వాట్సాప్‌లో అసభ్య చిత్రాలు | A youngster arrested to sending indecent images through watsapp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో అసభ్య చిత్రాలు

Published Mon, Jul 27 2015 8:36 AM | Last Updated on Fri, Jul 27 2018 1:11 PM

విమలనాథ్‌ - Sakshi

విమలనాథ్‌

- యువకుడి అరెస్ట్
టీనగర్: వాట్సాప్ ద్వారా అసభ్య చిత్రాలను పంపుతున్న ఎంబీఏ పట్టభద్ర యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, తిరుముల్లైవాయిల్‌కు చెందిన లత అనే మహిళ పోలీసు కమిషనర్ కార్యాలయం గ్రీవెన్స్‌డేలో ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా తెలి పారు. తన భర్త విదేశాల్లో ఉన్నట్లు తెలిపారు. తన వివాహానికి ముందు చెన్నై పెరంబూరుకు చెందిన విమలనాథ్‌ను తాను ప్రేమించినట్లు తెలిపారు. అతనికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా మరొకరిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన పేరుతో విమల్‌నాథ్ నకిలీ ఫేస్‌బుక్ ప్రారంభించి, తన ఫొటోను కూడా అప్‌లోడ్ చేశాడని, దీని ద్వారా అసభ్య చిత్రాలు, వార్తలను తన బంధువులకు పంపుతున్నట్లు తెలిసిందన్నారు.
 
 తన భర్త సెల్‌ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్ ద్వారా వీటిని పంపుతున్నట్లు తెలిపారు. దీంతో తాను మానసిక వత్తిడికి గురవుతున్నానని, అందువల్ల విమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కమిషనర్ ఎస్ జార్జి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పోలీసులు విమల్‌నాథ్‌ను అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు. చెన్నై పెరంబూరు, వెంకట్రామన్ వీధికి చెందిన హరికృష్ణారావు కుమారుడు విమల్‌నాథ్ (27)ను శనివారం అరెస్టు చేశారు. పోలీసులు విచారణలో తాను లత ప్రేమించుకున్నామని, అయితే జాతకం సరిలేదన్న కారణంతో మరొకరిని వివాహం చేసుకుందని, దీంతో తనను మోసగించిన లతపై పగతీర్చుకునేందుకు ఈ విధంగా అసభ్య చిత్రాలను ఆమె ఫేస్‌బుక్ పేరుతో పోస్టు చేస్తూ వచ్చినట్లు తెలిపారు. పోలీసులు విమల్‌నాథ్‌ను కోర్టులో హాజరుపరచి పుళల్ సెంట్రల్ జైలులో నిర్బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement