
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యారోగ్య రంగంలో మానవవనరుల కొరతను తగ్గించేందుకు వివిధ పథకాలకు రూ.14,930 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు అన్‌రిజర్వ్‌డ్ ప్రాంతాల్లో 24 వైద్య కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 2020–21 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 18,058 యూజీ, పీజీ సీట్లను పెంచనున్నట్లు కేంద్రం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. దాదాపు 248 నర్సింగ్ కళాశాలల్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. త్వరలో ఏర్పాటు చేయనున్న 24 మెడికల్ కాలేజీలను ప్రస్తుతమున్న జిల్లా, రెఫరల్ ఆస్పత్రులకు అనుసంధానిస్తామని పేర్కొంది. 3 నుంచి 5 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయంది.
Comments
Please login to add a commentAdd a comment