -
9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: పండుగుల సీజన్లో మార్కెట్లో రుణ వితరణ పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... అక్టోబర్ 1 నుంచి 9 వరకు తొమ్మిది రోజుల్లో బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో రూ.81,781 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలిపారు. ఇందులో నూతనంగా జారీ చేసిన రుణాలు రూ.34,342 కోట్లు అని చెప్పారు. తదుపరి రుణ మేళా కార్యక్రమం ఈ నెల 21 నుంచి 25 వరకు ఉంటుందని రాజీవ్‌కుమార్ తెలిపారు. బ్యాంకుల వద్ద తగినంత నిధుల లభ్యత ఉందని, అసలైన రుణ గ్రహీతలకు అవి నిబంధనల మేరకు రుణాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి చేయాల్సిన చెల్లింపులు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి బిల్ డిస్కౌంటింగ్ సదుపాయం అందించాల్సిందిగా బ్యాంకులను కోరినట్టు తెలిపారు. రూ.40,000 కోట్లు పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు జరగాల్సి ఉన్నట్టు చెప్పారు. పీఎంసీ పరిణామాలపై సునిశిత పర్యవేక్షణ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పర్యవేక్షిస్తున్నామని, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీలైనంత తొందరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.బ్యాంకుల్లో గరిష్టంగా రూ.లక్ష డిపాజిట్ వరకే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా బీమా ఉండగా, ఈ పరిమితి పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుందని, దీన్ని పా ర్లమెంటు ద్వారా చేపడతామని చెప్పారు. ఒప్పందాలను గౌరవిస్తాం.. ఇంధన రంగంలో, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఒప్పందాలను భారత్ గౌరవిస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందొద్దని కోరారు. -
కోపరేటివ్ బ్యాంకులకు చికిత్స!
ముంబై: కోపరేటివ్ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు అవసరమైతే చట్టంలో సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవలే ఆర్బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్ల ఆగ్రహాన్ని మంత్రి గురువారం ముంబై వచ్చిన సందర్భంగా స్వయంగా చవిచూశారు. దక్షిణ ముంబైలోని బీజేపీ కార్యాలయం వద్దకు పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లు చేరుకుని తమ డబ్బులను పూర్తిగా తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిటర్లను మంత్రి లోపలకు తీసుకెళ్లి, స్వయంగా మాట్లాడి వారి ఆందోళనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోపరేటివ్ బ్యాంకుల్లో పాలన మెరుగ్గా ఉండేందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌తో ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోపరేటివ్ బ్యాంకుల చట్టంలో లోపాలు ఉన్నాయని తాను భావించడం లేదన్నారు. కాకపోతే, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే ప్యానెల్ ఏర్పాటు అని చెప్పారు. అవసరమైతే కోపరేటివ్ బ్యాంకుల చట్టాలకు సవరణలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాత్ర పరిమితమే.. బహుళ రాష్ట్రాల్లో పనిచేసే కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రిస్తుందని డిపాజిటర్లకు చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర పరిమితమేనన్నారు. కాకపోతే డిపాజిటర్ల అత్యవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ను కోరతానని ఆమె హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకులో రుణాల కుంభకోణం వెలుగు చూడడం, ఎన్పీఏల గణాంకాల్లో బ్యాంకు అక్రమాలకు పాల్పడడంతో ఆర్బీఐ ఆంక్షలను అమలు చేసిన విషయం గమనార్హం. ఒక్కో ఖాతా (సేవింగ్స్, కరెంటు, డిపాజిట్) నుంచి గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఉపసంహరణకు అనుమతించింది. పీఎంసీ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా తన మొత్తం రుణాల్లో (సుమారు రూ.9వేల కోట్లు) 70% మేర హెచ్‌డీఐఎల్ ఖాతా ఒక్కదానికే ఇవ్వడం గమనార్హం. వృద్ధి కోసం ప్రోత్సాహకాలు దేశం ఆర్థిక మందగమనం ఎదుర్కొం టోందని ప్రభుత్వం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు... మంత్రి నిర్మలా సీతారామన్ సూటి సమాధానం దాటవేశారు. రంగాలవారీగా అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. సాయం అవసరమైన అన్ని రంగాలకు ఉపశమనం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. -
పీఎంసీ కుంభకోణం: ఆర్థిక మంత్రి నిర్మల హామీ
సాక్షి, ముంబై: పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) కుంభకోణంపై ఆందోళన చేస్తున్న ఖాతాదారులకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. మరోసారి ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నగదు విత్డ్రాయల్స్పై ఉన్న పరిమితలను సవరించమని కోరతానన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ముంబైలోని బీజేపీ ఆఫీస్‌లో నిర్మలా సీతారామన్ మీడియా సమావేశానికి రాగా.. అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న బ్యాంక్ కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని కలిసి మాట్లాడారు సీతారామన్. తాను మరోసారి ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని తెలిపారు. అలాగే ఆర్థికశాఖ కార్యదర్శులను కూడా అసలు ఏం జరిగిందనే అంశంపై పరిశీలించాలని ఆదేశించానని చెప్పారు. పీఎంసీ కుంభకోణం నేపథ్యంలో ఆర్బీఐ ఆ బ్యాంక్ నుంచి నగదు ఉపసంహరణను రూ. 25వేలకే పరిమితం చేసింది. -
తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి
సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణంలో ఒక్కోఖాతాదారుడిదీ ఒక్కోదీన గాధ. పండుగ సందర్భంలో కుటుంబాలతో సంతోషంగా ఎలా గడపాలంటూ బాధిత ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల కుంభకోణం వెలుగు చూడటంతో ఆర్బీఐ పీఎంసీ బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వెయ్యి రూపాయలకు మించి ఏ ఖాతాదారుడు నగదు తీసుకోవడానికి వీల్లేదని పరిమితులు విధించింది. ఆ తరువాత బాధితుల ఆందోళనతో ఈ లిమిట్‌ను 25వేలకు పెంచింది. అయినప్పటికీ ఉన్నట్టుండీ తమ ఖాతాల్లోని నగదు స్తంభించిపోవడంతో... కూతురి పెళ్లి ఎలా అని, అమ్మాయి ఫీజు ఎలా కట్టాలి, అమ్మా నాన్న, వైద్య ఖర్చులు..ఇలా ఒక్కొక్కరూ వర్ణించనలవి కాని ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళనకు దిగారు. తాజాగా ముంబైలోని బీజేపీ కార్యాలయం ముందు వందలాదిమంది నిరసనకు దిగారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు మీడియా సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో ఆందోళనకారులు ఆమెను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని ను కోరారు. ప్రధానంగా టీవీ నటి నూపుర్ అలంకార్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిజంగా సినిమా కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. అమ్మ ఆక్సిజన్‌పై చావుబతుకులమధ్య ఉన్నారు. మామగారు ఈ మధ్యనే ఆపరేషన్ అయింది.. దానికి సంబంధించిన బకాయిలు కట్టాల్సి వుందని నూపుర్ మీడియాతో వాపోయారు. తన ఖాతా స్థంభించిపోవడంతో నగలు అమ్మాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే.. ఇక ఇంట్లో వస్తువుల్ని కూడా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పీఎంపీ కుంభకోణం వ్యవహారంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థికమంత్రిగా తానేమీ చేయలేననీ, రెగ్యలేటరీ అయిన ఆర్బీఐ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. అయితే ఖాతాదారులు, ఆందోళనను అర్థం చేసుకోగలమని, వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్బీఐ గవర్నర్‌ను కోరనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఈ (గురువారం) సాయంత్రం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. అలాగే పరిస్థితిపై వివరంగా అధ్యయనం చేయమని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కోరాననీ, ఇందులో ఆర్బిఐ ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. అంతేకాదు అవసరమైతే, సంబంధిత చట్టాలను సవరించాల్సిన మార్గాలను అన్వేషించమని ఆదేశించినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. TV Actor Nupur Alankar on PMC Bank collapse:My mother is on oxygen&father-in-law underwent a surgery recently. I had to plead&borrow from people.Our accounts are frozen&payment cards aren't working.I had to sell my jewellery.If it is not sorted, I'll have to sell household items. pic.twitter.com/LDDAxq8jhJ — ANI (@ANI) October 10, 2019 -
పీఎంసీ స్కాం: భిక్షగాళ్లుగా మారిపోయాం
సాక్షి, ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లు తాజాగా మరోసారి ఆందోళనకు దిగారు. ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని బీజేపీ కార్యాలయం ముందు గురువారం నిరసనకు దిగారు. కేవలం రూ.25 వేలతో తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలంటూ వందలాంది మంది బాధిత ఖాతాదారులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతోఅక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా కృష్ణ అనే డిపాజిటర్ మాట్లాడుతూ అసలు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదనీ, తనకు డబ్బు తిరిగి కావాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఈ సొమ్మును తిరిగి సంపాదించుకోలేనంటూ ఆవేదన చెందారు. దీంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాత్రికి రాత్రే తమ ఖాతాలను స్తంభింప చేస్తు పరిస్థితి ఏంటని ఆగ్రహంతో ప్రశ్నించారు. తామేమీ నేరం చేయకపోయినా తమ కష్టార్జితంకోసం భిక్షగాళ్లలా ప్రభుత్వాన్ని అర్థించాల్సి వస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. Mumbai: Depositors of Punjab & Maharashtra Cooperative (PMC) Bank protest outside BJP office, Nariman Point. Krishna, a depositor says, "I don't know what they're doing,don't care what they're doing,I want my money back.I won't be able to earn again whatever I've put in the bank" pic.twitter.com/n3tWtfr3mT — ANI (@ANI) October 10, 2019 -
ఆ స్కామ్‌స్టర్ గ్యారేజ్‌లో విమానం, నౌక..
