sriram finance
-
శ్రీరామ్ ఫైనాన్స్‌తో పేటీఎం జట్టు
చెన్నై: ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌తో జట్టు కట్టింది. పేటీఎం నెట్‌వర్క్‌లోని వ్యాపారులు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి రుణాలు పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. తర్వాత దశల్లో వినియోగదారులకు కూడా రుణాలను అందించేలా దీన్ని విస్తరించనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవాంకర్ తెలిపారు. దేశీయంగా రిటైల్ రుణాలకు భారీగా డిమా ండ్ నెలకొందని, రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన వివరించారు. రుణాల పంపిణీ వ్యవస్థను మరింతగా విస్తరించేందుకు శ్రీరా మ్ ఫైనాన్స్‌తో ఒప్పందం దోహదపడగలదని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. తమ ప్లాట్ ఫాంపై చిన్న వ్యాపారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలతో పాటు ఇతరత్రా డిజిటల్ ఆర్థి క సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడగలదని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తూ.. 2,922 శాఖలు, 64,052 మంది ఉద్యోగులతో శ్రీరామ్ ఫైనాన్స్ దేశీయంగా అతి పెద్ద రిటైల్ ఎన్బీఎఫ్సీ కంపెనీల్లో ఒకటిగా ఉంది. -
శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి పిరమల్ ఔట్
ముంబై: యూఎస్ పీఈ దిగ్గజం టీపీజీ తదుపరి తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాటా విక్రయాన్ని చేపట్టింది. ఓపెన్ మార్కెట్ ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్‌లో గల మొత్తం 8.34 శాతం వాటాను పిరమల్ విక్రయించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్, బ్లాక్‌రాక్, బీఎన్పీ పరిబాస్, సొసైటీ జనరాలి తదితర సంస్థలకు 3.12 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బ్లాక్‌డీల్స్ ద్వారా రూ. 1,545 ధరలో రూ. 4,824 కోట్లకు వాటాను ఆఫర్ చేసింది. సోమవారం శ్రీరామ్ ఫైనాన్స్‌లో 2.65% వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,390 కోట్లకు టీపీజీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఎంఎఫ్‌లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేశాయి. కాగా.. బ్లాక్‌డీల్ వా ర్తల ప్రభావంతో బుధవారం ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనా న్స్ షేరు 11.3% దూసుకెళ్లి రూ. 1,736 వద్ద నిలిచింది. ఇక మంగళవారం 6% జంప్‌చేసి రూ. 838కు చేరి న పిరమల్ ఎంటర్ప్రైజెస్ బుధవారం మరింత అధికంగా 14.2% దూసుకెళ్లి రూ.958 వద్ద ముగిసింది. పునర్వ్యవస్థీకరణతో శ్రీరామ్ గ్రూప్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ తదుపరి పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు గ్రూప్‌లోని పలు కంపెనీలలో షేర్లు లభించాయి. ఈ బాటలో శ్రీరామ్ ఫైనాన్స్‌లో 8.34 శాతం వాటాను పొందగా.. శ్రీరామ్ జీఐ హోల్డింగ్స్, ఎల్ఐ హోల్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్‌లోనూ 20 శాతం చొప్పున వాటాలు లభించాయి. దీంతో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 13.33 శాతం, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 14.91 శాతం వాటాను సొంతం చేసుకుంది. -
చిన్న సంస్థలకు రుణాలపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు, స్వయం ఉపాధి పొందుతున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు. కొత్తగా సప్లై చెయిన్ ఫైనాన్సింగ్, విద్యా రుణాల విభాగాల్లోకి కూడా మరికొద్ది నెలల్లో ప్రవేశించనున్నట్లు చక్రవర్తి వివరించారు. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 15% పైచిలుకు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18% వరకు వ్యాపార వృద్ధిని అంచనా వేస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) రూ. 1,71,000 కోట్లుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 33,000 కోట్లుగా ఉందని చక్రవర్తి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.3,000 కోట్ల డిపాజిట్లు, 46,000 పైచిలుకు డిపాజిట్‌దారులు, 10,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో అన్ని సర్వీసులు .. ప్రస్తుతం 268 శాఖల్లో మాత్రమే వాణిజ్య వాహన (సీవీ) రుణాలు ఇస్తుండగా, కొత్తగా మరో 170 శాఖల్లో కూడా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 2023 ఆఖరు నాటికి అన్ని శాఖల్లోనూ అన్ని ఉత్పత్తులను అందించాలని నిర్దేశించుకున్నట్లు చక్రవర్తి చెప్పారు. -
ఎన్నికల అధికారులమంటూ.. 4 లక్షల దోపిడీ
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ వింత దోపిడీ జరిగింది. ఎన్నికల అధికారులమంటూ వచ్చి, కొంతమంది దొంగలు దోపిడీ చేశారు. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది లబోదిబోమంటున్నారు. తమవద్దకు వచ్చి, తాము ఎన్నికల అధికారులమని, తనిఖీలు చేయాలని చెప్పి, మొత్తం 4 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెబుతున్నారు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా నగదు తీసుకెళ్లడంపై కఠిన నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలో పనిచేసే గుమాస్తా స్థానిక ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేయడానికి 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్లాడు. అయితే కొంతమంది వ్యక్తులు అతడి వద్దకు వచ్చి తాము ఎన్నికల అధికారులమని, తనిఖీ చేయాలని చెప్పారు. అతడు తాను ఫలానా అని చెప్పి, బ్యాగ్ ఇవ్వగా.. వారు తనిఖీ చేసి తిరిగి ఇచ్చేశారు. అయితే, బ్యాంకులోకి వెళ్లి డిపాజిట్ చేయడానికి చూసుకోగా, బ్యాగ్‌లో 4 లక్షల రూపాయలు గల్లంతయ్యాయి. కేవలం 6 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో అతడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.