పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించడం పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు మౌనం వీడింది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం వల్లే పేటీఎంపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. అయితే పేటీఎంపై చర్యలకు దారితీసిన నిర్దిష్టమైన లోపాలను మాత్రం వెల్లడించలేదు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లను స్వీకరించకుండా నిరోధించడం పర్యవేక్షక చర్యలో భాగమని, పరిమితులకుమించి లావాదేవీలు గుర్తించినట్లు ఒక ఆర్‌బీఐ సీనియర్ అధికారి తెలిపారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ చర్యలు తీసుకోక ముందు నుంచే సంబంధిత సంస్థకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. పొరపాటు జరగకుండా వాటికి దిద్దుబాటు చర్చలు తీసుకోవాలని సంస్థకు అప్పటికే చాలా సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment