
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముఠాలను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లాకి చెందిన ప్రధాన బుకీలతో పాటు మరి కొంత మంది హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. (డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు..)
డైమండ్ 999 అనే యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహణ ద్వారా 67 లక్షల రూపాయల మేరకు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారి నుంచి 8.35 లక్షల రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు, 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. (బెట్టింగ్ కాస్కో.. తీస్కో !)
Comments
Please login to add a commentAdd a comment