గే పెళ్లిళ్లకు తైవాన్ గ్రీన్ సిగ్నల్ | Taiwan may become 1st Asian country to allow same-sex marriages | Sakshi
Sakshi News home page

గే పెళ్లిళ్లకు తైవాన్ గ్రీన్ సిగ్నల్

Published Tue, Nov 22 2016 1:08 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

గే పెళ్లిళ్లకు తైవాన్ గ్రీన్ సిగ్నల్

గే పెళ్లిళ్లకు తైవాన్ గ్రీన్ సిగ్నల్

తైపీ: ప్రపంచంలో గే (స్వలింగ) పెళ్లిళ్లు నానాటికి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తైవాన్ ప్రజలు కూడా ఇప్పుడు అటువైపే అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని తైపీ, కవోసియుంగ్ నగరాల్లో ఇప్పటికే అక్కడక్కడ గే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఇంకా వాటికి అధికారికంగా గుర్తింపు రావాల్సి ఉంది. గే పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును ఇంకా ఆమోదించాల్సి ఉంది.

వచ్చే జనవరిలో పార్లమెంట్‌లో ఈ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 113 మంది సభ్యుల్లో 57 మంది సభ్యులు ఆమోదిస్తే సరిపోతుంది. పాలకపక్ష డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ, ఇతర పార్టీలు మద్దతిస్తున్నందున బిల్లు ఆమోదంపొందే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. బిల్లు చట్లరూపం దాలిస్తే ఆసియాలో గే పెళ్లిళ్లను ఆమోదించిన తొలి దేశం తైవాన్ అవుతుంది.

వాస్తవానికి గే మ్యారేజెస్‌ను అనుమతిచ్చే బిల్లును దేశ పార్లమెంట్‌లో 2005లోనే ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అది పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. 2013లో దానికి మళ్లీ కదలిక రావడంతో పార్లమెంట్ కమిటీ దాన్ని సమీక్షించింది. మళ్లీ అది పెండింగ్‌లో పడిపోయింది. గత మే నెలలో దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన త్సాయ్ ఇంగ్ వెన్, గే పెళ్లిళ్ల చట్టానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మళ్లీ బిల్లుకు కదలిక వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement