Participatory notes
-
పీనోట్ పెట్టుబడుల నేలచూపు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టీసిపేటరీ నోట్ల(పీనోట్లు) పెట్టుబడులు గత నెల(అక్టోబర్)లో క్షీణించాయి. వరుసగా ఏడు నెలల పెరుగుదల తదుపరి వెనకడుగు వేసి రూ. 1.26 లక్షల కోట్లకు చేరాయి. తాజా గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీ నోట్ పెట్టుబడుల విలువ తగ్గింది. 2023 సెపె్టంబర్ చివరికల్లా రూ. 1,33,284 కోట్లుగా నమోదైన వీటి విలువ నవంబర్‌కల్లా రూ. 1,26,320 కోట్లకు పరిమితమైంది. సెబీ వద్ద రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేసే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు వీలుగా రిజిస్టర్‌కాని అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎఫ్‌పీఐలు పీనోట్లను జారీ చేస్తారు. అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాకే జారీకి తెరతీస్తారు. కాగా.. పీనోట్ పెట్టుబడుల విలువ 2017 జులైలో రూ. 1.35 లక్షల కోట్లను తాకిన తదుపరి తిరిగి ఈ ఏడాది సెపె్టంబర్‌లోనే రూ. 1.33 లక్షల కోట్లకు చేరడం గమనార్హం! -
ఆరేళ్ల గరిష్టానికి పీ–నోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ క్యాపిటల్ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్లు) రూపంలో పెట్టుబడులు ఆరేళ్ల గరిష్టానికి చేరాయి. సెపె్టంబర్ చివరికి ఇవి రూ.1.33 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా ఏడో నెలలోనూ వృద్ధి చెందాయి. 2017 జూలై తర్వాత పీనోట్ పెట్టుబడులు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. నాడు ఇవి రూ.1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెబీ గణాంకాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. సెబీ వద్ద నమోదు చేసుకోకపోయినా, పీ నోట్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల భారత క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీ–నోట్లను సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) జారీ చేస్తారు. పీ–నోట్ల ద్వారా ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో చేసిన పెట్టుబడులు సెప్టెంబర్ ఆఖరుకి రూ.1,33,284 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.1.22 లక్షల కోట్లు ఈక్విటీల్లో ఉండగా, డెట్‌లో రూ.10,688 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో రూ.389 కోట్ల చొప్పున ఉన్నాయి. జూలై చివరికి ఇవి రూ.1.23 లక్షల కోట్లు, జూన్ చివరికి రూ.1.13 లక్షల కోట్లు, మే చివరికి రూ.1.04 లక్షల కోట్లు, ఏప్రిల్ చివరికి రూ.95,911 కోట్ల చొప్పున ఉన్నాయి. పీ నోట్ పెట్టుబడులు సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల సరళినే అనుసరిస్తుంటాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుండడం పీ–నోట్ పెట్టుబడుల్లో వృద్ధికి దారితీస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా సెబీ వద్ద నమోదు చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉండడం కూడా సానుకూలిస్తున్నట్టు చెబుతున్నారు. రానున్న సంవత్సరాల్లోనూ పీనోట్ పెట్టుబడుల రాక కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేస్తున్నారు. -
ఐదేళ్ల గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీనోట్లు) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు జూన్ చివరికి రూ.1,11,291 కోట్లకు చేరాయి. దేశ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో (క్యాపిటల్ మార్కెట్లు) కలిపి ఈ మేరకు పెట్టుబడులు ఉన్నాయి. ఐదున్నరేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మే చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ.1,04,585 కోట్లుగా ఉంది. స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీనోట్ల పెట్టుబడుల విలువ పెరగడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు సెబీ గణాంకాలు స్పస్టం చేస్తున్నాయి. సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్లను జారీ చేస్తుంటారు. సెబీ వద్ద నమోదు చేసుకోకుండా పీ నోట్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.పీ నోట్ జారీ చేసే ఎఫ్‌పీఐలు ఇందుకు సంబంధించి సెబీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రి ల్ చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ. 95, 911 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి రూ. 88,600 కోట్లు, ఫిబ్రవరి చివరికి రూ.88,398 కో ట్లు, జనవరి చివరికి రూ.91,469 కోట్ల చొప్పున ఉంది. బలమైన పనితీరు వల్లే.. సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల ధోరణికి అనుగుణంగానే పీనోట్ల పెట్టుబడులు కూడా ఉంటుంటాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్న సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపిస్తుండడం పీ నోట్ పెట్టుబడుల వృద్ధికి దోహదపడినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ చివరికి ఉన్న రూ.1.11 లక్షల కోట్లలో ఈక్విటీల్లోనే రూ.1,00,701 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెట్‌లో రూ.12,382 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు రూ.203 కోట్లుగా ఉన్నాయి. జూన్ చివరికి ఎఫ్‌పీఐల నిర్వహణలోని పెట్టుబడులు రూ.55.63 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పది నెలల గరిష్ట స్థాయి అయిన రూ.47,184 కోట్లకు జూన్ నెలలో చేరాయి. అదే నెలలో డెట్‌మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.9,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
పీనోట్ పెట్టుబడులు హైజంప్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను ప్రతిబింబిస్తూ క్యాపిటల్ మార్కెట్లలో పారి్టసిపేటరీ నోట్ల(పీనోట్స్) ద్వారా పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. 2023 మే చివరికల్లా రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గత ఐదేళ్లలోనే అత్యధికంకాగా.. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పెట్టుబడులు విస్తరించాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం వరుసగా మూడో నెలలోనూ పీనోట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. వీటిని దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా విదేశీ ఇన్వెస్టర్లకు జారీ చేస్తుంటారు. అయితే ఇందుకు తగిన అంశాలను పరిశీలించాక మాత్రమే పీనోట్లను జారీ చేస్తారు. సెబీ వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ చివరికల్లా పీనోట్ పెట్టుబడుల విలువ రూ. 95,911 కోట్లుగా నమోదుకాగా.. మే నెలకల్లా రూ. 1,04,585 కోట్లను తాకాయి. అంతక్రితం మార్చికల్లా ఇవి రూ. 88,600 కోట్లుకాగా.. ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లు, జనవరి చివరికల్లా రూ. 91,469 కోట్లుగా నమోదయ్యాయి. 2018 మార్చి తదుపరి ఈ మే నెలలో పీనోట్ పెట్టుబడులు భారీగా లభించాయి. దేశ ఆర్థిక పటిష్టతకుతోడు.. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం ఎఫ్‌పీఐ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు విశ్లేషకులు తెలియజేశారు. -
పీనోట్ల పెట్టుబడుల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టిసిపేటరీ(పీ) నోట్ల పెట్టుబడులు గత నెల(ఏప్రిల్)లో రూ. 95,911 కోట్లను తాకాయి. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. గత రెండు నెలలుగా పీనోట్ల పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇంతక్రితం 2022 నవంబర్‌లో పీనోట్ పెట్టుబడులు రూ. 96,292 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం తాజా పెట్టుబడులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(పీఎఫ్‌ఐలు) వీటిని జారీ చేస్తుంటారు. ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే విదేశీ ఇన్వెస్టర్లకు వీటిని ఎఫ్‌పీఐలు జారీ చేసే సంగతి తెలిసిందే. అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాక మాత్రమే వీటిని జారీ చేస్తారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దేశీయంగా ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీనోట్ పెట్టుబడుల విలువ ఏప్రిల్ చివరికల్లా రూ. 95,911 కోట్లను తాకింది. మార్చి నెలాఖరుకు ఈ విలువ రూ. 88,600 కోట్లుగా నమోదైంది. ఇక ఫిబ్రవరికల్లా ఇవి రూ. 88,398 కోట్లుకాగా.. జనవరి చివరిలో రూ. 91,469 కోట్లకు చేరాయి. వెరసి మార్చిలో స్వల్పంగా పుంజుకోగా.. ఏప్రిల్‌లో భారీ వృద్ధి నమోదైంది. తాజాగా నమోదైన పెట్టుబడుల్లో రూ. 86,226 కోట్లు ఈక్విటీలలోకి ప్రవేశించాయి. ఈ బాటలో రూ. 9,586 కోట్లను రుణ పత్రాలలో ఇన్వెస్ట్ చేయగా, మరో రూ. 100 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల కొనుగోలుకి విదేశీ ఇన్వెస్టర్లు వెచ్చించారు. -
జూన్‌లో తగ్గిన పీ–నోట్స్ పెట్టుబడులు, కారణం ఏంటంటే!
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి (ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీస్ మొదలైనవి) పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్స్) ద్వారా పెట్టుబడులు జూన్ నాటికి రూ. 80,092 కోట్లకు తగ్గాయి. గడిచిన 20 నెలల్లో ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో ఈ పెట్టుబడులు రూ. 86,706 కోట్లుగా నమోదయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పీ–నోట్స్ పెట్టుబడుల్లో కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు పీ–నోట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిని భారత్‌లో రిజిస్టర్ అయిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) జారీ చేస్తాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం జూన్ నాటికి పీ–నోట్స్ పెట్టుబడులు రూ. 80,092 కోట్లుగా ఉండగా .. వీటిలో రూ. 70,644 కోట్లు ఈక్విటీల్లోనూ, రూ. 9,355 కోట్లు డెట్ సాధనాల్లోనూ, రూ. 92 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీస్‌లోనూ ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ తగ్గుదల అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఇన్వెస్ట్మెంట్ సలహా సేవల సంస్థ రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకురాలు సోనమ్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికాలో ఫెడ్ రేట్ల పెంపు వల్ల.. సురక్షిత సాధనాల్లోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించుకునేందుకు త్వరపడటమే జూన్‌లో పీ–నోట్స్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడానికి ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. మార్కెట్ కోలుకుంటూ ఉండటంతో జూన్‌తో పోలిస్తే జులై మెరుగ్గానే ఉండవచ్చని చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు ఉండొచ్చని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. -
పీనోట్ల పెట్టుబడులు డీలా..
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు మే నెలలో వెనకడుగు వేశాయి. రూ. 86,706 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు నెల అంటే 2022 ఏప్రిల్‌లో ఇవి రూ. 90,580 కోట్లుగా నమోదయ్యాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు, హైబ్రిడ్ సెక్యూరిటీల నుంచి గత నెలలో దాదాపు రూ. 4,000 కోట్ల పీనోట్ పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. వీటి ద్వారా విభిన్న విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిజిస్ట్రేషన్ లేకుండానే దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అయితే రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట వీడి దేశీ స్టాక్స్‌లో తిరిగి పెట్టుబడులు చేపట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈక్విటీలకే అధికం ఈ ఏడాది(2022) మార్చికల్లా పీనోట్ పెట్టుబడులు రూ. 87,979 కోట్లకు చేరగా.. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లు, జనవరిలో రూ. 87,989 కోట్లను తాకాయి. గత నెల పెట్టుబడుల్లో రూ. 77,402 కోట్లు ఈక్విటీలలో, రూ. 9,209 కోట్లు రుణ సెక్యూరిటీలలో, మరో రూ. 101 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీలలోనూ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్ పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా రూ. 81,571 కోట్లుకాగా.. రూ. 8,889 కోట్లు రుణ సెక్యూరిటీలకు మళ్లాయి. పదేళ్ల కాలపు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో ఇటీవల ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు గ్రీన్ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్ శర్మ పేర్కొన్నారు. పీనోట్ ఇన్వెస్ట్మెంట్స్ నీరసించిన నేపథ్యంలో ఎఫ్‌పీఐల కస్టడీలో ఉన్న ఆస్తుల(పెట్టుబడులు) విలువ సైతం మే నెలలో 5 శాతం క్షీణించి రూ. 48.23 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్ చివరికల్లా ఈ విలువ రూ. 50.74 లక్షల కోట్లను తాకింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ. 40,000 కోట్లు, రుణ మార్కెట్ల నుంచి రూ. 5,505 కోట్ల పెట్టుబడులు వాపస్ తీసుకోవడం గమనార్హం! -
పీనోట్ల పెట్టుబడులు డీలా
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు మే నెలలో వెనకడుగు వేశాయి. రూ. 86,706 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు నెల అంటే 2022 ఏప్రిల్‌లో ఇవి రూ. 90,580 కోట్లుగా నమోదయ్యాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు, హైబ్రిడ్ సెక్యూరిటీల నుంచి గత నెలలో దాదాపు రూ. 4,000 కోట్ల పీనోట్ పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. వీటిద్వారా విభిన్న విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిజిస్ట్రేషన్ లేకుండానే దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అయితే రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట వీడి దేశీ స్టాక్స్‌లో తిరిగి పెట్టుబడులు చేపట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈక్విటీలకే అధికం ఈ ఏడాది(2022) మార్చికల్లా పీనోట్ పెట్టుబడులు రూ. 87,979 కోట్లకు చేరగా.. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లు, జనవరిలో రూ. 87,989 కోట్లను తాకాయి. గత నెల పెట్టుబడుల్లో రూ. 77,402 కోట్లు ఈక్విటీలలో, రూ. 9,209 కోట్లు రుణ సెక్యూరిటీలలో, మరో రూ. 101 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల లోనూ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్ పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా రూ. 81,571 కోట్లు కాగా.. రూ. 8,889 కోట్లు రుణ సెక్యూరిటీలకు మళ్లాయి. పదేళ్లకాలపు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో ఇటీవల ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు గ్రీన్ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్ శర్మ పేర్కొన్నారు. పీనోట్ ఇన్వెస్ట్మెంట్స్ నీరసించిన నేపథ్యంలో ఎఫ్‌పీఐల కస్టడీలో ఉన్న ఆస్తుల(పెట్టుబడులు) విలువ సైతం మే నెలలో 5 శాతం క్షీణించి రూ. 48.23 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్ చివరికల్లా ఈ విలువ రూ. 50.74 లక్షల కోట్లను తాకింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ. 40వేల కోట్లు, రుణ మార్కెట్ల నుంచి రూ. 5,505 కోట్ల పెట్టుబడులు వాపస్ తీసుకోవడం గమనార్హం! -
పీనోట్లపై తక్షణ నిషేధ యోచనేదీ లేదు: కేంద్రం
న్యూఢిల్లీ : పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్)పై రాత్రికి రాత్రి నిషేధం విధించే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. పీనోట్స్ నిబంధనలను మరింతగా మెరుగుపర్చడం ఎలాగన్నది ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ముందు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (ఎఫ్ఐఐ) కూడా సంప్రదిస్తామని పేర్కొన్నారు. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే దిశగా పీ-నోట్స్ నిబంధనలను సమీక్షించాలంటూ సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సెబీకి సూచించిన దరిమిలా శక్తికాంత దాస్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ ఇన్వెస్టర్లు పీ-నోట్స్ మార్గంలో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టరయిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సంస్థలు వీటిని జారీ చేస్తుంటాయి. మేలో రూ. 2.85 లక్షల కోట్ల మేర పీ-నోట్స్ పెట్టుబడులు వచ్చాయి. ఇది ఏడేళ్ల గరిష్టం. అయితే, సిసలైన ఇన్వెస్టరు వివరాలు వెల్లడికాకుండా ఈ మార్గంలో వచ్చే నిధుల్లో బ్లాక్‌మనీ ఉండొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో పీ-నోట్స్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.