చెన్నై: ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌తో జట్టు కట్టింది. పేటీఎం నెట్‌వర్క్‌లోని వ్యాపారులు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి రుణాలు పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. తర్వాత దశల్లో వినియోగదారులకు కూడా రుణాలను అందించేలా దీన్ని విస్తరించనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవాంకర్ తెలిపారు. దేశీయంగా రిటైల్ రుణాలకు భారీగా డిమా ండ్ నెలకొందని, రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన వివరించారు.
రుణాల పంపిణీ వ్యవస్థను మరింతగా విస్తరించేందుకు శ్రీరా మ్ ఫైనాన్స్‌తో ఒప్పందం దోహదపడగలదని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. తమ ప్లాట్ ఫాంపై చిన్న వ్యాపారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలతో పాటు ఇతరత్రా డిజిటల్ ఆర్థి క సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడగలదని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తూ.. 2,922 శాఖలు, 64,052 మంది ఉద్యోగులతో శ్రీరామ్ ఫైనాన్స్ దేశీయంగా అతి పెద్ద రిటైల్ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో ఒకటిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment