క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు, రూ.16 లక్షలు స్వాధీనం | Vijayawada CP Dwaraka Tirumala Rao Arrested Cricket Betting Gang And Seized Rs 16 Lakhs | Sakshi
Sakshi News home page

ప్లేయింగ్‌, ఈటింగ్‌, ఫ్యాన్సీ, వంటి పాస్‌ కోడ్‌తో బెట్టింగ్‌

Published Wed, Dec 4 2019 3:18 PM | Last Updated on Wed, Dec 4 2019 3:25 PM

Vijayawada CP Dwaraka Tirumala Rao Arrested Cricket Betting Gang And Seized Rs 16 Lakhs - Sakshi

సాక్షి, విజయవాడ: జిల్లాలోని మారుతినగర్‌ ప్రాంతంలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ... ఈ ముఠాను ప్రసాదరావు అనే వ్యక్తి నిర్వహిస్తుంటాడని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మొత్తం 19 మంది ఉన్న ఈ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. ఈ క్రమంలో వీరినుంచి లెన్త్‌ బాక్స్‌, 19 సెల్‌ఫోన్లు, 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

కాగా ఈ లెన్త్‌ బాక్స్‌ నుంచి అందరూ కాన్పరెన్స్‌ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతూ.. ప్లేయింగ్‌, ఈటింగ్‌, ఫ్యాన్సీ, 48.. 50 అనే కోడ్‌ భాషతో బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్‌కు సంబంధించిన మూలాలు పూర్తి స్థాయిలో దొరకలేదని అన్నారు. ఈ బెట్టింగ్‌ విజయవాడలోనే కాక హైదరబాద్‌, ముంబైలలో ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారమని అందినట్లు తెలిపారు. ఇక నగదు బదిలీ అంతా ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కువగా జరుపుతూ చాలా పకడ్బందీగా ఈ బెట్టింగ్‌ వ్యవహరాన్ని నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement