పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'భవేష్ గుప్తా' తన పదవికి రాజీనామా చేశారు. కెరీర్‌లో విరామం తీసుకోవాలనే వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుప్తా పేర్కొన్నారు.
మే 31న కంపెనీ నుంచి ఆయన రిలీవ్ కానున్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. గుప్తా ఏడాది చివరి వరకు పేటీఎం కార్యక్రమాలకు మార్గదర్శకత్వం చేస్తూ సలహాదారుగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
గుప్తా పేటీఎంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించేవారు. కొత్త లావాదేవీలను కొనసాగించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నిషేధం విధించడం వల్ల ఆయన నేతృత్వంలోని లావాదేవీలన్నీ కూడా ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయి.
రాకేష్ సింగ్ ఇటీవలే పేటీఎం మనీ లిమిటెడ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈయన గతంలో ఫిస్‌డమ్‌లో స్టాక్ బ్రోకింగ్‌కు సీఈఓగా ఉన్నారు. అంతే కాకుండా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్‌లో కీలకమైన పదవులను నిర్వహించినట్లు తెలుస్తోంది.
We're excited to announce leadership changes as we double down on our payments & financial services offerings.
Strengthening succession planning, Bhavesh Gupta transitions to advisory role while Varun Sridhar becomes CEO of Paytm Services Pvt Ltd. Welcome aboard Rakesh Singh,…— Paytm (@Paytm) May 4, 2024
Comments
Please login to add a commentAdd a comment