ముంబై : యస్ బ్యాంక్ కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవాన్, ధీరజ్ వాధవాన్‌లను ఈడీ గురువారం అరెస్ట్ చేసింది. వీరిని మనీల్యాండరింగ్ నిరోధక (పీఎంఎల్‌ఏ) న్యాయస్ధానం ఎదుట హాజరుపరచగా కోర్టు పదిరోజుల కస్టడీకి తరలించింది. యస్ బ్యాంక్ కేసులో ఏప్రిల్ 26న మహాబలేశ్వర్‌లో వాధవాన్ సోదరులను సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు మరో 12 మందితో కలిసి ఖండాలా నుంచి మహాబలేశ్వర్‌కు ప్రయాణించడం కలకలం రేపింది.
లాక్‌డౌన్ ఉల్లంఘనల కింద వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం సీబీఐ వారిని కస్టడీలోకి తీసుకుంది. ఇక వాధవాన్ సోదరులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్‌ఎఫ్‌ఎల్ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు యస్ బ్యాంక్ కేసులో ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment