న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను ప్రతిబింబిస్తూ క్యాపిటల్ మార్కెట్లలో పారి్టసిపేటరీ నోట్ల(పీనోట్స్) ద్వారా పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. 2023 మే చివరికల్లా రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గత ఐదేళ్లలోనే అత్యధికంకాగా.. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పెట్టుబడులు విస్తరించాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం వరుసగా మూడో నెలలోనూ పీనోట్ పెట్టుబడులు పుంజుకున్నాయి.
వీటిని దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా విదేశీ ఇన్వెస్టర్లకు జారీ చేస్తుంటారు. అయితే ఇందుకు తగిన అంశాలను పరిశీలించాక మాత్రమే పీనోట్లను జారీ చేస్తారు. సెబీ వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ చివరికల్లా పీనోట్ పెట్టుబడుల విలువ రూ. 95,911 కోట్లుగా నమోదుకాగా.. మే నెలకల్లా రూ. 1,04,585 కోట్లను తాకాయి. అంతక్రితం మార్చికల్లా ఇవి రూ. 88,600 కోట్లుకాగా.. ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లు, జనవరి చివరికల్లా రూ. 91,469 కోట్లుగా నమోదయ్యాయి. 2018 మార్చి తదుపరి ఈ మే నెలలో పీనోట్ పెట్టుబడులు భారీగా లభించాయి. దేశ ఆర్థిక పటిష్టతకుతోడు.. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం ఎఫ్‌పీఐ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు విశ్లేషకులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment