ట్విట్టర్‌లో ఫేక్ ఐడీ
► మార్ఫింగ్‌తో మహిళ అసభ్య చిత్రాలు
► ఏలూరు పోలీసుల అదుపులో నిందితుడు
నెల్లూరు (క్రైమ్) : ఓ యువకుడు ట్విట్టర్‌లో ఏలూరుకు చెందిన యువతి పేరుతో ఫేక్ ఐడీ ప్రారంభించాడు. ఆమె చిత్రాలను ఫేస్‌బుక్ నుంచి సేకరించి వాటిని అసభ్యకరమైన చిత్రాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఏలూరు ఒకటోనగర పోలీస్‌స్టేషన్ పరిధి లో నివాసముంటున్న వల్లి అనే యువతికి ఇటీవల ఆమె స్నేహితులు ఫోన్ చేసి ట్విట్టర్‌లో ఆమెకు సంబంధించిన అసభ్యకర చిత్రాలు ఉన్నాయని చెప్పారు. తాను ట్విట్టర్‌లో ఖాతాను ప్రారంభించలేదని పట్టించుకోలేదు. అయితే వారు ట్విట్టర్ ఖాతా వివరాలు చెప్పడంతో బాధితురాలు పరిశీలించింది. తన చిత్రాలను అసభ్యకర చిత్రాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి ఉండటంతో కన్నీటి పర్యంతమైంది. బాధితురాలు తల్లిదండ్రుల సహకారంతో ఏలూ రు ఒకటోనగర ఇన్‌స్పెక్టర్ రాజకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
నిందితుడు నెల్లూరీయుడు
ఏలూరు ఒకటో నగర ఎస్‌ఐ కె.రామారావు సైబర్ క్రైమ్ అధికారుల సహకారంతో ట్విట్టర్‌లోని పోస్టింగ్‌లు, అసభ్యకర చిత్రా లు ఎక్కడ నుంచి వచ్చాయో వివరాలు సేకరించారు. నిందితుడు నెల్లూరు నగర వాసిగా గుర్తించారు. నిందితుడు ఓ ప్ర ముఖ ఇంటర్నెట్ సంస్థ నెట్‌ను వినియోగిస్తున్నాడని తెలుసుకుని సదరు సంస్థను సంప్రదించి అతని వివరాలను సేకరిం చారు. నేతాజీనగర్‌లోని సెయింట్‌పాల్స్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న నిందితుడు వెంకటేశ్వర్లును శ నివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడితో పాటు కంప్యూటర్‌ను సీజ్ చేసి తమ వెంట ఏలూరుకు తీసుకెళ్లారు.
నేరానికి పాల్పడిందిలా..
వెంటకేశ్వర్లు డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొన్నేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాడు.ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని అందమైన యువతలను ఫేస్‌బుక్‌లో వెతికి వారి పేర్లతో న కిలీ ఐడీలు ప్రారంభించేవాడు. అసభ్యకరమైన చిత్రాలకు వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాడు. కొన్ని నెలల కిందట ఏలూరుకు చెందిన వల్లి అనే యువతికి సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్ నుంచి డౌన్‌లోడ్ చేశాడు. ఆమె పేరుపై ట్విట్టర్‌లో ఖాతా తెరిచాడు. కొద్ది రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలనే ఆప్‌లోడ్ చేశాడు. అనంతరం మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన చిత్రాలను పోస్టింగ్ చేశా డు. అయితే అతని ఇంట్లో పర స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు- ఇతరుల ఆస్తిని, సంపదను ఆశించేవాడు-ఇతరుల కష్టాన్ని చూసి ఆనందించే నీచుడు-ధన మధంతో చివరికి తానే నశించిపోతున్నాడు’ అనే సూక్తుల చూసి పోలీసులను విస్మయానికి గురయ్యారు.