ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం తమ మర్చంట్ పార్టనర్స్ కోసం ప్రత్యేక హెల్త్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్లో 'పేటీఎం హెల్త్ సాథీ' అనే ప్రత్యేక హెల్త్ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది.
తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం ద్వారా తమ విస్తారమైన వ్యాపార భాగస్వాముల నెట్వర్క్‌కు తోడ్పాటు అందించడానికి పేటీఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చొరవ ఒక భాగం. వ్యాపార భాగస్వాముల శ్రేయస్సును పరిరక్షించడం, వారి ఆరోగ్యం, వ్యాపార కొనసాగింపును నిర్ధారించడం 'పేటీఎం హెల్త్ సాథీ' లక్ష్యం.
పేటీఎం హెల్త్ సాథీ ప్రయోజనాలు
నెలవారీ సబ్ స్క్రిప్షన్ పై నెలకు కేవలం రూ.35తో ప్రారంభమయ్యే పేటీఎం హెల్త్ సాథీ తన భాగస్వామ్య నెట్ వర్క్ పరిధిలో అపరిమిత డాక్టర్ టెలీ కన్సల్టేషన్, ఇన్ పర్సనల్ డాక్టర్ విజిట్స్ (ఓపీడీ) వంటి సేవలను అందిస్తోంది.వరదలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, సమ్మెలు వంటి వాటి కారణంగా వ్యాపార అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆదాయ రక్షణ కవరేజీని కూడా ఇది అందిస్తుంది.
డాక్టర్ టెలీ కన్సల్టేషన్ సర్వీస్‌తోపాటు ప్రముఖ ఫార్మసీలలో డిస్కౌంట్లు, రోగనిర్ధారణ పరీక్షలలో తగ్గింపులు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
క్లెయిమ్ ప్రాసెస్‌ను కూడా సులభతరం చేసింది. యాప్‌లోనే దీన్ని పూర్తి చేయవచ్చు.
'పేటీఎం హెల్త్ సాథీ' పైలట్ సర్వీస్ మే నెలలోనే ప్రారంభమైంది. ఇప్పటికే 3000 మందికి పైగా మర్చంట్ భాగస్వాములు ఉపయోగించుకున్నారు. ఇది విజయవంతం కావడంతో కంపెనీ ఈనెల ప్రారంభంలో తన వ్యాపారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment