వాషింగ్టన్: టెక్నాలజీ కంపెనీలు భారత వినియోగదారుల సమాచారాన్ని భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనపై సానుకూల వైఖరిని అనుసరించాలని ప్రధాని మోదీని కోరుతూ ఇద్దరు అమెరికా సెనెటర్లు లేఖ రాశారు. ఈ నిబంధన కారణంగా అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నేతలు జాన్ కోర్నిన్, మార్క్ వార్నర్‌లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలాగైతే కంపెనీలు భారత్‌లో సమర్థంగా వ్యాపారం చేయలేవనీ, అదే జరిగితే భారత ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆటంకాలు ఎదురవుతాయని హెచ్చరించారు. భారత్‌లోనే సమా చారాన్ని నిల్వ చేసినంత మాత్రాన భారతీయుల డేటాకు భద్రత ఏమీ లభించదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment