
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానిత జైషే మహ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న యాపిల్ ట్రక్కులో ఉగ్రవాది తలదాచుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ము నుంచి ఢిల్లీకి వెళుతున్న ట్రక్కులో జైషే ఉగ్రవాది ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న అంబాలా పోలీసులు వ్యూహాత్మకంగా అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన జైషే ఉగ్రవాదిని అంబాలా పోలీసులు జమ్ము పోలీసులకు అప్పగించారు.
అరెస్ట్ అయిన ఉగ్రవాదికి పలు కేసులతో సంబంధం ఉంది. జమ్ము కశ్మీర్ పోలీసులతో పాటు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు అతడిని విచారించేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లో దాడులతో తెగబడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో భద్రతను ముమ్మరం చేయడంతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లు యత్నాలను భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment