- పరిపాలనా మంజూరు ఇచ్చిన ప్రభుత్వం
గిరిజన భవనానికి రూ.1.10 కోట్లు
Published Wed, Jul 27 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
కరీంనగర్ సిటీ : జిల్లా కేంద్రంలో రూ.కోటి 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా మంజూరు ఇచ్చింది. ఈ మేరకు జీఓ నెం.1560/2016, తేదీ 05–07–2016 ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గిరిజన భవన నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గిరిజన భవన నిర్మాణ ం చేపట్టేందుకు నగర శివారులోని ఉజ్వలపార్కు సమీపంలో కొన్ని సంవత్సరాల క్రితం 18 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. గతంలో పలుమార్లు భవన నిర్మాణానికి నిధులు విడుదల అయినా, ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో అవి నిలిచిపోయాయి. అప్పటినుంచి గిరిజన సంఘాలు భవన నిర్మాణానికి డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి 10 లక్షలతో భవనాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేసింది. తాజాగా పరిపాలనా మంజూరు ఇవ్వడంతో గతంలో ప్రతిపాదించిన ఉజ్వల పార్క్ సమీపంలోని స్థలంలో భవన నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
జిల్లా కేంద్రంలో గిరిజన భవన నిర్మాణానికి పరిపాలన మంజూరు ఇచ్చిన సందర్భంగా టీఆర్‌ఎస్ ఎస్‌టీ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు అజ్మీరాచందులాల్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ల చిత్రపటాలను పాలతో అభిషేకించారు. ఆరు దశాబ్దాల గిరిజనుల డిమాండ్ అయిన గిరిజన భవన్‌ను గత పాలకులు విస్మరిస్తే, కేసీఆర్ నెరవేర్చారని ఈ సందర్భంగా గిరిజన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎస్‌టీసెల్ రాష్ట్ర కార్యదర్శి బి.తిరుపతినాయక్, నాయకులు పూల్‌సింగ్, సోమనాయక్, భాస్కర్‌నాయక్, రవి, రాజ్‌కుమార్, నర్సింహానాయక్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement