ఢిల్లీ: ప్రపంచాన్ని బెంబెలేత్తించిన కరోనా వైరస్ కట్టడి కోసం చాలా దేశాలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. మన దగ్గర ఇప్పటికే భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరం కంపెనీ కోవిషీల్డ్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే టీకా తీసుకున్న తర్వాత కొందరు కోవిడ్ బారిన పడ్డారు. దాంతో వ్యాక్సిన్ పని తీరుపై జనాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ బారిన పడుతున్నప్పుడు.. వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అయితే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యాక్సిన్ అనేది కోవిడ్ రాకుండా అడ్డుకోదు. వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు దానితో పోరాడటంతో పాటు.. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపర్చడం.. వైరస్ ఇతర కణాలకు వ్యాపిచకుండా నిరోధిస్తుంది.
మరీ ముఖ్యంగా ప్రాణాంతక పరిస్థితి నుంచి కాపాడుతుంది. ఇక వ్యాక్సిన్ రెండు డోసులు సమర్థవంతంగా పని చేయడానికి 45 రోజుల సమయం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఈ లోపు వైరస్ బారిన పడితే.. త్వరగానే కోలుకుంటారు తప్ప ప్రాణాలు పోయే పరిస్థితులు రావంటున్నారు నిపుణులు.
ఇక మన దగ్గర వాడుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న తర్వాత పాజిటివ్ రేటు ఎలా ఉంది అంటే..
కోవిషీల్డ్..
ఇప్పటి వరకు మన దగ్గర 10,03,02,745 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకోగా.. వీరిలో కేవలం 17,145(0.02శాతం) మంది మత్రామే టీకా ఫస్ట్ డోస్ తర్వాత కరోనా బారిన పడ్డారు.
ఇక కోవిషీల్డ్ సెకండ్ డోస్ తీసుకున్న వారు 1,57,32,754 కాగా.. వీరిలో 5,014(0.03 శాతం) మంది మాత్రమే రెండో డోసు తర్వాత వైరస్ బారిన పడ్డారు.
కోవాగ్జిన్..
ఇప్పటి వరకు మన దగ్గర 93,56,436 మంది కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకోగా.. వీరిలో కేవలం 4,208(0.04శాతం) మంది మత్రామే టీకా ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా బారిన పడ్డారు.
ఇక కోవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకున్న వారు 17,37,178 కాగా.. వీరిలో 695(0.04శాతం)మంది మాత్రమే రెండో డోసు తర్వాత వైరస్ బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment