ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా | teachers transfers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా

Published Sat, Jun 3 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా

ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా

  • బదిలీ మార్గదర్శకాలు విడుదల
  • వెబ్‌ కౌన్సెలింగ్, పాయింట్ల కేటాయింపుపై అసంతృప్తి
  • ఆందోళనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు
  • రాయవరం (మండపేట): 
    వేసవి సెలవుల్లో మిన్నకుండిన విద్యాశాఖ మరో పది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయ బదిలీలుంటాయా? ఉండవా? అనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో విడుదలైన బదిలీ ఉత్తర్వులు అందరినీ అయోమయంలో పడేశాయి. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తూ వస్తున్న వెబ్‌ కౌన్సెలింగ్, 
    ప్రతిభ ఆధారిత పాయింట్ల విధానాన్ని అమలు చేయడంపై ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
    వెబ్‌ కౌన్సిలింగ్‌కే విద్యాశాఖ మొగ్గు..
    ఉపా«ధ్యాయుల బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా విద్యాశాఖ వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్నే అమలు చేస్తోంది. ఆ¯ŒSలై¯ŒS ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. అయితే ఇది ఎంత వరకు అమలవుతుందన్నది వేచి చూడాల్సిందే. ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్లు నిండితే తప్పనిసరిగా బదిలీ కావాలి. ఇతర ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు ఒకే పాఠశాలలో పనిచేసి ఉంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. రెండేళ్లు సర్వీసు నిండిన వారంతా బదిలీకి అర్హులు. ప్రతిభ ఆధారిత పాయింట్లు కూడా అమలులో ఉంటాయి. బదిలీల విషయంలో సర్వీస్‌ కటాఫ్‌ తేదీని ఈ ఏడాది ఏప్రిల్‌ 30 పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల ఎక్కువ మంది బదిలీ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 
    ప్రాధాన్య పాయింట్లు కేటాయింపు ఇలా..
    ఉపాధ్యాయుల బదిలీల్లో కొన్ని కేటగిరీలకు ప్రాధాన్య మార్కులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన యూనియన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఐదు పాయింట్లు లభిస్తాయి. అవివాహిత మహిళలకు గతంలో 10 పాయింట్లు కేటాయించగా వాటిని ఐదుకు కుదించారు. స్పౌజ్‌ కేటగిరీ (భార్యాభర్తలు ఉద్యోగులైతే)లో పాయింట్లను 10 నుంచి నాలుగుకు తగ్గించారు. రేషనలైజేష¯ŒS కింద పోస్టు కోల్పోయిన ఉపాధ్యాయులకు ఒక పాయింట్‌ అదనంగా లభిస్తుంది. 4వ కేటగిరీ పరిధిలోని గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. కేటగిరి–3కి ఒక పాయింట్, కేటగిరి–2కు అర్ధ పాయింట్‌ కేటాయిస్తారు. కేటగిరి–1కు ఒక్క పాయింట్‌ లభించదు. గరిష్ఠంగా 8ఏళ్ల సర్వీస్‌కు పాయింట్లు కేటాయిస్తారు. అంతకన్నా ఎక్కువ ఉన్నా పరిగణలోనికి తీసుకోరు. టీచర్‌ మొత్తం సర్వీస్‌కు ఏడాదికి 0.4 పాయింట్లు చొప్పున గరిష్ఠంగా 12 పాయింట్లు కేటాయిస్తారు. దీంతో 30 ఏళ్ల సర్వీస్‌ పూర్తయిన వారు అన్యాయానికి గురవుతారు. ఎ¯ŒSసీసీ/స్కౌట్‌ ఉన్న స్కూల్‌ హెచ్‌ఎం, టీచర్‌కు రెండు పాయింట్లు ఇస్తారు. పాఠశాల ఎ¯ŒSరోల్‌మెంట్‌ను రెండేళ్లలో బాగా పెంచిన వారికి ఆరు పాయింట్లు లభిస్తాయి. ఇది ప్రధానోపాధ్యాయులతోపాటు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు వర్తిస్తుంది. పాఠశాలలో చదివిన పిల్లలు ఎక్కడా బడి మానివేయకుండా వంద శాతంపై తరగతులకు వెళ్లి ఉంటే ఐదు పాయింట్లు లభిస్తాయి. 50–80 శాతం విద్యార్థులకు బీ–2, ఆపైన గ్రేడ్‌ వస్తే 4 మార్కులు, 25–50 శాతం విద్యార్థులకు బీ–2, ఆపై గ్రేడ్‌ వస్తే 2 పాయింట్లు కేటాయిస్తారు. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 90 శాతం రోజుల్లో గడువులోగా ఆ¯ŒSలై¯ŒSలో ఇండెంట్‌ వివరాలు పంపితే 2 పాయింట్లు, 80–89.99 శాతం రోజుల్లో పంపిస్తే ఒక పాయింట్‌ కేటాయిస్తారు.  10వ తరగతికి సంబంధించి ఉత్తీర్ణత శాతం 95 నుంచి 100 శాతం వరకు ఉంటే గరిష్ఠంగా ఆరు పాయింట్లు లభిస్తాయి. ఇది ప్రధానోపాధ్యాయుడికి మాత్రమే వర్తిస్తుంది.
    వ్యక్తిగత ప్రతిభ ఆధారిత పాయింట్లు..
    ‘జాతీయ అవార్డుకు 6, రాష్ట్ర అవార్డుకు 5 పాయింట్లు ఇస్తారు. తరగతిలో 80 శాతం మంది విద్యార్థులు బీ–2, ఆపై గ్రేడ్‌ సాధించి ఉంటే ఆయా సబ్జెక్టు టీచర్‌కు 6 పాయింట్లు, 50–80 శాతం మంది బీ–2, ఆపై గ్రేడ్‌ సాధించి ఉంటే 4 పాయింట్లు, 25–50 శాతం మంది బీ–2, ఆపై గ్రేడ్‌ సాధిస్తే 2 పాయింట్లు కేటాయిస్తారు. వికలాంగులు, వితంతువులు, చట్టబద్దంగా విడాకులు తీసుకున్న మహిళా టీచర్లు, కేన్సర్‌ బాధితులు, గుండె శస్త్ర చికిత్స బాధితులు, న్యూరో సర్జరీ, బో¯ŒS టీబీ, కిడ్నీ మార్పు, ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మానసిక వికలాంగులుంటే, పిల్లలకు గుండెల్లో రంధ్రాలుంటే, తలసేమియా, హీమోఫీలియోతో బాధపడే పిల్లలుంటే, స్పౌజ్‌ ఆర్మీలో పనిచేస్తుంటే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. 
    అభ్యంతరాలివీ..
    విద్యార్థుల ప్రవేశాలు 10–20 శాతం పెరిగితే ఆరు పాయింట్లు కేటాయించడం అన్యాయమని వాపోతున్నారు. స్పౌజ్‌కు గతంలో 10 పాయింట్లు కేటాయిస్తే ఈ సారి 4 పాయింట్లు,  రేషనలైజేష¯ŒS ద్వారా ఎఫెక్ట్‌ అయ్యే టీచర్‌కు గతేడాది 10 పాయింట్లు కేటాయిస్తే ఇప్పుడు ఒక పాయింట్‌ కేటాయించడం పట్ల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement