Cricket Betting Gang
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ స్థావరాలపై దాడులు నిర్వహించి 31 మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష నగదు, 6 కిలోల గంజాయి, రెండు కార్లు, 7 ల్యాప్‌టాప్‌లు, 8 కాలిక్యులేటర్లు, రెండు కమ్యూనికేటర్లు, పది బెట్టింగ్ అకౌంట్ పుస్తకాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు వినాయక నగర్‌కు చెందిన షేక్ షాహీద్ అక్రమ్, ఖాజామొహిద్దీన్ అలియాస్ కల్తీ, భూమిరెడ్డి సురేష్ రెడ్డి, మునగా రామాంజనేయులు అలియాస్ రాము మరికొంతమంది కలిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా గంజాయి కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం అరెస్టైన వారు, పరారీలో ఉన్న ప్రధాన బుకీలు కలిసి సుమారు రూ.34.78 కోట్ల మేర బెట్టింగ్‌లు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలను సేకరించి ఇన్‌కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు నివేదిస్తామన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఎస్ఈబీ అదనపు ఎస్పీ చక్రవర్తి, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావును, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠాల అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముఠాలను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లాకి చెందిన ప్రధాన బుకీలతో పాటు మరి కొంత మంది హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. (డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు..) డైమండ్ 999 అనే యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహణ ద్వారా 67 లక్షల రూపాయల మేరకు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారి నుంచి 8.35 లక్షల రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు, 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. (బెట్టింగ్ కాస్కో.. తీస్కో !) -
డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 22 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకోగా, తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. సీపీ సజ్జనార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. చందూర్ శశాంక్ అనే ప్రధాన బూకీతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. భర్కత్ అనే ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడని, మొబైల్ ఫోన్ లోనే ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం) బెట్ 365, డ్రీం 11, ఎంపీఎల్, బెట్ వే, డ్రీంగురు, మై 11 సర్కిల్, బెట్ 365, కోరల్, బివిన్, 777 బెట్, డెఫాబెట్, విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, బెట్‌ఫ్రడ్, లోటస్ క్రికెట్ లైన్ తదితర మొబైల్ యాప్‌లలో వచ్చే రేటింగ్‌లు ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎవరికైనా బెట్టింగ్‌లకు సంబంధించిన సమాచారం తెలిస్తే 9490617444 నంబర్‌కు కాల్ చేయాలని సీపీ విజ్క్షప్తి చేశారు. ‘‘స్టూడెంట్స్ ఎక్కువగా బెట్టింగ్‌లలో పార్టీసిపెట్ చేస్తున్నారు. డబ్బు ఎవ్వరికీ ఊరికే రావు. కష్టపడాలి. రాత్రికి రాత్రే శ్రీమంతుడు అవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు. బెట్టింగులకు నగర యువత దూరంగా ఉండాలని’’ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.(చదవండి: వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి..) -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు, రూ.16 లక్షలు స్వాధీనం
సాక్షి, విజయవాడ: జిల్లాలోని మారుతినగర్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ... ఈ ముఠాను ప్రసాదరావు అనే వ్యక్తి నిర్వహిస్తుంటాడని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మొత్తం 19 మంది ఉన్న ఈ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో వీరినుంచి లెన్త్ బాక్స్, 19 సెల్ఫోన్లు, 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ లెన్త్ బాక్స్ నుంచి అందరూ కాన్పరెన్స్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతూ.. ప్లేయింగ్, ఈటింగ్, ఫ్యాన్సీ, 48.. 50 అనే కోడ్ భాషతో బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్‌కు సంబంధించిన మూలాలు పూర్తి స్థాయిలో దొరకలేదని అన్నారు. ఈ బెట్టింగ్ విజయవాడలోనే కాక హైదరబాద్, ముంబైలలో ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారమని అందినట్లు తెలిపారు. ఇక నగదు బదిలీ అంతా ఆన్లైన్ ద్వారా ఎక్కువగా జరుపుతూ చాలా పకడ్బందీగా ఈ బెట్టింగ్ వ్యవహరాన్ని నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. -
ఇంటి దొంగల ఏరివేత షురూ..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ మాత్రం ఇంటి దొంగల గుట్టు పట్టేశారు. అసాంఘిక శక్తులతో చేతులు కలిపి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న వారి సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో జిల్లాలోని అవినీతి పోలీసు అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే పలువురు గ్రానైట్ అక్రమ రవాణా ముఠా సభ్యులు, క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న ఎస్పీ వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడంతోపాటు, ఇంటి దొంగల పాత్రపై విచారణ జరపడంతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. జిల్లాకు చెందిన పలువురు కీలక బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లగా, బెట్టింగ్ వ్యవహారాల్లో సంబంధాలు ఉన్న పోలీసుుల్లో మాత్రం కలవరం మొదలైంది. ఇప్పటికే ఓ పోలీస్ అధికారి సెలవుపై వెళ్లగా, మరొకరికి చార్జి మెమో ఇచ్చారు. అయితే తమవంతు ఎప్పుడు వస్తుందోననే భయాందోళనలో అవినీతి పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిసింది. విచారణలో కీలక ఆధారాలు.. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ గ్రానైట్, గుట్కా, రేషన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలతోపాటు క్రికెట్ బెట్టింగ్‌పై గత కొద్దికాలంగా సీరియస్‌గా దృష్టి సారించారు. అక్రమార్కులకు పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బంది నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు అంతా సహకరిస్తున్నారనే సమాచారంతో ఎస్పీ రహస్య విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల ఒంగోలు నగరంలో ఓ క్రికెట బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దొంగ వే బిల్లులతో గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను, గుట్కా రాకెట్‌ను పట్టుకున్నారు. విచారణలో కీలక విషయాలు బయటకు రావడంతో దాని ఆధారంగా చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఎస్పీ దూకుడును తెలుసుకున్న గ్రానైట్ మాఫియా, కీలక క్రికెట్ బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 15 రోజులు దాటుతున్నా పోలీసులకు ఆచూకీ దొరక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంటి దొంగలపై వేటు.. అసాంఘిక శక్తులకు అండగా ఉంటూ భారీ మొత్తంలో నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గత 15 రోజులుగా జిల్లాలో అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై రహస్య విచారణ చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులు, పలువురు సిబ్బంది భారీస్థాయి అవినీతికి పాల్పడుతున్న విషయం ఎస్పీ విచారణలో తేలడంతో వారం రోజుల్లో వీరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గ్రానైట్ మాఫియా, గుట్కా రాకెట్, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో అక్రమార్కుల కాల్ లిస్టు ఆధారంగా ఎస్పీ వివరాలు సేకరించినట్లు సమాచారం. అక్రమార్కులు, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఇంటి దొంగల జాబితాను ఎస్పీ సిద్ధం చేస్తున్నట్లు తెలియడంతో అవినీతి ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
గుంటూరు: గతంలో మాదిరిగా కమ్యూనికేటర్ బాక్స్ లేకుండా కొద్ది మందితో మాత్రమే రహస్యంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న నలుగురిని స్థానిక పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు సంయుక్తంగా దాడులు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. మంగళగిరికి చెందిన వ్యక్తి ఈనెల 15న మంగళగిరిలో క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్, మంగళగిరి పోలీసులను అప్రమత్తం చేశారు. మంగళగిరికి చెందిన సబ్బుకీ ఎం.నరేష్, ఫండర్స్ ఎం.శ్రీకాంత్, ఆర్ వెంకటేశ్వరరావు, పి.నాగార్జున సోమవారం పార్క్ రోడ్డులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న రూ.5.60 లక్షల నగదు, 6 సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి వారికి క్యాష్ రివార్డు అందచేస్తామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీలు వైటీ నాయుడు, బి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, కర్నూలు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును కర్నూలు త్రీ టౌన్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ముఠాపై దాడి చేసిన త్రీ టౌన్ పోలీసులు.. ముఠాలోని 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5,56,500 రూపాయల నగదుతో పాటు, 2.25 కోట్ల రూపాయల విలువ చేసే 189 ప్రామిసరీ నోట్లు, 30 సెల్ఫోన్లు, 92 చెక్కులు, ఒనిడా టీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో 11 మంది పరారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిలో విద్యార్థులు అధికంగా ఉండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. -
17 మంది క్రికెట్ బుకీల అరెస్టు
మార్కాపురం: డివిజన్ కేంద్రం మార్కాపురంలో 17 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.81 వేల నగదు, 10 సెల్ఫోన్లు, కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు చెప్పారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 7వ తేదీ రాత్రి హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్ కేథార్ ఇంటర్నెట్ షాప్, ఓ ఫర్నిచర్ షాప్‌పైన ఉన్న ఇంటర్నెట్ షాప్‌లో కొంత మంది క్రికెట్ బెట్టింగ్‌లు పెడుతున్నట్లు పట్టణ ఎస్ఐ కోటయ్యకు సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో వెళ్లి క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మార్కాపురం మండలం రాయవరం వద్ద కొంతమంది క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నట్లు డీఎస్పీకి సమాచారం అందటంతో ఆయన రూరల్ ఎస్ఐ మల్లికార్జున్‌ను అక్కడికి పంపిం చారు. క్రికెట్ బెట్టింగ్ పెడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద 17 మంది క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నట్లు గుర్తించి వారి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారణ చేయగా మరికొందరి పేర్లు తెలిపారు. వీరిలో ముగ్గురు ఆర్గనైజర్లు, మరో నలుగురు క్రికెట్ బుకీలు ఉన్నారు. వారు పరార్ అయ్యారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టుకున్న 17 మంది ప్రొద్దుటూరు, బెంగళూరుల్లో కూడా క్రికెట్ బెట్టింగ్‌లు పెడుతుంటారని డీఎస్పీ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణ, రూరల్ ఎస్ఐలు కోటయ్య, మల్లికార్జునరావు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
కాయ్ రాజాల పట్టివేత...
సాక్షి, కర్నూలు: జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, కోవెలకుంట్ల ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈ మేరకు సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరా నేతృత్వంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. కర్నూలు నగరం పాతబస్తీలోని లాల్ మసీదు ఎదురుగా ఉన్న సొహైల్ ఇంటితో పాటు బిర్లా కాంపౌండ్‌లోని శశికాంత్ ప్లాజాలోని మల్లికార్జునగౌడ్ ఆఫీస్ (సారథి కమ్యూనికేషన్స్)లో సోదాలు నిర్వహించారు. బుకీ ఈడిగ మల్లికార్జున గౌడ్, సహాయ బుకీలు షేక్ మహమ్మద్ సొహైల్, అశోక్‌కుమార్, బెట్టింగ్ రాయుళ్లు రవికుమార్, వెంకటేశ్వర్లు, సనావుల్లా, షేక్ ఫయాజ్, అంజాద్ అలీ తదితరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6.44 లక్షల నగదు, కంప్యూటర్, టీవీ, ల్యాప్‌టాప్, సెటాప్ బాక్సు, రెండు ఏటీఎం కార్డులు, రెండు నోట్బుక్లు, బ్యాంకు పాస్ బుక్, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎస్పీ గోపినాథ్ జెట్టి ఎదుట హాజరుపరిచారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషాతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. మరో బుకీ మహమ్మద్ షొయబ్, బెట్టింగ్ రాయుళ్లు లక్ష్మణ్, మజీద్, షేక్ ఆసిఫ్ తదితరులు పరారీలో ఉన్నారు. మల్లికార్జున గౌడు గతంలో పేకాట దాడుల్లో కూడా పలుమార్లు పట్టుబడ్డాడు. ప్రధాన బుకీ ప్రొద్దుటూరు శంకర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బుకీ శంకర్‌తో కర్నూలుకు సంబంధించిన మల్లికార్జున గౌడ్, మహమ్మద్ సొహైల్, అశోక్ కుమార్‌లు బెట్టింగ్ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. గత సంవత్సరం కూడా స్వల్ప స్థాయిలో బెట్టింగ్ వ్యవహారాన్ని వీరు నిర్వహించారు. ప్రధానంగా గెలుపు, ఓటములపై చిన్న టీమ్, పెద్ద టీమ్‌లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఆర్థిక వ్యవహారాలన్నీప్రధాన బ్యాంకుల ద్వారానే... ఆర్థిక వ్యవహారాలన్నీ ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ వంటి ప్రధాన బ్యాంకుల ద్వారానే బెట్టింగ్ కార్యకలాపాలన్నీ సోషల్ మీడియా(వాట్సాప్)ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు విచారణలో బయటపడింది. ల్యాప్‌టాప్, సెల్ఫోన్ల ద్వారా నెట్‌ను ఉపయోగించి బెట్టింగ్ కార్య కలాపాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల, కోవెలకుంట్ల, ఆదోని ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలోని బెట్టింగ్ వ్యవహారాలు సాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. కర్నూలులో జరిగిన బెట్టింగ్ వ్యవహారంలో మొత్తం 43 మంది 62 అకౌంట్ల ద్వారా బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు విచారణలో వెలుగు చూసినట్లు వెల్లడించారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో విద్యార్థులు, యువకులు బుకీల వలలో పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని, తమ పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు నిఘా ఉంచుకుని వారిని క్రమపద్ధతిలో పెంచి పోషించుకోవాలని సూచించారు. నిఘా లేకపోతే పిల్లల భవిష్యత్ నాశనమవుతుందన్నారు. వన్‌టౌన్ సీఐ మురళీధర్‌రెడ్డి, టూటౌన్ సీఐ రామకిషోర్, కర్నూలు రూరల్ సీఐ పవన్ కిషోర్, సీసీఎస్ సీఐ లక్ష్మయ్య, మధుసూదన్‌రావు, ఎస్ఐలు శ్రీకాంత్‌రెడ్డి, మధుసూదన్, శ్రీనివాసులు, రమేష్, సిబ్బంది బాలరాజు, బాషా తదితరులను ఎస్పీ అభినందించారు. కుమారుడు బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలు చేశాడు వ్యసనాలకు బానిసై తమ కుమారుడు విజయ భాస్కర్‌రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ కుటుంబాన్ని అప్పులపాలు చేశాడని నంద్యాల పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు రామిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ ఎస్పీ గోపినాథ్ జెట్టికి మొర పెట్టు కున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో పోలీసు ప్రజాదర్బార్‌కు వచ్చిన వృద్ధ దంపతులు.. క్రికెట్ బెట్టింగ్ ఆడు తూ ఆర్థికంగా నష్టపోయిన తన కుమారుడిని నిలదీసినందుకు తమపై దాడి చేశాడని, అతని నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీని వేడుకున్నారు. – పోలీస్ ప్రజాదర్బార్‌ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు -
బెట్టింగ్‌పై నిఘా పెంచిన పోలీసులు
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు ఇంటిపై దాడి చేశారు. వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.4 లక్షల నగదు, ఐదు సెల్ ఫోన్లతోపాటు రెండు టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
కుత్బుల్లాపూర్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ అడ్డాపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1.49 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్వోటీ, పోలీసుల కథనం ప్రకారం.. పద్మానగర్ రింగ్ రోడ్డు వద్ద గత కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పక్కా ప్రణాళికతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి శనివారం రాత్రి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 8 మందిని వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.49 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందరినీ పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్బీనగర్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో ఆదివారం క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి సహా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి రూ. లక్షా 41 వేలు, ల్యాప్‌ట్యాప్, టీవీ, వాహనంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌజ్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం...లంగర్‌హౌజ్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన టి.సత్యప్రకాష్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. మంగళవారం సాయంత్రం భారత్, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తన ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై జలందర్‌రెడ్డి తన సిబ్బందితో దాడి చేసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ జరిపిన అనంతరం అర్థరాత్రి దాటాక లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్‌తో పాటు డబ్బులు వసూలు చేసే నల్లకుంటకు చెందిన అమిన్ మధాని(29), ఆబిడ్స్‌కు చెందిన మిరాన్ బర్దే(24), సాహిల్ నురాని(18)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కదిరిలో క్రికెట్ బెట్టింగ్వీరులు అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో 13 మంది క్రికెట్ బెట్టింగ్వీరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కదిరి పట్టణంలోని ఓ ఇంట్లోని వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంపై దాడి చేసి.... వారిని అదుపులోకి తీసుకున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
* 14.42 లక్షల రూపాయలతో పాటు * మారణాయుధాలు, డమ్మీ పిస్తోల్లు,వాహనాలు స్వాధీనం * ప్రధాన బుకీ పరార్ మల్కాజిగిరి(హైదరాబాద్‌సిటీ) : మల్కాజిగిరి: ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా ఆటకు ఎస్ఓటీ పోలీసులు చెక్ పెట్టారు. ముఠాలోని ఇద్దరు నిర్వాహకులతో పాటు ముగ్గురు కలెక్షన్ ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. బుధవారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్ఆర్ కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహ్మద్ గౌస్ ఐదేళ్ల క్రితం మౌలాలి ప్రాంతానికి వచ్చి ఏపీఐఐసీ కాలనీలోని వైభవ్ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయాల్లో బెట్టింగ్ నిర్వహిస్తూ నగరంలోనే ప్రధాన బుకీగా గౌస్ పేరు పొందాడు. ఇటీవల ఎస్ఓటీ టీం వనస్థలిపురంలో బుకీతో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసినపుడు గౌస్ పై కేసు నమోదైంది. అతను ఉంటున్న చిరునామా పక్కాగా తెలుసుకున్న ఎస్ఓటీ విభాగం ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, వి.ఉమేందర్‌లు బుధవారం పెంట్ హౌస్ పై దాడి చేశారు. ఆ సమయంలో ప్రధాన బుకీ గౌస్ కుమారుడు సివిల్ ఇంజనీర్ మహ్మద్ అలి(25), గ్రాఫిక్ వర్క్ చేసే మరో కుమారుడు షౌకత్ అలి(22) తో పాటు పంటర్స్( బెట్టింగ్ చేసేవారు) నుంచి డబ్బులు కలెక్షన్ చేసే ఏజెంట్లు కుషాయిగూడకు చెందిన శ్రీనివాస్(29),ఏపీఐఐసీ కాలనీకి చెందిన వాహీద్(39), సలీం(39) తో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న నాగారంకు చెందిన మోకు జగన్మోహన్రెడ్డి(46), కుషాయిగూడకు చెందిన వీరేష్(33), కాప్రాకు చెందిన దీపక్(32)లను అరెస్ట్ చేశారు.గౌస్ కుమారుల నుంచి 12,82,000 ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న వారి నుంచి 1,60,000 రూ మొత్తం 14.42 లక్షలు, రెండు తల్వార్లు, రెండు డమ్మీ పిస్టోల్స్, ఒక ఎయిర్‌గన్, ఒక ల్యాప్‌టాప్, ఒక ట్యాబ్,18 మొబైల్స్, రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు. ప్రధాన బుకీ గౌస్‌తో పాటు అతని అనుచరులు ఆరుగురు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. గౌస్ ఇతర రాష్ట్రాలో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని ప్రధానంగా విధ్యార్థులు, చిరు వ్యాపారులను ఈ బెట్టింగ్ లోకి ఆకర్షిస్తాడని డీసీపీ తెలిపారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన వారు గొడవకు దిగితే బెదిరించడానికి కత్తులు, పిస్టోల్స్ ఉపయోగించేవాడన్నారు. తనకు ఉన్న డీడీ కాలనీలో విలాసవంతమైన ఫ్లాట్, దమ్మాయిగూడలో గెస్ట్గౌస్ లో కూడా బెట్టింగ్ నిర్వహించేవాడని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లతో పాటుసిబ్బంది రాములు, ఆంజనేయులును అభినందిస్తున్నామని రివార్డు కోసం సిఫార్స్ చేస్తామన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
మల్కాజిగిరి(హైదరాబాద్): మల్కాజిగిరిలో హైటెక్ తరహాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు సీజ్ చేశారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పార్వతీపురం: క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా కురుపాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా గంటా వీధి, మెయిన్ రోడ్డులో సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్ నడుపుతున్న 9 మందినిశుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు సెల్ఫోన్లు ఐదు వేల రూపాయల వరకు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
శ్రీకాకుళం క్రైం: క్రికెట్ మ్యాచ్‌లు అవుతున్నాయంటే చాలు ఈ ముఠాకు పండగే పండగ. క్రికెట్ అభిమానులను ఆకట్టుకుని వారిని నెమ్మదిగా బెట్టింగ్ ముసుగులోకి దించుతారు. వారి అభిమానాన్నే ఆసరాగా చేసుకుని వేలు, ఆపై లక్షల రూపాయలను బెట్టింగ్ కాయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్-2015 మ్యాచ్‌లు ఈ ముఠాకు కల్పవృక్షంగా మారాయి. నెట్ చాటింగ్, సెల్ఫోన్లతో రూ.లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ సాగిస్తూ వచ్చారు. మధ్యవర్తిత్వం నిర్వహిస్తూ శ్రీకాకుళం పట్టణ కేంద్రంగా రూ.లక్షల్లో పొమ్మునార్జించే ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యులను శ్రీకాకుళం డిఎస్పీ కె.భార్గవ్రావ్నాయుడు తన కార్యాలయంలో ఆదివారం మీడి యా ముందు ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతుందన్న సమాచారంతో జిల్లా ఎస్పీ ఏఎస్.ఖాన్ బెట్టింగ్ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. తమ సిబ్బందికి తగు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో చిన్నబరాటం వీధిలోని ఓ సందులో ఉన్న గృహాంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నారాయణ శెట్టి వెంకట కిరణ్‌కుమార్ అలియాస్ కిరణ్, సత్యవరపు లవకుమార్ అలియాస్ లవ, టంకాల వెంకటరమణ అలియాస్ రమణ, పసుమర్తి కోటిబాబు అలియాస్ కోటి, నందిగాం శ్రీనివాసపట్నాయక్ అలియాస్ శ్రీను, మాణిక్యం సూరిబాబు అలియాస్ సూరి, తుమ్మ రామూర్తిలతో పాటు ఇంటి యజమాని పసుమర్తి జ్యో తిబాబు అలియాస్ జ్యోతిలను పోలీసు లు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక టీవీ, రూ.49,350 నగదు, 13 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రదారి కిరణ్ క్రికెట్ బెట్టింగ్ ముఠాకు ప్రధాన సూత్రదారి కిరణ్‌కుమార్‌గా పోలీసులు గుర్తిం చారు. ఆయన గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహించినట్టు తెలియవచ్చింది. ముందుగా క్రికెట్ అభిమానులను గుర్తించడం, వారిని తన అనుయాయులతో మెల్లగా బెట్టింగ్ మాయలోకి దించడం ఈయన ప్రధాన విధి. కేవలం సెల్ఫోన్లపైనే మొత్తం బెట్టింగ్ తంతును సాగిస్తారు. క్రికెట్ లైవ్ సాగుతున్న సమయంలో పరుగులపై కూడా ఫోన్ల ద్వార బెట్టింగ్‌లు కాస్తుంటారు. ఒడిపోయిన వారి వద్దకు తను ముందుగా ఏర్పా టుచేసుకున్నవారు వెళ్లి డబ్బులు తేవ డం, గెలిచిన వారికి డబ్బులు ఇవ్వడం చేస్తుంటారు. ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠా లో దొరికిన ఎనిమిది మందిని పోలీ సులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ క్రైమ్ పార్టీ ఎస్సై వై.రవికుమార్‌ను, సిబ్బందిని ఎస్పీ ఖాన్ అభినందించారు.