తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు | Railways To Start More Special Trains Soon | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల మధ్య మరో నాలుగు ప్రత్యేక రైళ్లు

Oct 7 2020 7:26 PM | Updated on Oct 7 2020 7:53 PM

Railways To Start More Special Trains Soon - Sakshi

తెలుగు రాష్ట్రాల మధ్య మరో నాలుగు ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వేల నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి - కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ ట్రైన్స్‌కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. వీటితో పాటు.. సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. చదవండి : ఏపీ: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..

ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకుల రైళ్లు నిలిచిపోయాయి. ఆపై అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వే శాఖ ఈనెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, మరో 39 రైళ్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎప్పటినుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement