
సాక్షి, అమరావతి: ఏపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. డేటాచోరీ స్కాం బయటకు రావడంతో ఎవరి గుట్టు బయటపడుతోందోనని ఆందోళన చేందుతున్నారు. దీనిలో అధికారులు పాత్ర ఉందా? లేక ఉద్యోగుల పాత్రనా? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. రియల్ టైం గవర్నెన్స్, 1100, ప్రజాసాధికార సర్వే డేటా వంటి సంస్థలపై పలు అనుమానాలు వ్యక్తమతున్నాయి. ప్రభుత్వం వాటిలో ముఖ్యమైన పౌరసమాచారాన్ని భద్రపరిచింది.
ప్రభుత్వం పథకాల అర్హులను గుర్తించేందుకు గతంలో లబ్దిదారుల ఓటరు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడా సమాచారం చోరీకి గురైందన్న ఆరోపణలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. డేటా చోరీ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి లోకేష్ టీం ప్రమేయంపైనా టీడీపీలో చర్చజరుగుతోంది.