Indecent images
-
అసభ్య రాతల్ని అడ్డుకున్న బాలికలపై దాడి
సుపౌల్: స్కూలు గోడలపై అసభ్య రాతలను అడ్డుకున్న విద్యార్థినులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సుపౌల్ జిల్లాలోని దర్పాఖ గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ) పక్కనే మరో స్కూలు ఉంది. అయితే కేజీబీవీ బాలికలు మైదానంలో ఆడుకుంటుండగా అక్కడకు చేరుకున్న కొందరు పక్క స్కూలు అబ్బాయిలు గోడలపై అసభ్య రాతలు రాశారు. దీంతో ఆ అమ్మాయిలు వీళ్లను తన్నితరిమేశారు. వీరంతా ఇళ్లకు వెళ్లి తమపై జరిగిన దాడిని తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్తులంతా ఏకమై మైనర్ బాలికలపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో 30 మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, ఓ మహిళ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
ట్విట్టర్లో ఫేక్ ఐడీ
► మార్ఫింగ్‌తో మహిళ అసభ్య చిత్రాలు ► ఏలూరు పోలీసుల అదుపులో నిందితుడు నెల్లూరు (క్రైమ్) : ఓ యువకుడు ట్విట్టర్లో ఏలూరుకు చెందిన యువతి పేరుతో ఫేక్ ఐడీ ప్రారంభించాడు. ఆమె చిత్రాలను ఫేస్బుక్ నుంచి సేకరించి వాటిని అసభ్యకరమైన చిత్రాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశాస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఏలూరు ఒకటోనగర పోలీస్‌స్టేషన్ పరిధి లో నివాసముంటున్న వల్లి అనే యువతికి ఇటీవల ఆమె స్నేహితులు ఫోన్ చేసి ట్విట్టర్లో ఆమెకు సంబంధించిన అసభ్యకర చిత్రాలు ఉన్నాయని చెప్పారు. తాను ట్విట్టర్లో ఖాతాను ప్రారంభించలేదని పట్టించుకోలేదు. అయితే వారు ట్విట్టర్ ఖాతా వివరాలు చెప్పడంతో బాధితురాలు పరిశీలించింది. తన చిత్రాలను అసభ్యకర చిత్రాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్‌చేసి ఉండటంతో కన్నీటి పర్యంతమైంది. బాధితురాలు తల్లిదండ్రుల సహకారంతో ఏలూ రు ఒకటోనగర ఇన్స్పెక్టర్ రాజకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడు నెల్లూరీయుడు ఏలూరు ఒకటో నగర ఎస్ఐ కె.రామారావు సైబర్ క్రైమ్ అధికారుల సహకారంతో ట్విట్టర్‌లోని పోస్టింగ్‌లు, అసభ్యకర చిత్రా లు ఎక్కడ నుంచి వచ్చాయో వివరాలు సేకరించారు. నిందితుడు నెల్లూరు నగర వాసిగా గుర్తించారు. నిందితుడు ఓ ప్ర ముఖ ఇంటర్నెట్ సంస్థ నెట్‌ను వినియోగిస్తున్నాడని తెలుసుకుని సదరు సంస్థను సంప్రదించి అతని వివరాలను సేకరిం చారు. నేతాజీనగర్‌లోని సెయింట్‌పాల్స్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న నిందితుడు వెంకటేశ్వర్లును శ నివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడితో పాటు కంప్యూటర్ను సీజ్ చేసి తమ వెంట ఏలూరుకు తీసుకెళ్లారు. నేరానికి పాల్పడిందిలా.. వెంటకేశ్వర్లు డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొన్నేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాడు.ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని అందమైన యువతలను ఫేస్బుక్లో వెతికి వారి పేర్లతో న కిలీ ఐడీలు ప్రారంభించేవాడు. అసభ్యకరమైన చిత్రాలకు వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. కొన్ని నెలల కిందట ఏలూరుకు చెందిన వల్లి అనే యువతికి సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేశాడు. ఆమె పేరుపై ట్విట్టర్లో ఖాతా తెరిచాడు. కొద్ది రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలనే ఆప్‌లోడ్ చేశాడు. అనంతరం మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన చిత్రాలను పోస్టింగ్ చేశా డు. అయితే అతని ఇంట్లో పర స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు- ఇతరుల ఆస్తిని, సంపదను ఆశించేవాడు-ఇతరుల కష్టాన్ని చూసి ఆనందించే నీచుడు-ధన మధంతో చివరికి తానే నశించిపోతున్నాడు’ అనే సూక్తుల చూసి పోలీసులను విస్మయానికి గురయ్యారు. -
వాట్సాప్‌లో అసభ్య చిత్రాలు
- యువకుడి అరెస్ట్ టీనగర్: వాట్సాప్ ద్వారా అసభ్య చిత్రాలను పంపుతున్న ఎంబీఏ పట్టభద్ర యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, తిరుముల్లైవాయిల్‌కు చెందిన లత అనే మహిళ పోలీసు కమిషనర్ కార్యాలయం గ్రీవెన్స్‌డేలో ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా తెలి పారు. తన భర్త విదేశాల్లో ఉన్నట్లు తెలిపారు. తన వివాహానికి ముందు చెన్నై పెరంబూరుకు చెందిన విమలనాథ్ను తాను ప్రేమించినట్లు తెలిపారు. అతనికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా మరొకరిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన పేరుతో విమల్నాథ్ నకిలీ ఫేస్బుక్ ప్రారంభించి, తన ఫొటోను కూడా అప్లోడ్ చేశాడని, దీని ద్వారా అసభ్య చిత్రాలు, వార్తలను తన బంధువులకు పంపుతున్నట్లు తెలిసిందన్నారు. తన భర్త సెల్‌ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్ ద్వారా వీటిని పంపుతున్నట్లు తెలిపారు. దీంతో తాను మానసిక వత్తిడికి గురవుతున్నానని, అందువల్ల విమల్నాథ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కమిషనర్ ఎస్ జార్జి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పోలీసులు విమల్నాథ్ను అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు. చెన్నై పెరంబూరు, వెంకట్రామన్ వీధికి చెందిన హరికృష్ణారావు కుమారుడు విమల్నాథ్ (27)ను శనివారం అరెస్టు చేశారు. పోలీసులు విచారణలో తాను లత ప్రేమించుకున్నామని, అయితే జాతకం సరిలేదన్న కారణంతో మరొకరిని వివాహం చేసుకుందని, దీంతో తనను మోసగించిన లతపై పగతీర్చుకునేందుకు ఈ విధంగా అసభ్య చిత్రాలను ఆమె ఫేస్బుక్ పేరుతో పోస్టు చేస్తూ వచ్చినట్లు తెలిపారు. పోలీసులు విమల్నాథ్ను కోర్టులో హాజరుపరచి పుళల్ సెంట్రల్ జైలులో నిర్బంధించారు.