న్యూఢిల్లీ: నియంత్రణ చర్యల కారణంగా 80–85 శాతం పేటీఎం వాలెట్ వినియోగదార్లు ఎటువంటి అంతరాయాన్ని ఎదురుకోరని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. మిగిలిన వినియోగదారులు తమ యాప్‌లను ఇతర బ్యాంకులకు లింక్ చేయాలని సూచించామని అన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో జతచేయబడిన వాలెట్‌ను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి ఆర్‌బీఐ మార్చి 15 వరకు గడువు ఇచి్చంది.
ఇచి్చన గడువు సరిపోతుందని, తదుపరి పొడిగింపు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 80–85 శాతం పేటీఎం వాలెట్లు ఇతర బ్యాంకులతో అనుసంధానం అయ్యాయని చెప్పారు. నియంత్రిత సంస్థపై మాత్రమే ఆర్‌బీఐ చర్య తీసుకుందని, ఫిన్‌టెక్ కంపెనీలకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఫిన్‌టెక్ సంస్థలకు పూర్తి మద్దతునిస్తామని, వీటి వృద్ధికి ఆర్‌బీఐ అండగా ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment