వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రామయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన అబ్దుల్లా కూకట్‌పల్లిలోని సిఫా ఎలక్ట్రికల్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతను డేటింగ్ వెబ్‌సైట్‌లో వైద్యుడిగా నకిలీ ఐడీ సృష్టించి యువతులు, వివాహితులతో చాటింగ్ చేసేవాడు.