నో ఆల్కహాల్‌, నో టాక్సిక్‌ పీపుల్‌ మలైకా పోస్ట్‌: షాకవుతున్న ఫ్యాన్స్‌ | November challenge no alcohol no toxic people says Malaika Arora | Sakshi
Sakshi News home page

నో ఆల్కహాల్‌, నో టాక్సిక్‌ పీపుల్‌ మలైకా నవంబరు ఛాలెంజ్: షాకవుతున్న ఫ్యాన్స్‌

Published Wed, Nov 13 2024 3:14 PM | Last Updated on Wed, Nov 13 2024 3:26 PM

November challenge no alcohol no toxic people says Malaika Arora

మలైకా నవంబరు ఛాలెంజ్‌, వైరల్‌ అవుతున్నపోస్ట్‌

చిరకాల ప్రియుడు అర్జున్ కపూర్‌తో నుంచి  బ్రేకప్‌ తరువాత నటి మలైకా అరోరా సంచలన ప్రకటన చేసింది.  ఇటీవల కొన్ని పోస్ట్‌ల తరువాత 'నవంబర్ ఛాలెంజ్' ని ఆసక్తికరంగా ప్రకటించింది.  మద్యం,నిద్రతోపాటు టాక్సిక్‌ పీపుల్‌  నుంచి దూరంగా ఉంటానంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ పెట్టింది.  ఇది  మాజీ ప్రియుడు అర్జున్‌  కపూర్‌ గురించేనా అంటూ షాక్‌ అవడం అభిమానుల వంతైంది.

శారీరకంగా దృఢంగా ఉండటానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెలలో(నవంబరు)లో మలైకా చేయాలను కుంటున్న తొమ్మిది పనుల లిస్ట్‌ను ప్రకటించింది.  మలైకా నవంబర్ ఛాలెంజ్‌ 1. మద్యం  దూరంగా ఉండటం 2. ఎనిమిది గంటల నిద్ర. 3. మంచి గురువును 4. రోజూ వ్యాయామం  5. రోజుకు పదివేల అడుగులు. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం 8. రాత్రి 8 గంటల తర్వాత నోటికి తాః 9. విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం. 

శారీరంగా ఆరోగ్యంగా  ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి  సానుకూలంగా, స్నేహంగా ఉండే వ్యక్తులతో సన్నిహితం  ఉండటం కూడా అవసరమే అంటారు కూడా.

కాగా అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మలైకా,అర్జున్  రిలేషన్‌లో ఉన్నారు. అయితే 'సింగమ్ ఎగైన్' మూవీప్రమోషన్‌ ఈవెంట్‌లో తాను ఇంకా సింగిల్‌ అని ప్రకటించి, మలైకాతో తన బంధం గురించి  చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం  తేల్చి చెప్పేశాడు. సింగం  ఎగైన్‌ మూవీలో విలన్‌గా   అర్జున్ కపూర్  మంచి మార్కులే సాధించాడు. సినిమా సక్సెస్‌ కావడంతో  మరింత ఉత్సాహంగా ఉన్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement