Updates..
► ప్రకాశం బ్యారేజ్‌కు వరద పెరుగుతోంది. మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 71వేల క్యూసెక్యులుగా ఉంది. 40 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
► ధవళేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద 12.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
► శ్రీకాకుళం జిల్లా తామాడలో అత్యధికంగా 21.8 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
👉: ఏపీలో భారీ వర్షాలు.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం.
► పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్.
► అల్లూరి, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
► కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్.
► ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్టీఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖ జిల్లాలో వర్షం కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment