అనుమానంతో కొట్టి చంపాడు | Man beats wife to death with frying pan, hides body in bed box | Sakshi
Sakshi News home page

అనుమానంతో కొట్టి చంపాడు

Published Thu, Oct 29 2015 3:46 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Man beats wife to death with frying pan, hides body in bed box

ఢిల్లీ: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను దారుణంగా  కొట్టి చంపేశాడో  ఓ  భర్త.  దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో అమానుషం చోటు చేసుకుంది. షరాఫత్(33) భార్య కవిత(32) పై అనుమానంతో నిత్యం వేధించేవాడు.   ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. 

 

అది తీవ్ర వాగ్వాదంగా మారటంతో ఆగ్రహంతో షరాఫత్ చేతికందిన పెనం(తవా) తీసుకుని భార్యపై దాడి చేశాడు. ముఖంపైన, తలపైన  విచక్షణా రహితంగా కొట్టాడు.  అంతే ఆమె రక్తమడుగులో కుప్పకూలిపోయింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాక  మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మంచం కింద ఉండే  సొరుగులో కుక్కేసాడు.   అనంతరం తన ముగ్గురు పిల్లలతో సహా  సొంత ఊరికి ఉడాయించాడు.  

పొరుగు వారి సమాచారంతో రంగంలోకి  దిగిన పోలీసులు షరాఫత్‌ను విచారించగా, అతగాడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడి  అరెస్ట్ చేసి,  భార్య ప్రాణాలు తీసేందుకు వాడిన పెనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  14  రోజులు  జ్యుడీషియల్ కస్టడీకి షరాఫత్‌ను తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement