![currency denominations in circulation withdraw Rs 2000 notes RBI data - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/20/currency-denominations.jpg.webp?itok=8ObSeXki)
దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో అత్యధిక విలువ కగిలిన నోటు రూ.2 వేల నోటు. అయితే తాజాగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).
'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది.
రూ.500 నోట్లదే అత్యధిక వాటా
ఆర్బీఐ డేటా ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 500 నోటు అత్యధిక విలువ కలిగిన కరెన్సీ అని తేలింది. ఇది మొత్తం విలువ పరంగా రూ. 22.77 లక్షల కోట్ల విలువైనది. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో దీని వాటా 73.3 శాతం. దీని తర్వాత స్థానంలో
రూ. 2,000 నోట్లు ఉన్నాయి. మొత్తం చెలామణిలో ఇవి 13.8 శాతంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..
అయితే తాజాగా మే19న ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2 వేల నోట్ల మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. అన్ని డినామినేషన్ నోట్లో వీటి వాటా 10.8 శాతం మాత్రమే. రూ. 2 నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కి ముందు ముద్రించినవే.
ఏయే నోట్లు ఎంతెంత?
2022 మార్చి చివరి నాటికి చలామణిలో వివిధ డినామినేషన్ నోట్ల సంఖ్య, విలువలు ఇలా ఉన్నాయి.
- రూ.2వేలు - 21,420 లక్షల నోట్లు - విలువ రూ.4,28,394 కోట్లు
- రూ.500 - 4,55,468 లక్షల నోట్లు - విలువ రూ.22,77,340 కోట్లు
- రూ.200 - 60,441 లక్షల నోట్లు - విలువ రూ.1,20,881 కోట్లు
- రూ.100 - 1,81,420 లక్షల నోట్లు - విలువ రూ.1,81,421 కోట్లు
- రూ.50 - 87,141 లక్షల నోట్లు - విలువ రూ.43,571 కోట్లు
- రూ.20 - 1,10,129 లక్షల నోట్లు - విలువ రూ.22,026 కోట్లు
- రూ.10 - 2,78,046 లక్షల నోట్లు - విలువ రూ.27,805 కోట్లు
బిజినెస్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి
Comments
Please login to add a commentAdd a comment