ముంబై : పీఎంసీ బ్యాంకు స్కామ్‌కు సంబంధించి హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లపై ఈడీ జరిపిన దాడుల్లో పోగేసిన అక్రమార్జన ఆనవాళ్లు బయటపడ్డాయి. హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేష్, సారంగ్ వాధ్వాన్‌లకు చెందిన ప్రైవేట్ జెట్, పలు విలాసవంతమైన కార్లను గతవారం సీజ్ చేసిన ఈడీ సోమవారం అలీబాగ్‌లో 22 గదులతో కూడిన భారీ భవంతి, మరో విమానం, ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న నౌకను గుర్తించింది. ఈ ఆస్తులను ఈడీ త్వరలో అటాచ్ చేయనుంది. హెచ్‌డీఐఎల్ కంపెనీ మహారాష్ట్రలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీ భవంతులను రాజకీయ నాయకులకు బహుమతిగా ఇచ్చినట్టు ఈ దాడుల్లో ఈడీ గుర్తించింది. ఏయే రాజకీయ నేతలకు ఈ ఖరీదైన బహుమతులు ముట్టాయనే వివరాలను ఈడీ బహిర్గతం చేయలేదు. వాధ్వాన్ల సన్నిహితుల ఆస్తులనూ సోదా చేసేందుకు ఈడీ బృందాలు సన్నద్ధమయ్యాయి. మరోవైపు పీఎంసీ కేసులో ముంబై పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం రూ 4000 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, చరాస్తులు, పొదుపు ఖాతాలను ఇప్పటికే సీజ్ చేసింది. హెచ్‌డీఐఎల్ సీనియర్ అధికారులు, పీఎంసీ బ్యాంక్ అధికారులు సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జే థామస్‌లను ఈడీ అధికారులు రూ 4355 కోట్ల స్కామ్ గురించి విచారిస్తున్నారు. -
రూ.350 కోట్లు మోసపోయాం... కాపాడండి!
సాక్షి, ముంబై: రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలకు గృహకొనుగోలుదారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీకావు. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, పీఎంసీ బ్యాంకు స్కాంకు ప్రధాన కారణమై హెచ్‌డీఐల్ వినియోగదారులు రోడ్డెకారు. 350 కోట్ల రూపాయల మేర ఇరుక్కుపోయాం కాపాడమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొంతమంది గృహ కొనుగోలుదారులు లేఖ రాశారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రాజక్టులో చిక్కుకున్నామని వాపోయారు. సబర్బన్ ములుండ్ ప్రాజెక్టులోని 450 మంది హెచ్డిఐఎల్ బాధితులు ఈ లేఖ రాశారు. దివాలా తీసిన హెచ్‌డీఐఎల్ రియల్టర్‌కు మొత్తం 350 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తమను ఈ కష్టాలనుంచి గట్టెక్కించాలని, విస్పరింగ్ టవర్స్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది. 2010లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో బుకింగ్ చేసుకున్నామనీ, అయితే గత తొమ్మిదేళ్లలో 46 అంతస్తుల టవర్‌లో 18 అంతస్తులు మాత్రమే నిర్మించారనీ, రెండవ దశలో కూడా పనులు ప్రారంభించలేదని అసోసియేషన్ ఆరోపించింది. ముంబై ప్రాజెక్టు కోసం రియల్టర్లు అలహాబాద్ బ్యాంక్, జెఅండ్‌కె బ్యాంక్, సిండికేట్ బ్యాంకునుంచి రూ .517 కోట్లు తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. మరో 525 కోట్ల రూపాయలను హెచ్డిఐఎల్ సమీకరించిందని, ఆ ఇంటి యజమానులు భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చాలా కాలంగాఈ ప్రాజెక్టు నిలిచిపోవడంతో తమ సొమ్ము ఇరుక్కుపోయిందని ఆందోళనవ్యక్తం చేశారు. గృహ కొనుగోలుదారులకు ఫ్లాట్ల అమ్మకాలపై అలహాబాద్ బ్యాంకుకు తెలియజేయకుండా హెచ్‌డీఐఎల్ మోసం చేసిందని, వివిధ రుణదాతల నుండి గృహ రుణాలు తీసుకున్నందుకు బ్యాంకు నుండి ఎన్ఓసిలను జారీ చేయకుండా వినియోగదారులను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు విధించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.6,500 కోట్ల ఈ స్కాంనకు సంబంధించిన కేసులో అక్టోబర్ 3న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు, రాకేశ్ వాధవన్ అతని కుమారుడు సారంగ్ వాధవన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్ రుణాలే ముంచాయ్! -
పీఎంసీ కేసులో హెచ్‌డీఐఎల్ డైరెక్టర్ల అరెస్ట్
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) డైరెక్టర్లు ఇరువురు అరెస్ట్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణ డిఫాల్ట్‌కు సంబంధించి రాకేష్ వాద్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాద్వాన్లను అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌డీఐఎల్‌కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్‌డీఐఎల్ సీనియర్ అధికారులపై ఈఓడబ్ల్యూ ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో సస్పెండయిన పీఎంసీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, చైర్మన్ వార్యాన్ సింగ్, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల పేర్లను చేర్చారు. కేసులో దర్యాప్తునకు సిట్ కూడా ఏర్పాటయ్యింది. రూ.25,000 వరకు ఉపసంహరణకు అవకాశం కాగా పీఎంసీ బ్యాంకుపై తన ఆంక్షలను ఆర్బీఐ గురువారం మరింత సడలించింది. ఒక్కో ఖాతా నుంచి ఉపసంహరణ పరిమితిని రూ.25,000కు పెంచింది. కొద్ది రోజుల కిందట కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు అవకాశం ఇవ్వగా, అటుతర్వాత ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. ఈ పరిమితిని తాజాగా రూ.25,000కు పెంచడంతో 70 శాతం మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. వీరు 25,000 వరకూ విత్‌డ్రా చేసుకోగలుగుతారు. ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. -
హెచ్‌డీఐఎల్ ఎండీ, సీఈవో అరెస్ట్
ముంబై : రియల్ ఎస్టేట్ దిగ్గజం హెచ్‌డీఐఎల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్లు రాకేష్ కుమార్ వధ్వాన్, సారంగ్ వధ్వాన్‌లను ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో అరెస్ట్ చేశారు. వారికి చెందిన రూ.3,500 కోట్ల ఆస్తులను అధికారులు స్తంభింపచేశారు. మరోవైపు పీఎంసీ బ్యాంక్ నుంచి వీరికి చెందిన హెచ్‌డీఐఎల్ అక్రమంగా రూ. 6000 కోట్లు పైబడి రుణాలు పొందిన ఉదంతం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అంతకుముందు ప్రభుత్వం వీరిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. కాగా పీఎంసీ బ్యాంక్ నుంచి ఇతర బోర్డు సభ్యుల అనుమతి లేకుండా హెచ్‌డీఐఎల్‌కు రూ. 6500 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు బ్యాంకుకు చెందిన సస్పెండైన మేనేజింగ్ డైరెక్టర్ జే థామస్ అంగీకరించారు. హెచ్‌డీఐఎల్ ప్రస్తుతం కుర్లా, నహర్, ములుంద్, పాల్ఘర్ ప్రాంతాల్లో 86.22 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేస్తోంది. 2019 మార్చి 31 నాటికి ఈ కంపెనీ ముంబై పరిధిలో 193 మిలియన్ చదరపు అడుగుల భూమిని అభివృద్ధి చేస్తోందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొంది.