Health plan
-
నో ఆల్కహాల్, నో టాక్సిక్ పీపుల్ మలైకా పోస్ట్: షాకవుతున్న ఫ్యాన్స్
చిరకాల ప్రియుడు అర్జున్ కపూర్‌తో నుంచి బ్రేకప్ తరువాత నటి మలైకా అరోరా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల కొన్ని పోస్ట్‌ల తరువాత 'నవంబర్ ఛాలెంజ్' ని ఆసక్తికరంగా ప్రకటించింది. మద్యం,నిద్రతోపాటు టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉంటానంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించేనా అంటూ షాక్ అవడం అభిమానుల వంతైంది.శారీరకంగా దృఢంగా ఉండటానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెలలో(నవంబరు)లో మలైకా చేయాలను కుంటున్న తొమ్మిది పనుల లిస్ట్‌ను ప్రకటించింది. మలైకా నవంబర్ ఛాలెంజ్ 1. మద్యం దూరంగా ఉండటం 2. ఎనిమిది గంటల నిద్ర. 3. మంచి గురువును 4. రోజూ వ్యాయామం 5. రోజుకు పదివేల అడుగులు. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం 8. రాత్రి 8 గంటల తర్వాత నోటికి తాః 9. విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం. శారీరంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి సానుకూలంగా, స్నేహంగా ఉండే వ్యక్తులతో సన్నిహితం ఉండటం కూడా అవసరమే అంటారు కూడా.కాగా అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మలైకా,అర్జున్ రిలేషన్లో ఉన్నారు. అయితే 'సింగమ్ ఎగైన్' మూవీప్రమోషన్ ఈవెంట్లో తాను ఇంకా సింగిల్ అని ప్రకటించి, మలైకాతో తన బంధం గురించి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం తేల్చి చెప్పేశాడు. సింగం ఎగైన్ మూవీలో విలన్‌గా అర్జున్ కపూర్ మంచి మార్కులే సాధించాడు. సినిమా సక్సెస్ కావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నాడు. -
రూ.35లకే పేటీఎం ప్రత్యేక హెల్త్ ప్లాన్.. ప్రయోజనాలు ఇవే..
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం తమ మర్చంట్ పార్టనర్స్ కోసం ప్రత్యేక హెల్త్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్‌లో 'పేటీఎం హెల్త్ సాథీ' అనే ప్రత్యేక హెల్త్ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది.తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం ద్వారా తమ విస్తారమైన వ్యాపార భాగస్వాముల నెట్‌వర్క్‌కు తోడ్పాటు అందించడానికి పేటీఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చొరవ ఒక భాగం. వ్యాపార భాగస్వాముల శ్రేయస్సును పరిరక్షించడం, వారి ఆరోగ్యం, వ్యాపార కొనసాగింపును నిర్ధారించడం 'పేటీఎం హెల్త్ సాథీ' లక్ష్యం.పేటీఎం హెల్త్ సాథీ ప్రయోజనాలునెలవారీ సబ్ స్క్రిప్షన్ పై నెలకు కేవలం రూ.35తో ప్రారంభమయ్యే పేటీఎం హెల్త్ సాథీ తన భాగస్వామ్య నెట్ వర్క్ పరిధిలో అపరిమిత డాక్టర్ టెలీ కన్సల్టేషన్, ఇన్ పర్సనల్ డాక్టర్ విజిట్స్ (ఓపీడీ) వంటి సేవలను అందిస్తోంది.వరదలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, సమ్మెలు వంటి వాటి కారణంగా వ్యాపార అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆదాయ రక్షణ కవరేజీని కూడా ఇది అందిస్తుంది.డాక్టర్ టెలీ కన్సల్టేషన్ సర్వీస్‌తోపాటు ప్రముఖ ఫార్మసీలలో డిస్కౌంట్లు, రోగనిర్ధారణ పరీక్షలలో తగ్గింపులు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.క్లెయిమ్ ప్రాసెస్‌ను కూడా సులభతరం చేసింది. యాప్‌లోనే దీన్ని పూర్తి చేయవచ్చు.'పేటీఎం హెల్త్ సాథీ' పైలట్ సర్వీస్ మే నెలలోనే ప్రారంభమైంది. ఇప్పటికే 3000 మందికి పైగా మర్చంట్ భాగస్వాములు ఉపయోగించుకున్నారు. ఇది విజయవంతం కావడంతో కంపెనీ ఈనెల ప్రారంభంలో తన వ్యాపారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? బ్లాక్ లిస్ట్ హాస్పిటల్స్ గురించి తెలుసా?
హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఒకవైపు జీవనశైలి వ్యాధులతో అస్పత్రుల్లో చేరాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మధ్యతరగతి వాసులకు ఆరోగ్యపరమైన సామాజిక రక్షణ ఏదీ ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉండాల్సిందే. కరోనా ముందు నాటితో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని ఎక్కువ మంది నేడు అర్థం చేసుకుంటున్నారు. దీంతో దీన్ని కొనుగోలు చేసే వారి సంఖ్యలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. అయితే ఎవరో చెప్పారనో, ఏదైనా ప్రకటన చూసో హెల్త్ ప్లాన్ తీసుకోవడం కాదు. ఎంపిక చేసుకునే ప్లాన్‌లో రక్షణ ఏ మేరకు? ఏ ఏ వ్యాధులకు కవరేజీ ఉంది? ఉప పరిమితులు ఉన్నాయా? పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చా? ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు కవరేజీ లభిస్తుందా? ఇలాంటి ముఖ్యమైన అన్నింటి గురించి పాలసీదారులు తెలుసుకుని ఉండాల్సిందే. లేదంటే క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చికిత్సకు అయిన బిల్లు మొత్తంలో కోతపడుతుంది. పాలసీదారుడు తనవంతు చెల్లించాల్సి వచ్చినప్పుడు విచారిస్తే వచ్చేదేమీ ఉండదు. ఇటువంటి కీలక అంశాలను వివరించే కథనమిది... మన దేశంలో ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్‌ను పన్ను ఆదా కోణంలో తీసుకుంటూ ఉంటారు. పాలసీదారులకు సాధారణంగా కొన్ని ఫీచర్లపై అవగాహన ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మేటర్నిటీ ప్రయోజనాలు ఉంటాయి. నో క్లెయిమ్ బోనస్ ఉంటుందనే విషయాలపై సాధారణంగా అవగాహన ఉంటుంది. కానీ, ఎక్కువ మందికి తెలియని విషయం బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ గురించి. మీరు కొనుగోలు చేయబోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కువ ఆస్పత్రుల్లో చికిత్సలకు కవరేజీ ఇచ్చే విధంగా ఉండాలి. ఇంటి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినా కవరేజీ వస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇంటి సమీపంలోని హాస్పిటల్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటే, అందులో నగదు రహిత చికిత్స కాదు కదా, ముందే డబ్బులు చెల్లించి తీసుకున్న చికిత్సకు సైతం రీయింబర్స్మెంట్ రాదు. ఎందుకంటే సదరు ఆస్పత్రిని బీమా సంస్థ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం వల్లేనని తెలుసుకోవాలి. అందుకనే హెల్త్ పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ముందుగా బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితా చూడాలి. అలాగే, మీరు నివాసం ఉండే ప్రాంతంలో నగదు రహిత చికిత్సలను అనుమతి ఉన్న ఎన్ని ఆస్పత్రులు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ జాబితాలో ఉన్నదీ చూడాలి. కొన్ని చిన్న ఆస్పత్రులు లేదా వ్యక్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. మోసపూరిత క్లెయిమ్‌లు చేస్తుంటారు. అందుకని అన్ని బీమా సంస్థల పరిధిలో సొంతంగా ఓ ఇన్వెస్టిగేషన్ డెస్క్ ఉంటుంది. ఏదైనా ఒక ఆస్పత్రి నుంచి క్లెయిమ్‌లు భారీగా వస్తుంటే అప్పుడు సదరు ఆస్పత్రిపై ఓ కన్నేసి ఉంచాలని బీమా సంస్థ తన ఇన్వెస్టిగేషన్ డెస్క్‌ను కోరుతుంది. అప్పు డు సంబంధిత విభాగం క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తున్న లేదా అనుమానాస్పద క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తున్న ఆస్పత్రికి వెళ్లి విచారణ నిర్వహిస్తుంది. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బీమా సంస్థ తదుప రి చర్యలు తీసుకుంటుంది. క్లెయిమ్‌ల విషయంలో చట్టవిరుద్ధమైన చర్యలు లేదా నిబంధనలకు వ్యతిరేకంగా, మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే ఆయా ఆస్పత్రిని నిషేధిత జాబితాలోకి మారుస్తుంది. ఇలా బీమా సంస్థలు తాము నిషేధించిన, బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన హాస్పిటల్స్ వివరాలను పాలసీదారులతో ఎప్పటికప్పుడు పంచుకుంటాయి. వెయిటింగ్ పీరియడ్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే ఏ సమస్య వచ్చినా క్లెయిమ్ చేసుకుంటామంటే నిబంధనలు అంగీకరించవు. కొన్ని రకాల వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉంటుంది. ఈ వివరాలు పాలసీ డాక్యుమెంట్లో వివరంగా ఉంటాయి. ఉదాహరణకు మెటర్నిటీ (ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరడం) కవరేజీ అనేది చాలా పాలసీల్లో ఉన్నా, మొదటి రోజు నుంచే కవరేజీ వస్తుందనుకోవద్దు. ఇందుకోసం కనీసం 12 నెలలు అంతకుమించి వేచి ఉండే కాలం నిబంధన ఉంటుంది. ఆ తర్వాతే మెటర్నిటీ కవరేజీ క్లెయిమ్ చేసుకోగలరు. మరికొన్ని రకాల వ్యాధులకు 24 నెలల వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంటుంది. పాలసీ తీసుకునే నాటికే వ్యాధులు కలిగి ఉంటే, వాటిని పాలసీ ప్రపోజల్లో వెల్లడించి ఉంటే, కవరేజీ పొందేందుకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలకు అన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. ఇది యాడాన్ కవరేజీగా వస్తుంది. హాస్పిటల్లో కనీసం 24 గంటల పాటు చేరి చికిత్స తీసుకుంటేనే ఇండెమ్నిటీ ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. డే కేర్ చికిత్సల కోసం అయితే ఆస్పత్రిలో ఇన్ని గంటల పాటు చేరాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకునే వాటికి కనీసం 24 గంటల నిబంధన అమలవుతుంది. కనుక పాలసీదారులు మొదట బ్లాక్ లిస్ట్ హాస్పిటళ్లు, తర్వాత ఏ వ్యాధికి కవరేజీ కోసం ఎంత కాలం పాటు వేచి ఉండాలి, క్లెయిమ్ కోసం ఎంత సమయం పాటు ఆస్పత్రిలో చేరాలనే విషయాలను తెలుసుకోవాలి. ఫీచర్లపై అవగాహన అవసరం: బీమా సంస్థ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో సాధారణ నిబంధనలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ, ఒక్కో బీమా సంస్థ తమ ఉత్పత్తిని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని అదనపు ఫీచర్లు, కవరేజీలను పాలసీల్లో భాగం చేస్తుంటాయి. ఉదాహరణకు రీస్టోరేషన్ ఫీచర్. దీన్ని చాలా సంస్థలు అందిస్తున్నాయి. ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా మొత్తం ఖర్చయిపోయిందని అనుకోండి. అప్పుడు అదే ఏడాది మరో వ్యక్తి లేదా అదే వ్యక్తి మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వస్తే? అలాంటి సందర్భాల్లో ఆదుకునేదే రిస్టోరేషన్ ఫీచర్. ఏదైనా క్లెయిమ్ కారణంగా బీమా కవరేజీ ఖర్చయిన సందర్భాల్లో బీమా సంస్థలు తిరిగి అంతే మొత్తాన్ని రీసోర్టేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే ఏడాది మరోసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు అది ఆదుకుంటుంది. కొన్ని బీమా సంస్థలు అయితే ఒక ఏడాదిలో ఎన్నిసార్లు ఇలా క్లెయిమ్‌లు వచ్చినా, అన్ని సార్లు రీస్టోరేషన్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరి పూర్తి బీమా కవరేజీని క్లెయిమ్ పొందాడనుకుందాం. అప్పుడు అదే వ్యక్తి అదే వ్యాధితో హాస్పిటల్లో చేరితే రీస్టోరేషన్ కవరేజీని చాలా ప్లాన్లు ఇవ్వడం లేదు. కొన్ని మాత్రం ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా లేక మరో సమస్యతో చేరాల్సి వచ్చినా రీస్టోరేషన్ కింద కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కనుక ఈ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. తప్పక తెలిసి ఉండాలి: ముందు నుంచి ఉన్న వ్యాధులు: అధిక రక్తపోటు, కేన్సర్, మధుమేహం, ఆస్తమా, డిప్రెషన్, స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (సీవోపీడీ), స్థూలకాయం, లూపస్, అధెరోస్కెలరోసిస్, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు. పాలసీ కొనుగోలు చేసే నాటికి నాలుగేళ్ల ముందు వైద్యులు నిర్ధారించి, చికిత్స తీసుకున్నవి ముందస్తు వ్యాధుల జాబితాలోకి వస్తాయి. ముందస్తు వ్యాధుల సమాచారం కావాలని వెల్లడించకపోతే.. తర్వాత క్లెయిమ్ సమయంలో బీమా సంస్థ దీన్ని గుర్తిస్తే పరిహారాన్ని నిరాకరిస్తుంది. పాలసీ తీసుకుని ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత క్లెయిమ్ వస్తే అది ముందుగా వెల్లడించని వ్యాధి అయినా సరే తిరస్కరించడం కుదరదు. కనుక పాలసీ దరఖాస్తులో అంతకుముందుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా, చికిత్స తీసుకున్నా ఆ వివరాలను తప్పకుండా వెల్లడించడం మంచిది. 30 రోజుల వెయిటింగ్: పాలసీ విడుదల చేసిన తేదీ నుంచి మొదటి 30 రోజుల్లో ప్రమాదం లేదా ప్రమాదం కారణంగా తలెత్తే సమస్యలకే క్లెయిమ్ చేసుకోవచ్చు మరే విధమైన చికిత్సకూ క్లెయిమ్‌ను బీమా సంస్థలు అనుమతించవు. స్పెసిఫిక్ వెయిటింగ్: ముందు నుంచి ఉన్న వ్యాధులు కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత 24 నెలల వరకు క్లెయిమ్ చేసుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిజం, జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోస్కోపిక్ మోకాలు సర్జరీ, చెవి, ముక్కు, గొంతు సమస్యలు లేదా సర్జరీలు (సైనసైటిస్, అడెనాయిడ్స్), ప్రొస్టేటిక్ హైపర్ట్రోఫీ, క్యాటరాక్ట్, ఫిస్టులా, హెమరాయిడ్స్, గ్యాస్టిక్ డుయోడినల్ అల్సర్లు, అన్ని రకాల హెర్నియా, హిస్టరెక్టమీ, ఫైబ్రోమయోమా, ట్యూమర్లు, కిడ్నీలో రాళ్లు, యూరెటెరిక్ స్టోన్స్, గ్లాల్ బ్లాడర్‌లో రాళ్లు, వారికోస్ వెయిన్స్, పార్కిసన్స్/అల్జీమర్స్/డిమెన్షియా తదితర వాటితో బీమా కంపెనీ డాక్యుమెంట్లో 24 నెలల వెయిటింగ్ జాబితా ఉంటుంది. వీటికి రెండేళ్ల తర్వాతే క్లెయిమ్ వస్తుంది. శాశ్వత మినహాయింపులు: హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, దేనికైనా పరిహారం వస్తుందిలేనని అనుకోవద్దు. కొన్నింటికి శాశ్వతంగా క్లెయిమ్ రాదు. వీటి జాబితా బీమా నియమ, నిబంధనల డాక్యుమెంట్లో ఉంటుంది. ఏదైనా వ్యాధి నిర్ధారణ కోసం ఆస్పత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. వైద్యుల సిఫారసు లేకుండా బరువు తగ్గేందుకు సొంతంగా తీసుకునే చికిత్సలు, లింగమార్పిడి చికిత్సలు, కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీలకు (ప్రమాదం కారణంగా చేసుకోవాల్సిన వాటికి మినహాయింపు) క్లెయిమ్ రాదు. మెటర్నిటీ వెయిటింగ్: సాధారణంగా మెటర్నిటీ కవరేజీ కోసం బీమా సంస్థలు ఏడాది నుంచి మూడేళ్ల పాటు వేచి చూడాలనే నిబంధన అమలు చేస్తున్నాయి. వెయిటింగ్‌ను తగ్గించుకోవచ్చా..? వేచి ఉండే కాలాన్ని తగ్గించుకునేందుకు చాలా బీమా సంస్థలు ప్రత్యేక రైడర్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ముందస్తు వ్యాధులకు కవరేజీని 2 ఏళ్లకు తగ్గిస్తున్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచే ముందస్తు వ్యాధులకూ కవరేజీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో దాదాపుగా వెయిటింగ్ పీరియడ్ ఉండడం లేదు. వేచి ఉండే కాలంలో కొత్తగా నిర్ధారణయ్యే వ్యాధులను ముందు నుంచి ఉన్నవిగా పరిగణించరు. సమీప బంధువులకు షేర్ చేయాలి: ఆస్పత్రిలో చేరిన వెంటనే బీమా సదుపాయం ఉందా? అని అక్కడ సిబ్బంది ప్రశ్నించడం వినే ఉంటారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెబితే, అందులో చికిత్స వ్యయాలకు ఎంత మేర కవరేజీ వస్తుంది? రాదనే విషయాలను వారు చెబుతారు. ముందుగా నిర్ణయించుకుని తీసుకునే చికిత్సల విషయంలో కవరేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే డిశ్చార్జ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే సాధారణంగా పాలసీదారులు చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఆస్పత్రిలో చేరగా, వారి సంబంధీకులు బీమా తదితర వ్యవహారాలు చూస్తుంటారు. వారికి కవరేజీ విషయమై అవగాహన ఉండదు. అందుకని పాలసీదారులు తమ బీమా క్లెయిమ్‌కు సంబంధించి తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు కొన్ని ఫీచర్లు, ముఖ్యమైన అంశాల గురించి తప్పకుండా చెప్పాలి. అందులో ముఖ్యమైనది రూమ్‌రెంట్ కవరేజీ. రూమ్ రెంట్‌కు ఎలాంటి పరిమితులు లేనట్టయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ షేర్డ్ రూమ్, సింగిల్ రూమ్ అని నిబంధన ఉంటే మిమ్మల్ని ఆస్పత్రిలో ఆయా వసతుల్లోనే చేర్చాలని సూచించాలి. పాలసీలో చెప్పినదానికంటే ఖరీదైన వసతి తీసుకుంటే బిల్లు ఎక్కువ వస్తుంది. దాంతో ఆ మేరకు బీమా సంస్థ క్లెయిమ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మిగిలినది పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ముందు నుంచి వ్యాధులు ఉండి, వాటిని పాలసీ దరఖాస్తులో వెల్లడించి ఉంటే వాటి గురించి వివరంగా చెప్పాలి. లేదంటే లిఖితపూర్వకంగా ఈ విషయాలను ఒక పేపర్‌పై రాసి ఇవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. హాస్పిటల్ క్యాష్ ఫీచర్ ఉంటే అది కూడా తప్పకుండా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ అనేది.. చికిత్స కోసం ఆసుపత్రిలో పాలసీదారు చేరినప్పుడు, వారికి సహాయంగా ఉండే వారికి రోజువారీ చెల్లింపులు చేస్తుంది. ఇది రోజువారీ రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది. రీస్టోరేషన్ గురించి కూడా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది కొన్ని ప్లాన్లలో ఇన్‌బిల్ట్‌గా ఉంటే, కొన్నింటిలో యాడాన్ కవర్‌గా వస్తోంది. -
SBI: మహిళల కోసం ప్రత్యేక హెల్త్ ప్లాన్
న్యూఢిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా చోళ సర్వ శక్తి పేరుతో ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు) ప్రకటించింది. ఇందుకోసం చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌తో టైఅప్ అయ్యింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా గుండె, గర్భధారణ, పునరుత్పత్తి, కేన్సర్, హైపర్ టెన్షన్ వంటి సమస్యలకు గురవుతున్నట్టు ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ పేర్కొంది. ప్రతీ 1,009 మంది మహిళలలో 39 శాతం మందికే హెల్త్ కవరేజీ ఉన్నట్టు ఒక సర్వేను ప్రస్తావించింది. వ్యక్తిగత, సమగ్ర హెల్త్ కవరేజీని చోళసర్వశక్తి ప్లాన్ కింద అందిస్తున్నట్టు తెలిపింది. వైద్య సంక్షోభ సమయాల్లో అధిక శాతం భరోసా, సాయం అందించే లక్ష్యంతో ఈ ప్లాన్‌ను ఆవిష్కరించినట్టు పేర్కొంది. చదవండి: ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు ఎస్బీఐ కృషి -
కరోన 'రక్షణ' ఉందా..?
ఆరోగ్య బీమా అవసరాన్ని మనలో అధిక శాతం మంది ఇంతకాలం గుర్తించలేదు. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆరోగ్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తిస్తున్నారు. అందరికీ ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాలని నిర్దేశించింది. దీంతో అన్ని ప్రముఖ సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ పేరుతో రెండు రకాల పాలసీలను ప్రవేశపెట్టాయి. కరోనా కోసం బీమా సంస్థలు తీసుకొచ్చిన రెండు ప్రామాణిక పాలసీల్లో ఏది మీకు అనుకూలం..? వీటిల్లో కవరేజీ, మినహాయింపులు తదితర సమగ్ర అంశాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. పాలసీల్లో వైరుధ్యం.. కరోనా కవచ్, కరోనా రక్షక్ రెండు రకాల పాలసీలు కోవిడ్–19 చికిత్సలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించినవి. కరోనా కవచ్ పాలసీ ఇండెమ్నిటీ ప్లాన్. అంటే కరోనా కారణంగా చికిత్సలకు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. తీసుకున్న బీమా మొత్తానికి ఇది పరిమితం అవుతుంది. ఇక కరోనా రక్షక్ పాలసీ అనేది బెనిఫిట్ పాలసీ. అంటే కరోనా బారిన పడితే ఎంచుకున్న బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించేస్తుంది. కరోనా పాజిటివ్ అని తేలి, కనీసం 72 గంటలు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తేనే కరోనా రక్షక్ పాలసీ ప్రయోజనం లభిస్తుంది. ప్రభు త్వం గుర్తింపు కలిగిన ల్యాబ్‌ల్లో పరీక్షల ద్వారా కరోనా నిర్ధారణ అయితేనే ఈ రెండు పాలసీల్లోనూ పరిహారం లభిస్తుంది. కరోనా కవచ్ పాలసీ విడిగా వ్యక్తులకు, లేదా కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ పాలసీ రూపంలో అందుబాటులో ఉంటుంది. కరోనా రక్షక్ పాలసీ అనేది కుటుంబానికి కాకుండా ప్రతీ వ్యక్తి విడిగా తీసుకోవాల్సిన పాలసీ. ఈ 2 రకాల పాలసీలు 105 రోజులు (3.5 నెలలు), 195 రోజులు (6.5 నెలలు), 285 రోజుల (9.5 నెలలు) కా లానికి లభిస్తాయి. ఆ తర్వాత అంతే కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. కనీస బీమా రూ. 50,000 నుంచి మొదలవుతుంది. గరిష్టంగా కరోనా కవచ్ పాలసీలో రూ.5 లక్షల బీమాను ఎంచుకోవచ్చు. కరోనా రక్షక్ ప్లాన్‌లో గరిష్ట బీమా రూ.2.5 లక్షలకు పరిమితం అవుతుంది. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 65 సంవత్సరాల అర్హత మేరకు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీల్లో ప్రీమియం వాయిదాల రూపంలో కాకుండా ఒకే విడత చెల్లించాలి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరడం ద్వారా కరోనా కవచ్ పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. ఈ పాలసీలను ఆయా బీమా సంస్థల పోర్టళ్లు, పంపిణీ చానళ్లు, ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక పాలసీలను తీసుకోవచ్చా..? బీమా కంపెనీ ఏదైనా కానీ ఈ రెండు రకాల పాలసీలకు సంబంధించి అధిక శాతం నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రీమియం, బీమా సంస్థ అందించే సేవల నాణ్యత, క్లెయిమ్‌లను వేగంగా ఆమోదించడం వంటి విషయాలను పరిశీలించాలి. అదే విధంగా బీమా కంపెనీల చెల్లింపుల చరిత్రను చూసిన తర్వాతే మీకు అనుకూలమైన సంస్థ నుంచి పాలసీని ఎంచుకోవాలి. ఈ పాలసీల్లో ప్రాంతాల వారీగా ప్రీమియంలో వ్యత్యాసం ఉండదు. రెగ్యులర్ హెల్త్ ప్లాన్లలో ప్రాంతాల వారీగా ప్రీమియం మారిపోవడాన్ని గమనించొచ్చు. కానీ కోవిడ్ పాలసీల్లో ప్రీమియం అన్ని ప్రాంతాల వారికి ఒకే రీతిలో ఉంటుంది. 40 ఏళ్ల వ్యక్తి మూడున్నర నెలల కాలానికి కరోనా కవచ్ పాలసీని ఎంచుకుంటే ప్రీమియం కనిష్టంగా రూ.636 నుంచి గరిష్టంగా రూ.3,831 వరకు ఉంటుంది. అదే 9.5 నెలల కోసం ఇదే వయసున్న వ్యక్తికి ప్రీమియం రూ.1,286–5,172 మధ్య ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఓ సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండి, అందులో ఔట్ పేషెంట్ చికిత్సలకు కూడా కవరేజీ ఉండుంటే అప్పుడు ప్రత్యేకంగా కరోనా కవచ్ పాలసీని తీసుకోవాల్సిన అవసరం లేనట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇప్పటికే అమల్లో ఉన్న అన్ని హెల్త్ ప్లాన్లలో కరోనాకు కవరేజీ లభిస్తుంది. కాకపోతే కరోనా వల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వస్తే.. అన్ని ప్లాన్లలోనూ పరిహారం రాకపోవచ్చు. కానీ కరోనా రక్షక్ పాలసీ ఎవరికైనా అనుకూలమే. ఎందుకంటే ఇప్పటికే హెల్త్ ప్లాన్ ఉన్నా కానీ.. కరోనా రక్షక్‌లో ఏకమొత్తంలో పరిహారం అందుకోవచ్చు. ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండి, బీమా మొత్తాన్ని మించిపోయినా అప్పుడు కరోనా రక్షక్ ఆదుకుంటుంది. కానీ, కరోనా రక్షక్‌లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటేనే పరిహారం లభిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ ప్లాన్ లేని వారు ప్రస్తుత కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ను తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాల్సిందే. కవరేజీ వేటికి..? కరోనా కవచ్ పాలసీలో.. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నా.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా గరిష్ట బీమా మేరకు పరిహారం పొందొచ్చు. ఆస్పత్రిలో కనీసం 24 గంటల పాటు చికిత్స పొందినప్పుడే ఖర్చులను చెల్లిస్తుంది. రూమ్ అద్దె, బోర్డింగ్, నర్సింగ్ చార్జీలు, ఐసీయూ, అంబులెన్స్ (రూ.2,000వరకు) చార్జీలను కూడా పొందొచ్చు. వైద్య, కన్సల్టెంట్, ఆపరేషన్ థియేటర్, పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌కు అయ్యే వ్యయాలకూ బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఇంట్లోనే ఉండి చికిత్స పొందితే.. గరిష్టంగా 14 రోజుల చికిత్స వ్యయా లను భరిస్తుంది. అది కూడా వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆయుర్వేద ఆస్పత్రిలో ఇన్ పేషెంట్‌గా చేరి చికిత్స తీసుకున్నా కరోనా కవచ్ పాలసీ కవరేజీనిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి ముందు అయిన ఖర్చులు (15 రోజులు), ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం 30 రోజుల వరకు ఔషధాలు, ఇతర వ్యాధి నిర్ధారణ, వైద్యుల కన్సల్టేషన్ కోసం అయ్యే ఖర్చులనూ పొందొచ్చు. కరోనా కవచ్ పాలసీలు ‘హాస్పిటల్ డైలీ క్యాష్’ రైడర్‌నూ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఆస్పత్రిలో చేరినప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులు అవుతుంటాయి. అటువంటప్పుడు ఈ కవరేజీ అక్కరకు వస్తుంది. దీన్ని ఎంచుకుంటే బీమా మొత్తంలో 0.5 శాతాన్ని ప్రతీ రోజుకు బీమా సంస్థలు అందిస్తాయి. కాకపోతే 24 గంటలకు మించి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి. అదే కరోనా రక్షక్పాలసీ విషయంలో పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఎంచుకున్న బీమా పరిహారాన్ని ఏక మొత్తంలో పొందవచ్చు. ఉదాహరణకు రూ.2.5 లక్షల సమ్ ఇన్సూర్డ్ ఎంచుకున్నారనుకుంటే.. కరోనా పాజిటివ్ అయి 72 గంటలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చు ఎంతయిందన్న దానితో సంబంధం లేకుండా బీమా సంస్థ రూ.2.5 లక్షలను చెల్లించేస్తుంది. 72 గంటల్లోపు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయితే ఈ పాలసీలో పరిహారం రాదు. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి ఇతర హెల్త్ ప్లాన్లలో మాదిరే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల్లోనూ 15 రోజులు వేచి ఉండే కాలం (వెయిటింగ్ పీరియడ్) అమల్లో ఉంటుంది. అంటే పాలసీ ఇష్యూ చేసిన మొదటి 15 రోజుల్లో కరోనా బారిన పడినా క్లెయిమ్‌కు అర్హత ఉండదు. పరిహారానికి సంబంధించి తగ్గింపు నిబంధనల్లేవు. పోర్టబులిటీ ఆప్షన్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నది బీమా సంస్థలను బట్టి నిబంధనలు వేర్వేరుగా అమల్లో ఉండొచ్చు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి కరోనా కవచ్ పాలసీ ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు రకాల పాలసీల్లో మినహాయింపులు కొన్ని ఉన్నాయి. ఆమోదం లేని చికిత్సా విధానాలకు ఇందులో కవరేజీ లభించదు. కరోనా చికిత్సలో భాగంగా కొన్ని మందులను ప్రయోగాత్మకంగా ఇస్తున్న వార్తలను వింటూనే ఉన్నాం. నియంత్రణ సంస్థల ఆమోదంతో ఇస్తున్న ఔషధాలు, చికిత్సలకు సంబంధించే కవరేజీ లభిస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రయాణ పరంగా ఆంక్షలు అమల్లో ఉన్న ఏ ఇతర దేశంలో పర్యటించినా పాలసీ రద్దయిపోతుంది. డే కేర్ చికిత్సలు (ఆస్పత్రిలో చేరకుండా తీసుకునే చికిత్సలు), ఔట్ పేషెంట్ చికిత్సలకు కరోనా కవచ్ పాలసీలో కవరేజీ ఉండదు. కరోనా ప్రత్యేక పాలసీలకు వస్తున్న స్పందన అనూహ్యం. పాలసీబజార్ వెబ్సైట్ నిత్యం 300–500 పాలసీలను విక్రయిస్తోంది. తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. – అముత్ చాబ్రా, హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్, పాలసీబజార్ ఎక్కువ మంది తొమ్మిదిన్నర నెలల కాలానికి పాలసీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ 40 శాతం మంది హాస్పిటల్ డైలీ క్యాష్‌ను ఎంచుకుంటున్నారు. – సుబ్రతా మోండల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (అండర్‌రైటింగ్), ఇఫ్కోటోకియా జనరల్ ఇన్సూరెన్స్ కుటుంబంలోని ఇతర సభ్యులకు కవరేజీతోపాటు, ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా ఖర్చులు చెల్లించే ఫీచర్లు ఉండడం ఎక్కువ ఆసక్తికి కారణం. – సుబ్రమణ్యం బ్రహ్మజోస్యుల, అండర్‌రైటింగ్ హెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..
పెద్ద వయసులోనే వైద్య బీమా (హెల్త్ ప్లాన్) అవసరమని చాలా మంది భావిస్తుంటారు. నేటి జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, ఉద్యోగ పని స్వభావాల నేపథ్యంలో చిన్న వయసు నుంచే హెల్త్ కవరేజీ ఎంతో అవసరమన్న విషయాన్ని ఇప్పటికీ ఎక్కువ మంది గుర్తించడం లేదు. ఆరోగ్య బీమా పరిశ్రమ క్లెయిమ్ గణాంకాలను పరిశీలిస్తే... చిన్న వయసులోనే బీమా అవసరం ఎంతో ఉందని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. పైగా చికిత్సల వ్యయాలు ఇప్పటికే చాలా ఖరీదుగా ఉండగా, భవిష్యత్తులో ఇవి ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించలేం. కనుక ఆర్జన ఆరంభమైన నాడే వైద్య బీమా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. జీర్ణ సంబంధిత, జననేంద్రియ, మూత్ర సంబంధిత, ఇన్ఫెక్షన్ వ్యాధులకు సంబంధించినవే మొత్తం క్లెయిమ్‌లలో 45 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బజాజ్ అలియంజ్ గణాంకాలను చూస్తే.. జ్వరాలు, ఇన్ఫెక్షన్ల కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, డెంగ్యూ ఫీవర్ కారణంగా ఎక్కువ క్లెయిమ్‌లు వచ్చాయి. మరో సంస్థ రాయల్ సుందరం క్లెయిమ్ల్లోనూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్లెయిమ్‌లు 30 శాతంగా ఉన్నాయి. తీవ్ర ఆరోగ్య సమస్యలు (గుండెపోటు, స్ట్రోక్, కేన్సర్, మూత్రపిండాల వైఫల్యం తదితర) తలెత్తితే పడే ఆర్థిక భారం అంతా ఇంతా కాదు. ఒక కుటుంబంలో ఒకరికి మించిన సభ్యులకు ఈ సమస్యలు ఒకేసారి ఎదురైతే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారుతుంది. మొత్తం మీద సర్వసాధారణంగా మనకు వ్యాపించే ఇన్ఫెక్షన్లు, గాయాలు, జీర్ణ సంబంధిత సమస్యలకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు 30 శాతంగా ఉండడాన్ని గమనించాలి. బీమా లేకపోతే వీటి కారణంగా పడే ఆర్థిక భారం గణనీయంగా ఉంటుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. కేన్సర్ చికిత్సల కోసం సగటు క్లెయిమ్ సైజు రూ.77,000గా ఉంది. అదే మస్కులోస్కెలెటల్(కండర) సంబంధిత సమస్యల కారణంగా సగటు క్లెయిమ్ రూ.1.26 లక్షలుగా ఉంది. 60–65 ఏళ్లు దాటిన వారి నుంచి మస్కులోస్కెలెటల్, ఆస్టియోపోరోసిస్, జాయింట్ సంబంధిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉంటుంటాయి. కేన్సర్ కంటే వీటికి ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. బీమా అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్న వయసులోనే... చిన్న నాటి నుంచే హెల్త్ కవరేజీ ఎందుకులే, ఈ వయసులో ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఏవీ రావుగా..?! అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఇక ఉద్యోగులు తమ సంస్థ నుంచి ఎంతో కొంత హెల్త్ కవరేజీ ఉందిలేనన్న ఆలోచనతో అదనంగా కవరేజీ తీసుకునేందుకు ఇష్టపడరు. వయసుతో సంబంధం లేనివి.. గాయాలు, ఆహార విషతుల్యం కారణంగా వచ్చిన క్లెయిమ్‌లు 19–35 సంవత్సరాల విభాగంలో 43 శాతంగా ఉన్నాయి. ఇక ఇన్ఫెక్షన్ల కారణంగా ఎదురయ్యే క్లెయిమ్‌లు కూడా ఇదే వయసు వారి నుంచి వచ్చే మొత్తం క్లెయిమ్‌లలో 42 శాతంగా ఉన్నాయి. ఇక యువతలో ఎక్కువ క్లెయిమ్‌లు ప్రమాదాలకు సంబంధించినవీ ఉంటున్నాయి. ‘‘25 ఏళ్లలోపు వయసున్న వారు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే ధోరణితో ఉంటారు. ఈ వయసు వారి నుంచి వచ్చే క్లెయిమ్‌లు మొత్తం ప్రమాదాల కారణంగా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లలో 30 శాతంగా ఉంటోంది. సగటు క్లెయిమ్ రూ. 55,000’’అని రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నిఖిల్ ఆప్టే తెలిపారు. ఒకవేళ హెల్త్ పాలసీ ప్రీమియం భారంగా అనిపిస్తే.. చిన్న వయసులో ఆదాయం తక్కువగా ఉన్న వారు కనీసం చౌకగా వచ్చే ప్రమాద బీమా పాలసీని అయినా తీసుకోవడం మంచిది. ‘‘పెద్ద వయసు వారితో పోలిస్తే.. యువతీ, యువకులు ఉద్యోగం చేసే వారు బయటి వాతావరణానికి ఎక్కువగా గురవుతుంటారు. దీంతో వీరు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, యువతీ, యువకులు వ్యక్తిగత హెల్త్ పాలసీలను ముందుగానే తీసుకోవడం తక్కువే’’ అని సెక్యూర్‌నౌ సీఈవో కపిల్ మెహతా పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యయాలు రానున్న ఐదేళ్ల కాలంలో శ్వాస కోçశవ్యాధులు, గుండె జబ్బులు, మస్కులోస్కెలెటల్, కేన్సర్, ప్రమాదాలు, జననేంద్రియ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని బీమా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘‘గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాల్లో పెరుగుదల 100 శాతంగా ఉంది. ఈ విభాగంలో ఎక్కువగా కనిపించేవి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా. పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో, దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా ఉందని ఇది తెలియజేస్తోంది’’ అని నిఖిల్ ఆప్టే పేర్కొన్నారు. ఇక ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలతో ఆర్థరైటిస్ బారిన పడడం పెరుగుతోంది. దీంతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బులను గుల్ల చేసే పెద్ద ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు, కేన్సర్ ఉంటున్నాయి. భవిష్యత్తులోనూ వీటి చికిత్సల వ్యయాలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలే కాకుండా, తదనంతరం ఆ సమస్యకు సంబంధించి అయ్యే ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు కేన్సర్ విషయంలో ఆస్పత్రిలో చికిత్స తర్వాత ఫాలో అప్ కోసం ఒక్కో పరీక్షకు రూ.15,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైనంత కాలం పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే గుండె జబ్బుల్లో అయితే, ప్రతీ ఫాలో అప్‌కు కనీసం రూ.1,000 తక్కువ కాకుండా ఖర్చవుతుంది. సీటీ స్కాన్ ఖరీదు రూ.10,000–15,000 వరకు ఉంటుంది. అవయవ మార్పిడి కేసుల్లో ప్రతీ నెలా కనీసం రూ.5,000 తక్కువ కాకుండా మందులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక బీమా తీసుకునే వారు ఈ వ్యయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక లక్ష్యాలకూ బీమా బాసట ► యువ పాలసీదారులపై మరింత దృష్టి ► బజాజ్ అలియంజ్ లైఫ్ ఎండీ తరుణ్ చుగ్ ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా జీవిత బీమా పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయని బజాజ్ అలియంజ్ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. వైవిధ్యమైన జీవిత బీమా పాలసీలు అందుబాటులోకి రావడంతో ఆర్థిక లక్ష్యాల సాధన కోసం యువ జనాభాలో ఎక్కువ శాతం మంది పెట్టుబడుల కోసం వీటివైపు మొగ్గు చూపుతున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాలసీల విక్రయాలకు సంబంధించి మిలీనియల్స్‌పై మరింత దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. వారికి అనువైన కొత్త తరహా పాలసీలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే బీమా కవరేజీని లెక్కించడం నుంచి పాలసీ కొనుగోలు, రెన్యువల్ ప్రీమియంల చెల్లింపు దాకా అన్నింటినీ సులభతరం చేసేలా యాప్స్, కాల్క్యులేటర్స్ను అందుబాటులో ఉంచినట్లు చుగ్ చెప్పారు. రిటైర్మెంట్ లాంటి లక్ష్యాలు దీర్ఘకాలికమైనవే అయినప్పటికీ యువత కెరియర్ తొలినాళ్ల నుంచే వీటి కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం ముఖ్యమని ఆయన తెలిపారు. సాధ్యమైనంత ముందుగానే పాలసీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలం కవరేజీ లభించడంతో పాటు ప్రీమియం కూడా తక్కువగా ఉంటుందని చుగ్ వివరించారు. మరణానంతర ప్రయోజనాల కన్నా జీవిత లక్ష్యాల సాధనలో బీమా పాలసీలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై అవగాహన కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. క్యూ1లో 40 శాతం వృద్ధి... ఈ ఆర్థిక సంవత్సరం తమ సంస్థకు సంబంధించి తొలి త్రైమాసికంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం పెరిగిందని చెప్పారు. ఈ విభాగంలో జీవిత బీమా రంగం సగటు వృద్ధి 32 శాతంగా ఉందని పేర్కొన్నారు. విస్తృతమైన నెట్వర్క్, విభిన్నమైన పథకాలు, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు మరిన్ని పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పేమెంట్ బ్యాంకులు, ఆన్లైన్ వేదికలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు దేశీయంగా జీవిత బీమా పాలసీల విక్రయాలు మరింతగా పెరిగేందుకు తోడ్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైనంత రక్షణ మన దేశంలో వైద్య బీమా తీసుకునే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. వైద్య బీమా అన్నదానిని ఇప్పటికీ పన్ను ఆదా సాధనంగా చూసే వారున్నారు. కాకపోతే మిలీనియల్స్ (యువత)లో ఈ ధోరణి మారుతోందన్నారు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అండ్ హెల్త్ క్లెయిమ్స్ హెడ్ పి.భవే. అయితే, ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రచారం కారణంగా.. రూ.3.5–4 లక్షలుగా సగటు బీమా కవరేజీ ఉంటోంది. ‘‘చాలా ఆరోగ్య సమస్యల్లో ఖర్చు రూ.3 నుంచి రూ.4 లక్షలుగా ఉంటోంది. కనుక కనీసం రూ.5 లక్షల వైద్య బీమాకు తోడు టాపప్ పాలసీ కూడా తీసుకోవడాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ క్లెయిమ్స్ హెడ్ భాస్కర్ నెరుర్కార్ సూచించారు. బేసిక్ పాలసీ కవరేజీ ఏదైనా ఒక ఏడాదిలో పూర్తయిపోయి వైద్య చికిత్సలకు అదనంగా ఖర్చు అయితే అటువంటి సందర్భాల్లో టాపప్ పాలసీ ఆదుకుంటుంది. కనీసం రూ.10 లక్షల కవరేజీకి టాపప్ పాలసీ తీసుకోవాలన్నది ఆప్టే సూచన. అత్యాధునిక పరికరాలతో సంక్లిష్టమైన అవయవ మార్పిడి చికిత్సలు, బైపాస్, కేన్సర్ చికిత్సలు కూడా చేస్తుండడంతో కనీసం ఈ మాత్రం టాపప్ అవసరమని ఆప్టే పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఇంటి పెద్ద వయసు 40 ఏళ్లుగా ఉంటే, కనీసం రూ.5 లక్షలకు హెల్త్ కవరేజీతో పాలసీ తీసుకోవాలి. ప్రతీ ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించి అవసరమైనంత పెంచుకోవాలన్నది నిపుణుల సూచన. దీనికితోడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కూడా తీసుకోవడం వల్ల ఆయా సమస్యల బారిన పడితే ఏక మొత్తంలో పరిహారం అందుకోవచ్చు. విడిగా ఓ వైద్య నిధిని కూడా సమకూర్చుకోవడం మంచిది. పాలసీలో కవర్ కాని వాటికి ఖర్చు చేసేందుకు అక్కరకు వస్తుంది. కుటుంబ సభ్యులు, ఆరోగ్య చరిత్ర ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తగినంత వైద్య బీమా కవరేజీతో పాలసీ తీసుకోవడం ద్వారా ఆర్థికంగా గుల్ల కాకుండా చూసుకోవచ్చు. -
ఏడాది మారింది... మరి మీరు?
గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ప్రతికూలతలను అధిగమించి, పెట్టుబడి అవకాశాలను అందుకోవాలంటే అందుకు ప్రతి ఒక్కరూ పాటించతగిన ఆర్థిక విధానాలు కొన్ని ఉన్నాయి. అవేంటన్నది నిపుణుల మాటల్లోనే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మార్కెట్లలో అస్థిరతలు కొనసాగేందుకు అధిక అవకాశాలున్నాయి. ఈ అస్థిరతలను అధిగమించేందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉపయోగపడుతుంది. ఎన్నికల వరకు స్టాక్స్ ధరలు పరిమిత పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడ్డాక దిశను ఎటువైపు అయినా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడమే సరైన మార్గం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ఏవీ ధరలు పెరగడం వల్ల తక్కువ ఫండ్స్ యూనిట్లు, మార్కెట్లు కరెక్షన్ బాట పడితే ఎన్ఏవీ ధరల పతనంతో ఎక్కువ యూనిట్లు సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లు కొంతమేర కరెక్షన్కు గురైన ఈ సమయంలో సిప్‌ను ఆపకూడదు. దీనివల్ల తక్కువ ధరలకు ఎన్ఏవీలను కొనుగోలు చేసుకునే అవకాశం కోల్పోతారు. ముఖ్యంగా 12–18 నెలల క్రితం సిప్ ఆరంభించిన వారు కచ్చితంగా ఈ సమయంలో ఆపకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏడాది, ఏడాదిన్నర క్రితం మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. కనుక గరిష్ట ధరల్లో పెట్టుబడి పెట్టిన వారు, ఇప్పుడు తక్కువ ధరకే కొనే అవకాశాన్ని కోల్పోకూడదు. లార్జ్‌క్యాప్‌నకు ప్రత్యామ్నాయాలు చాలా వరకు ప్రధాన లార్జ్‌క్యాప్ ఫండ్స్ గతేడాది మెరుగైన పనితీరు చూపించలేకపోయాయి. ఈ ఏడాది కూడా వీటి పనితీరు అంత బాగుండకపోవచ్చనే అంచనా ఉంది. అధిక రాబడులు కోరుకునే వారు అధిక రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని మరిచిపోవద్దు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ టాప్ 100, రిలయన్స్ లార్జ్‌క్యాప్, యూటీఐ మాస్టర్‌షేర్ పథకాలన్నీ గతేడాది ఒక శాతం నుంచి రెండున్నర శాతం నష్టాలను మిగిల్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ– 50 సూచీ 3 శాతం రాబడులను ఇచ్చింది. కనుక లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు బదులు ఈ సమయంలో మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీక్యాప్ ఫండ్స్ భిన్న మార్కెట్ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయని వారు సూచిస్తున్నారు. దీంతో అధిక రాబడులిచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ కాస్త తక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే... మల్టీక్యాప్ ఫండ్స్ అయినప్పటికీ క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) ద్వారా కనీసం ఐదేళ్లు ఆపైన ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మెరుగైన రాబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను భారం తగ్గించుకోవచ్చు ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత కూడా ఈక్విటీల్లోకి, మ్యూచువల్ ఫండ్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆగలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. సిప్ ద్వారా 2018లో వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం వృద్ధి నెలకొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి దీర్ఘకాల మూలధన లాభం పొందితే దానిపై 10 శాతం పన్ను చెల్లించాలి. అయితే, ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చే లాభాల్లో ఇది స్వల్ప మొత్తమేనని ఇన్వెస్టర్లు అర్థం చేసుకున్నట్టున్నారు. నిజానికి 10 శాతం పన్ను రాబడులను పెద్దగా ప్రభావం చేసేది కాదని నిపుణుల అభిప్రాయం కూడా. నెలకు సిప్ ద్వారా రూ.5,000– 10,000 మొత్తం ఇన్వెస్ట్ చేసే వారిపై ఇప్పటికిప్పుడు ఈ పన్ను ప్రభావం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ స్వల్ప మొత్తంపై ఏడాదిలో వచ్చే లాభాలు పన్ను పడే స్థాయిలో ఉండవు. అదే రూ.30,000– 50,000 మధ్య ఇన్వెస్ట్ చేసే వారయితే వార్షికంగా 12 శాతం రాబడులు వచ్చాయనుకుంటే రెండేళ్ల తర్వాత మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తారు. రెండేళ్లలో వారు పొందే లాభం రూ.లక్ష దాటుతుంది. ఆ మొత్తాన్ని ఒకే ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఈ పన్ను కూడా చెల్లించకుండా మార్గం ఉంది. ఏడాది దాటాక ప్రతీ నెలా అంతే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటూ తిరిగి అదే ఫండ్ లేదా మరో ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. దీంతో పన్ను వర్తించేంత లాభాలు రాకముందే తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2018 ఏప్రిల్ నెలలో ఓ ఫండ్‌లో ఎన్ఏవీ రూ.25 వద్ద రూ.25,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. 1,000 యూనిట్లు వచ్చి ఉంటాయి. 2019 ఏప్రిల్ నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆ మరుసటి నెలలోనే వెయ్యి యూనిట్లను రెడీమ్ చేసుకుని తిరిగి ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ప్రతీ సిప్‌కు ఏడాది పూర్తయిన వెంటనే తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటే సరి. మల్టీ ఇయర్ హెల్త్ ప్లాన్ వైద్య బీమాకు ఏటా ప్రీమియం చెల్లించాలి. లేదంటే కవరేజీ ఆగిపోతుంది. దీనికి బదులు ఒకేసారి రెండేళ్లకు ప్లాన్ తీసుకుని ప్రీమియం చెల్లించడం వల్ల తగ్గింపుతోపాటు... ఏడాదికే ప్రీమియం చెల్లించాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ 2017లో వృద్ధుల వైద్య బీమా ప్రీమియంను ఒకేసారి రెట్టింపునకు పైగా పెంచింది. కనుక ఒకేసారి ఎక్కువ సంవత్సరాలకు పాలసీ తీసుకోవడం వల్ల తగ్గింపు ఒక్కటే కాదు, ప్రీమియం పెరిగే భారం కూడా కొంత వరకు తప్పించుకున్నట్టు అవుతుంది. ఎన్పీఎస్ కూడా చూడొచ్చు.. జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనం కోసం ప్రణాళికలు వేసుకునే వారికి అనువైన సాధనాల్లో ఒకటి. ఇందులో చార్జీలు ఇతర సాధనాలతో పోలిస్తే తక్కువ. ఈక్విటీ, డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంలో 20 శాతంపై పన్ను ఉండేది. ఇది నచ్చక చాలా మంది దీనికి దూరంగా ఉండిపోయారు. అయితే, ఎన్పీఎస్ పథకం నుంచి రిటైర్మెంట్ వయసులో ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలని తెలిసిందే. ఇక ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎన్పీఎస్ నిర్వహణను చూసే పీఎఫ్ఆర్డీఏ గతేడాది అక్టోబర్‌లో మరో నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు వచ్చే వరకూ కూడా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతించింది. గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా రెండంకెల రాబడులు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఈక్విటీలకు 50 శాతం వరకు కేటాయించుకునే వారికి 11.31 శాతం చొప్పున వార్షిక రాబడులు, పూర్తిగా డెట్‌కే పరిమితమైన వారికి వార్షికంగా 10.55 శాతం చొప్పున పెట్టుబడుల వృద్ధి ఉంది. ఇక పన్ను ప్రయోజనాలు అదనం. బేసిక్ వేతనంలో 10 శాతాన్ని సెక్షన్ 80సీసీడీ(2) కింద ఉద్యోగి తరఫున కంపెనీ ఎన్పీఎస్కు జమ చేస్తే పన్ను ఉండదు. అలాగే, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో అదనంగా మరో రూ.50,000 పెట్టుబడిపైనా పన్ను ఉండదు. కనుక దీన్ని తప్పకుండా పరిశీలించాల్సిన పథకంగా ఫైనాన్షియల్ అడ్వైజర్ల సూచన. విదేశీ ఫండ్స్‌లో కూడా... అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్ఏవీల ధరలు కొంత కాలం క్రితం వరకూ బాగా పెరిగాయి. తాజాగా అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో వాటి ఎన్ఏవీలు తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన అమెరికా ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్నో అంశాలను అధ్యయనం చేశాకే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. బలమైన బ్రాండ్, మార్కెట్ వ్యాల్యూ, బలమైన నగదు ప్రవాహాలు వంటి అంశాలను చూస్తాయి. పైగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కూడా పెట్టుబడుల విలువ పెరిగేందుకు దోహదపడుతుంది. కనుక తమ పిల్లలను విదేశీ విద్యకు పంపించాలనుకునే వారు ఈ తరహా ఫండ్స్‌లో ముందునుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రుణాన్ని బదలాయించుకుంటే...? రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు వాటి అంతర్గత బెంచ్ మార్క్ రేటుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పారదర్శకత తక్కువగా ఉంటోంది. దీనికి బదులు రెపో రేటు, 91, 182 రోజుల ట్రెజరీ బిల్లు ఈల్డ్ రేటు లేదా ఏదైనా ఇతర బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను అనుసరించాలని ఆర్బీఐ ఇటీవలే ఆదేశించింది. గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత రుణాలకూ ఇది అమలుకానుంది. బ్యాంకుల మధ్య పోటీ పెరిగి కస్టమర్లకు తక్కువ రేట్లకే రుణం లభించే పరిస్థితులకు ఇది దారితీస్తుంది. కనుక అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకున్న వారు దాన్ని తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రుణం తొలి నాళ్లలో ఈఎంఐలో ఎక్కువ మొత్తం వడ్డీకే వెళుతుంది. కనుక మొదట్లోనే రుణాన్ని బదలాయించుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ. పెద్దల పేరు మీద పెట్టుబడి 60 ఏళ్లు దాటిన వారు వార్షికంగా పొందే రూ.50వేల వడ్డీ ఆదాయానికి పన్నును మినహాయిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 60 ఏళ్ల లోపు వయసులో ఉన్న వారు ఏటా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక తమ తల్లిదండ్రులకు పన్ను వర్తించేంత ఆదాయం లేకపోతే, వారికి గిఫ్ట్‌గా ఇచ్చి, వారి పేరిట డిపాజిట్ చేయడం మంచి ఆలోచన. ఇది చట్టబద్ధం కూడా. పైగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అర శాతం వరకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యా, పిల్లలకు గిఫ్ట్ ఇచ్చి వారి పేరిట ఇన్వెస్ట్ చేసినా, అది గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఆదాయం కిందే చట్టం పరిగణిస్తుంది. తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇస్తే మోసపూరిత లావాదేవీగా చట్టం పరిగణించదని ట్యాక్స్‌స్పానర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సుధీర్కౌశిక్ తెలిపారు. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా ఆటుపోట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఈ సమయంలో దీర్ఘకాల డెట్ ఫండ్స్ కంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాల ఫండ్స్, దీర్ఘకాలంలో గడువు తీరే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంక్రిమెంటల్ రిస్క్ తీసుకున్నా గానీ దీర్ఘకాల డెట్ ఫండ్స్ తగినంత రాబడులను ఆఫర్ చేయడం లేదని, వీటికి బదులు మూడేళ్ల లోపు గడువు తీరే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఐవో ధావల్ దలాల్ సూచించారు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ (రుణ చరిత్ర) ఉన్న కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చని కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం హెడ్ అవనీష్ జెయిన్ సూచన. 2–5 ఏళ్ల కాలానికి ఇవి మంచి రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు డెట్ ఫండ్స్‌లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ ప్రయోజనం నష్టపోతారు. ఈ రకమైన రిస్క్ వద్దనుకునేవారు ఎఫ్ఎంపీలను పరిశీలించొచ్చు. ఇవి డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసి గడువు తీరే వరకు కొనసాగుతాయి. దాంతో బాండ్ ఈల్డ్స్‌కు అనుగుణంగానే రాబడులు ఉంటాయి. -
బాలల ఆరోగ్యం.. గాల్లో దీపం
నిడమర్రు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం అమలవుతున్న ‘రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం’ నాలుగేళ్లుగా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. బాలల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఆరోగ్య కార్డుల పంపిణీ మూడేళ్లుగా నిలిచిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పథకాల పేరు మార్పుపై పెట్టిన శ్రద్ధ వాటి అమలుపై చూపకపోవడంతో ఈ పథకం కూడా అటకెక్కింది. దాంతో ఏటా సీజనల్ వ్యాధుల బారినపడుతున్న విద్యార్థులకు వైద్యం అందడం లేదు. పథకం పేరు మార్చి.. ఏమార్చి గతంలో జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా ఆరోగ్య పరీక్షలను స్థానిక పీహెచ్సీ, ఆరోగ్య సిబ్బంది నిర్వహించేవారు. స్థానిక డాక్టర్ తన పరిధిలోని పాఠశాలల్లో నెలకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉన్న మందులు అందించేవారు. 2016 నుంచి ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం’ (ఆర్బీఎస్కే)గా పేరు మార్చింది. వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత రెండేళ్లుగా వైద్య సిబ్బంది కొరత తదితర కారణాలతో జిల్లాలో విద్యార్థులకు వైద్య పరీక్షలు అరకొరగా సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో పాఠశాలలు పునఃపారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థతో ఒప్పందం గత ఏడాది రాష్ట్ర బాలల ఆరోగ్య పథకం నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ధనుష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ జిల్లాలో 36 వైద్య బృందాలను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. ఒక్కో బృందం ప్రతిరోజూ 120 మంది విద్యార్థులను పరీక్షించి చికిత్స అందించాల్సి ఉంది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి సాధ్యంకాని వ్యాధులుంటే రిఫరల్ ఆసుపత్రులకు పంపించాలి. ఈ మేరకు ఒక్కో విద్యార్ధికి రూ.47.50 చెల్లించే విధంగా ఒప్పదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అరకొరగా ఆరోగ్య కార్డుల పంపిణీ జిల్లాలో 2,870 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 3.2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారంతా పేద విద్యార్థులే కావడంతో సహజంగానే పౌష్టికాహారలోపం ఉంటుంది. దీంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గత రెండేళ్లుగా జిల్లాలోని ఏ పాఠశాలలోను ఈ ఆరోగ్య కార్డులు పూర్తి స్థాయిలో అందలేదు. ఆరోగ్య రికార్డులో ప్రతి విద్యార్థికీ రక్త పరీక్షలు నిర్వహించి ఆ వివరాలు నమోదు చేయాలి. ఈ విషయం ఆరోగ్య సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ప్రపంచవ్యాప్త కవరేజీతో న్యూఇండియా హెల్త్‌ప్లాన్
ముంబై: న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలిసారిగా ప్రపంచవ్యాప్త కవరేజీతో కూడిన గ్లోబల్ మెడిక్లెయిమ్ పాలసీని మంగళవారం ఆవిష్కరించింది. కేన్సర్, అవయవ మార్పిడి, బోన్‌మారో ఇలా ఆరు రకాల క్రిటికల్ ఇల్నెస్లకు 0.5 మిలియన్ డాలర్ల నుంచి 20 మిలియన్ డాలర్ల వరకు ఈ పాలసీలో కవరేజీ పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 100 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నట్టు న్యూఇండియా జనరల్ ఇన్సూరెన్స్ చైర్మన్, ఎండీ జి.శ్రీనివాసన్ మీడియాకు తెలిపారు. 18–75 సంవత్సరాల మధ్యనున్న వారు ఎటువంటి ముందుస్తు షరతులు లేకుండా ఆరు రకాల క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజీ పొందొచ్చు. ఎన్ని రకాల క్రిటికల్ ఇల్నెస్ కవరేజీలను ఎంచుకున్నారు, వయసు తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఒక దానికి కవరేజీ ఎంచుకుంటే ప్రీమియం రూ.5,672. ఆరు రకాల క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజీ కోరుకుంటే ప్రీమియం రూ.12,716. అదే 75 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఒక దానికి కవరేజీ కోసం ప్రీమియం రూ.2,05,696 కాగా, క్రిటికల్ ఇల్నెస్ కవర్‌తో కలిపితే వార్షిక ప్రీమియం రూ.4,95,899 అవుతుంది. -
ప్యాకేజీలోలేని వాటికీ క్యాష్‌లెస్ చికిత్స
- ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంలో మరో వెసులుబాటు - అధునాతన చికిత్సలు, వైద్య పరీక్షలన్నింటికీ వర్తింపచేసేలా వీలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అపరిమిత వైద్య సేవలు అందనున్నాయి. ప్యాకేజీలో లేని వైద్య పరీక్షలు, వ్యాధులకు చికిత్స కూడా ఉచితం గానే అందించనుంది. ఈ మేరకు ఉద్యో గులు, జర్నలిస్టుల నగదు రహిత ఆరోగ్య పథకంలో అనేక వెసులుబాట్లు కల్పిం చింది. వాస్తవంగా ఈ పథకంలో 1899 వ్యాధులకు, 3,783 రకాల వైద్య పరీక్షలకు మాత్రమే ప్యాకేజీ ఖరారు చేశారు. ఆ ప్రకారమే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని సేవలు అందుతాయి. అయితే, ఇవిగాక ప్యాకేజీలో పేర్కొనని ఇతరత్రా వ్యాధులు వచ్చినా, అధునాతన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వచ్చినా కూడా వాటికీ నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వ్యాధి, వైద్య పరీక్షల వివరాలను ఆయా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు తమకు తెలియజేస్తే, అందుకయ్యే సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీనివల్ల ప్యాకేజీలో లేని వ్యాధులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. కొత్త వ్యాధులు... అధునాతన చికిత్స పద్ధతులు వైద్య రంగంలో అధునాతన చికిత్సా పద్ధ తులు వస్తున్నాయి. వీటిని అందిపుచ్చు కోవడంలో హైదరాబాద్ ముందుంది. ఎలాంటి కొత్త వ్యాధి వచ్చినా ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహితం అందించా లని నిర్ణయించారు. గుండె, కిడ్నీ, లివర్, కేన్సర్ తదితర వ్యాధులను ప్యాకేజీగా ఖరారు చేశారు. ఈ ప్యాకేజీలో లేని వాటిని మైనర్, మేజర్ సర్జరీలుగా విభజించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మైనర్ చికిత్స అయితే రూ.57 వేలు, మేజరైతే రూ. 1.46 లక్షలు ఇస్తారు. కిడ్నీ ప్యాకేజీలో లేని మైనర్ చికిత్సకు రూ.11,500, మేజరైతే రూ.57 వేలు ఇస్తారు. అంతకంటే ఎక్కువైతే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. యూరాలజీలో ప్యాకేజీలో లేని విధంగా వ్యాధి ఏదైనా వస్తే మైనర్‌కు రూ.11,500, మేజర్ శస్త్రచికిత్సకు రూ.57 వేలు ఇస్తారు. -
త్వరలో భారీ ఆరోగ్య పథకం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారీ ఆరోగ్య పథకాన్ని కేంద్రం ప్రారంభించనుంది. అంటువ్యాధులు కాని ఐదు ఉమ్మడి వ్యాధుల నియంత్రణకు సంబంధించి ఓ భారీ ఆరోగ్య పథకాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది. మొదటి దశలో మార్చి 31 లోగా దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఐదు ఉమ్మడి వ్యాధుల్లో అధిక రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించనున్నారు. -
ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుకు ‘యాప్’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మొబైల్ యాప్‌ను తయారు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా ఏ ఆసుపత్రుల్లో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, అందులోని వైద్యుల పేర్లు, వెల్నెస్ కేంద్రాల వివరాలు, వాటి సమయాలు, నగదు రహిత వైద్యం నిర్వహించే ఆసుపత్రులు తదితర సమాచారాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు నిర్వ హించిన వైద్య పరీక్షలు, వివిధ ఆసుపత్రుల్లో నిర్వహించిన సేవల వివరాలు కూడా యాప్‌లో ఉంచుతారు. ప్రతీ ఉద్యోగి, జర్నలిస్టుకు యూనిక్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేస్తే వారి ఆరోగ్య వివరాలన్నీ అందులో ఉంటాయి. ఈ నెలాఖరు నుంచి వెల్నెస్ కేంద్రాలు...: ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం నగదు రహిత ఓపీ సేవలను అందించే వెల్నెస్ (రిఫరల్) కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవంగా ఈ వారంలోనే అందుబాటులోకి తేవాలని నిర్ణయించినా పెద్ద నోట్ల రద్దుతో ఈ నిర్ణయం వాయిదా పడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, పాత జిల్లా కేంద్రాలన్నింట్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఎవరైనా ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలను పొందాలనుకుంటే నేరుగా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లొచ్చని తెలిపాయి. దీనికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. వెల్నెస్ కేంద్రాల్లో ఓపీ సేవలు, ఉచిత పరీక్షలు, మందులు ఇచ్చే పరిస్థితి అమలులోకి వచ్చాక... కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాక ప్రస్తుతం అమల్లో ఉన్న రీయింబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేస్తారు. -
ప్రభుత్వోద్యోగులకు సరికొత్త ఆరోగ్య పథకం
వైద్య,ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం (సీజీఈహెచ్‌ఎస్) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. మందుల సరఫరా సైతం ఈ పథకంలోకి తీసుకురానుంది. అలాగే ఔట్ పేషంట్ సేవల కోసం ప్రత్యేకంగా క్లినిక్‌లు నిర్వహించాలని భావిస్తోంది. శుక్రవారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మతో కలసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వైద్యపరమైన అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (టీజీఈహెచ్‌ఎస్)ను అందుబాటులోకి తెచ్చే అంశంపైనా చర్చించారు. ఖాళీగా ఉన్న 2,118 పోస్టులను భర్తీ చేయాల్సిన పద్ధతులపై సమాలోచనలు చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, నవీన్‌మిట్టల్, జీఏడీ కార్యదర్శి శివశంకర్, న్యాయ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, టీజీఈహెచ్‌ఎస్ సీఈఓ పద్మ పాల్గొన్నారు.