న్యూయార్క్: ఫేస్‌బుక్ యూజర్ల వివరాలను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా.. అమెరికాలో దివాలా పిటీషన్ వేసింది. దీనికి సంబంధించి దాఖలు చేసిన పత్రాల ప్రకారం కంపెనీ ఆస్తులు సుమారు 1– 5 లక్షల డాలర్ల మధ్య ఉంటాయి.
రుణాలు 10 లక్షలు– కోటి డాలర్ల మధ్య ఉన్నాయి. బ్రిటన్‌లోనూ దివాలా పిటీషన్ వేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కారణంగా తమ వ్యాపారం దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి అనుకూల ఫలితాలు వచ్చేలా.. లక్షల సంఖ్యలో ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దుర్వినియోగం చేసిందంటూ కేంబ్రిడ్జ్ అనలిటికాపై ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment