న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టీసిపేటరీ నోట్ల(పీనోట్లు) పెట్టుబడులు గత నెల(అక్టోబర్)లో క్షీణించాయి. వరుసగా ఏడు నెలల పెరుగుదల తదుపరి వెనకడుగు వేసి రూ. 1.26 లక్షల కోట్లకు చేరాయి. తాజా గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీ నోట్ పెట్టుబడుల విలువ తగ్గింది. 2023 సెపె్టంబర్ చివరికల్లా రూ. 1,33,284 కోట్లుగా నమోదైన వీటి విలువ నవంబర్‌కల్లా రూ. 1,26,320 కోట్లకు పరిమితమైంది.
సెబీ వద్ద రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేసే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు వీలుగా రిజిస్టర్‌కాని అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎఫ్‌పీఐలు పీనోట్లను జారీ చేస్తారు. అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాకే జారీకి తెరతీస్తారు. కాగా.. పీనోట్ పెట్టుబడుల విలువ 2017 జులైలో రూ. 1.35 లక్షల కోట్లను తాకిన తదుపరి తిరిగి ఈ ఏడాది సెపె్టంబర్‌లోనే రూ. 1.33 లక్షల కోట్లకు చేరడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment