ఉద్యోగం పేరుతో.. ఆర్నెళ్లు రేప్ చేశాడు | Delhi: Man arrested for luring Uzbek woman to India, raping her over six months | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పేరుతో.. ఆర్నెళ్లు రేప్ చేశాడు

Published Sun, Apr 2 2017 1:56 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

ఉద్యోగం పేరుతో.. ఆర్నెళ్లు రేప్ చేశాడు

ఉద్యోగం పేరుతో.. ఆర్నెళ్లు రేప్ చేశాడు

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువతి (22)ని రప్పించి, ఆమెను మోసం చేసి ఆర్నెళ్ల పాటు లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి చెందిన సోను అలియాస్ సుమిత్ అనే వ్యక్తికి ఫేస్‌బుక్ ద్వారా ఉజ్బెక్ యువతి పరిచయమైంది. గుర్గావ్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీలో తాను సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలకడంతో ఆమె భారత్‌కు వచ్చింది. ఆర్నెళ్ల క్రితం ఢిల్లీకి వచ్చిన ఉజ్బెక్ యువతిని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకుని, మెహ్రౌలీకి తీసుకెళ్లాడు. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఆమె నుంచి పాస్‌పోర్టు, డబ్బు తీసుకున్నాడు. ఆమెను ఓ ప్రాంతంలో ఉంచి, ఆరు నెలల పాటు దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్యపరీక్షలకు పంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోనే 15 రోజుల క్రితం ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మరో మహిళపై పార్టనర్ మరో నలుగురితో కలసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement