
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పశ్చిమ్ విహార్ ప్రాంతంలోని ఓ క్లబ్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడటంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ పార్టీకి హాజరైన ఏడుగురు యువతులు సహా 31 మందిని అరెస్ట్ చేశారు. క్లబ్ యజమాని ఆయన సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లు, హుక్కాలను సీజ్ చేశారు. ప్లాగ్ క్లబ్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని దాడులు చేపట్టారు. మంగళవారం రాత్రి ఈ పార్టీ జరగ్గా, పోలీసులు దాడి చేసిన సమయంలో పలువురు యువతీ యువకులు పీకల్లోతు మద్యం సేవించి ఉన్నారని, కరోనా లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని స్ధానికులు తెలిపారు. క్లబ్ యజమాని లావిష్ ఖురానా, ఆయన సోదరుడు కాశిష్ ఖురానాలను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి : బంజారాహిల్స్‌లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment