న్యూఢిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా చోళ సర్వ శక్తి పేరుతో ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ ఎస్‌ఎఫ్‌బీ (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు) ప్రకటించింది. ఇందుకోసం చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌తో టైఅప్ అయ్యింది.
పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా గుండె, గర్భధారణ, పునరుత్పత్తి, కేన్సర్, హైపర్ టెన్షన్ వంటి సమస్యలకు గురవుతున్నట్టు ఈక్విటాస్ ఎస్‌ఎఫ్‌బీ పేర్కొంది. ప్రతీ 1,009 మంది మహిళలలో 39 శాతం మందికే హెల్త్ కవరేజీ ఉన్నట్టు ఒక సర్వేను ప్రస్తావించింది. వ్యక్తిగత, సమగ్ర హెల్త్ కవరేజీని చోళసర్వశక్తి ప్లాన్ కింద అందిస్తున్నట్టు తెలిపింది. వైద్య సంక్షోభ సమయాల్లో అధిక శాతం భరోసా, సాయం అందించే లక్ష్యంతో ఈ ప్లాన్‌ను ఆవిష్కరించినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment