వ్యాక్సిన్‌ తరువాత పాజిటివ్‌ : ఐసీఎంఆర్‌ సంచలన రిపోర్టు | ICMR Interesting reporting after  vaccine  howmany people have tested positive  | Sakshi

వ్యాక్సిన్‌ తరువాత పాజిటివ్‌ : ఐసీఎంఆర్‌ సంచలన రిపోర్టు

Apr 21 2021 7:03 PM | Updated on Apr 22 2021 1:40 AM

ICMR Interesting reporting after  vaccine  howmany people have tested positive  - Sakshi

టీకాలు వేసిన తరువాత ప్రజలు వ్యాధి బారిన పడుతున్నప్పటికీ,  వ్యాధి తీవ్రంకాకుండా నిరోధిస్తుందని ఐసీంఆర్‌ డేటా తేల్చంది.  అయితే కోవిడ్‌ టీకా తీసుకున్న తరువాత వైరస్‌ సోకుతున్న వారి నిష్పత్తి  సామాన్య ప్రజలలో చాలా తక్కువగా ఉందని  తెలిపింది.

సాక్షి న్యూఢిల్లీ :  దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌లో  ఉధృతి  ఆందోళన కరంగా సాగుతోంది. ఎక్కడ చూసినా  ఆసుపత్రులలో  మందులు, బెడ్లు దొరకక, వెంటిలేటర‍్ల కొరతతో కరోనా రోగులు అల్లాడిపోతున్నారు.  చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరోనా ప్రభావిత రాష్ట్రాలు, డిల్లీ, మహారాష్ట పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కోవిడ్‌ టీకా తీసుకున్న తరువాత  చోటు చేసుకుంటున్నఘటనలు,  కొన్ని విషాదకర వార్తలతో అనేక భయాందోళలను నెలకొన్నాయి. దీంతో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు చాలామంది వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంచలన డేటాను విడుదల చేసింది.  టీకాలు వేసిన తరువాత ప్రజలు వ్యాధి బారిన పడుతున్నప్పటికీ,  వ్యాధి తీవ్రంకాకుండా నిరోధిస్తుందని ఐసీంఆర్‌ డేటా తేల్చంది.  అయితే కోవిడ్‌ టీకా తీసుకున్న తరువాత వైరస్‌ సోకుతున్న వారి నిష్పత్తి  సామాన్య ప్రజలలో చాలా తక్కువగా ఉందని ఈ డేటా  తెలిపింది. టీకా  మొదటి లేదా రెండవ మోతాదు తీసుకున్న చాలా రోజుల తరువాత కోవిడ్ -19 బారిన పడిన వ్యక్తుల డేటాను ఐసిఎంఆర్‌ నిపుణుల  బృందం వెల్లడించింది. (కరోనా సెకండ్‌ వేవ్‌ మోదీ మేడ్‌ డిజాస్టర్‌: దీదీ ఫైర్‌)

బుధవారం  విడుదల చేసిన డేటా  ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 1.1 కోట్ల మందికి భారత్ బయోటెక్ కోవాక్సిన్ అందించారు. కోవాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న వారిలో దాదాపు 0.04 శాతం మంది కోవిడ్-19 పాజిటివ్  నిర్ధారణ అయిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సుమారు 93 లక్షల మంది తమ మొదటి మోతాదును, సుమారు 17 లక్షల మంది రెండవ మోతాదును పొందారు. మొదటి మోతాదు పొందిన 93 లక్షలమందిలో  4,208 మందికి, రెండవ షాట్ తీసుకున్న 17 లక్షలలో, 695 మంది మాత్రమే కరోనా సోకిందన్నారు.  అలాగే   సీరం ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్  రెండవ మోతాదు తీసుకున్న తరువాత పాజిటివ్ పరీక్షించిన వారి శాతం 0.03 శాతంగా ఉంది. దాదాపు 10 కోట్ల మంది కోవిషిల్డ్‌ మొదటి మోతాదును  స్వీకరించగా  వీరిలో 17,145 మంది తొలి డోసు  తర్వాత  1.5 కోట్లకు పైగా ప్రజలకు రెండవ మోతాదు ను తీసుకోగా, వీరిలో, 5,014 మంది పాజిటివ్ పరీక్షించారు. కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారు. పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల నిష్పత్తి మొదటి మోతాదు తర్వాత 0.02 శాతం, రెండవ మోతాదు తర్వాత 0.03 శాతంగా ఉంది. అలాగే  కరోనా టీకా తీసుకున్న తరువాత  ప్రతి 10,000 జనాభాకు 2-4 మందికి మాత్రమే కోవిడ్-19  సోకుతోందనీ,  ఆ తర్వాత వ్యాధి బారినపడే వారి శాతం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్  సభ్యుడు (ఆరోగ్యం)  డాక్టర్ వి.కె పాల్ అన్నారు. (కరోనా బారిన మరో కేంద్ర మంత్రి)

కోవిషీల్డ్ 70 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉండగా, కోవాక్సిన్ తన 3 వ దశ ట్రయల్స్‌లో 81 శాతం మధ్యంతర సామర్థ్యాన్ని చూపించిందని వెల్లడించారు.  రెండవ మోతాదు తీసుకున్న 10-15 రోజుల తరువాత మాత్రమే తగినంత యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని నిపుణులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 87 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 79 శాతం మంది ఫ్రంట్ లైన్ కార్మికులు తమ మొదటి మోతాదు కోవిడ్ -19 వ్యాక్సిన్లను  స్వీకరించారని చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి 130 మిలియన్ల టీకాలను  అందించారు. (ఉన్నట్టుండి పేలిన ఫోన్‌, జనం హడల్‌: వైరల్‌ వీడియో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement