Dhavalesvaram barrage
-
ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Updates.. ► ప్రకాశం బ్యారేజ్‌కు వరద పెరుగుతోంది. మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 71వేల క్యూసెక్యులుగా ఉంది. 40 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ► ధవళేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద 12.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► శ్రీకాకుళం జిల్లా తామాడలో అత్యధికంగా 21.8 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 👉: ఏపీలో భారీ వర్షాలు.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం. ► పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. ► అల్లూరి, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ► కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్. ► ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్టీఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖ జిల్లాలో వర్షం కురుస్తోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
-
ముప్పు తప్పింది.. ముంపు మిగిలింది
సాక్షి, అమరావతి/అమలాపురం/కొవ్వూరు: గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఉభయ గోదావరి జిల్లాలకు ముప్పు తప్పింది. ఏజెన్సీ, లంక గ్రామాల్లో ముంపు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఆదివారం ఉదయం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద 15,61,763 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం 6 గంటలకు 9,21,396 క్యూసెక్కులకు తగ్గింది. తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 11.60 అడుగులకు దిగి రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికనూ ఎత్తివేశారు. సాయంత్రం 6 గంటలకు ఆనకట్ట వద్ద నీటిమట్టం 11 అడుగులుగా నమోదైంది. 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన వరద 54 గంటలపాటు కొనసాగింది. ఈనెల 7న ఉదయం 11 గంటలకు జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను నాలుగు రోజుల అనంతరం ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద సహజ ప్రవాహానికి కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడం వల్ల నీటిమట్టం తగ్గడం లేదు. గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లి కాజ్వే వద్ద శుక్రవారం గల్లంతైన షేక్ సమీర్‌బాషా (23), షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) మృతదేహాలను ఆదివారం ఉదయం వెలికితీశారు. ఇదిలావుంటే.. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలోని గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. కోనసీమలోని పి.గన్నవరం మండలంలో ఆరు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు ఇంకా పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. కె.ఏనుగుపల్లి రహదారిపై రెండడుగుల వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికుదురు మండల పరిధిలోని మూడు గ్రామాలకు ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పునరుద్ధరణ కాలేదు. అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే వద్ద పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. పశ్చిమ పోలవరం మండలంలోని ముంపు గ్రామాలు, ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో వరద కొంతమేర తగ్గుముఖం పట్టింది. -
'తూర్పు' దారిలో నేత్తుటేరులు
‘తూర్పు’న ఈ సంవత్సరం రక్తచరిత్రను లిఖించింది. అత్యంత ఘోరంగా జరిగిన ప్రమాదాలు, వివిధ సంఘటనలు జిల్లావాసులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది.. ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి తూఫాన్ వ్యాన్ బోల్తా పడి 22 మంది.. గండేపల్లివద్ద లారీ బోల్తా పడి 16 మంది మృత్యువాత పడిన సంఘటనలు రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఇంకా హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు.. దోపిడీలు, దొంగతనాలు, చైన్స్నాచింగ్లవంటి ఘటనలతో జిల్లావాసులు బెంబేలెత్తారు. - కాకినాడ క్రైం/రాజమండ్రి క్రైం రహదారులు రక్తసిక్తం ఫిబ్రవరి 1 : రాజమండ్రి మోరంపూడి సెంటర్లో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. వేమగిరివైపు వెళ్తున్న స్కూల్ బస్సు.. బ్రేక్‌లు ఫెయిలవడంతో అదుపుతప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనుపకోళ్ళ దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురానికి చెందిన ర్యాలి వెంకన్న (55), కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) దుర్మరణం పాలయ్యారు. జూన్ 4 : రంపచోడవరం సమీపంలో పెళ్లిబృందం వ్యాన్ బోల్తా పడి తొమ్మిది మంది మృతి చెందారు. జూన్ 13 : ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి దిగువన ఉన్న స్కవర్ స్లూయిజ్లోకి తూఫాన్ వ్యాన్ అర్ధరాత్రి బోల్తా పడిన దుర్ఘటనలో.. అందులో ప్రయాణిస్తున్న 22 మంది నిద్రలోనే మృత్యువాత పడ్డారు. మృతులందరూ విశాఖ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. సెప్టెంబర్ 14 : గండేపల్లివద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి 16 మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 18 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ఏడాది జిల్లా పోలీసుల పరిధిలో 556 రోడ్డు ప్రమాదాలు జరగగా, వాటిలో 592 మంది మృతి చెందారు. 1163 మంది గాయపడ్డారు. రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా పరిధిలో 483 ప్రమాదాలు జరగగా, 163 మంది మృతి చెందారు. 492 మంది గాయపడ్డారు. వణికించిన హత్యలు జిల్లాలో గత ఏడాది నమ్మకద్రోహం కేసులు 96 నమోదైతే, ఈ సంవత్సరం ఆ సంఖ్య 102కు చేరుకుంది. మహిళలపై లైంగిక దాడులు గత ఏడాదికంటే ఈసారి 13 పెరిగాయి. జనవరి 23 : పిల్లలు పుట్టలేదన్న కోపంతో రామచంద్రపురంలో భార్య వెంకటలక్ష్మి మెడకు తాడు బిగించి భర్త పడగ అంజి హత్య చేశాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రించేందుకు ప్రయత్నించాడు. ఫిబ్రవరి 5 : రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు కోకా భాస్కరరావు వీధిలో గంటా నరసింహమూర్తి, గంటా సంతోషి(24)లకు 2, 3 ఏళ్ల పిల్లలు ఇద్దరున్నారు. తన పిన్ని కొడుకుతో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో సంతోషిని నరసింహమూర్తి రాడ్డుతో కొట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఫిబ్రవరి 7 : మండపేటకు చెందిన దుర్గాదేవి(35)కి కపిలేశ్వరపురం మండలం కాలేరుకు చెందిన మేనమామ బూరుల వీరబాబుతో పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల క్రితం దుర్గాదేవి మండపేటకు చెందిన తాపీమేస్త్రి గణేష్‌తో వెళ్లిపోయింది. కాకినాడలోని ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. వారిమధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ నేపథ్యంలో దుర్గాదేవిని గణేష్ గొంతు నులిమి హత్య చేశాడు. ఫిబ్రవరి 20 : సఖినేటిపల్లి చర్చిపేటలో ఉంటున్న చింతపల్లి మంగాదేవి(28)ని భర్త సత్యనారాయణ గొంతు నులిమి చంపాడు. ఖత్తర్‌లో ఉండగా 2010లో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీనికి సత్యనారాయణ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తిరిగి ఖత్తర్ వెళ్లిపోయాడు. మూడు నెలల తరువాత ఖత్తర్ నుంచి వచ్చిన సత్యనారాయణ భార్యతో ఘర్షణకు దిగాడు. బంధువులపై పెట్టిన కేసు ఉపసంహరించుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను సత్యనారాయణ హత్య చేశాడు. మార్చి 2 : కొత్తపేట మండలంలో అంతటి శిరీష(25)ను ఆమె భర్త గెడ్డం జగదీష్ చీరకొంగుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని స్నేహితుల సహాయంతో ఆటోలో తీసుకువెళ్లి, పాశర్లపూడి డ్రైనేజీ గట్టున పాతిపెట్టాడు. మార్చి 13 : రాయవరం మండలం చెల్లూరు కొత్తపేట కాలనీకి చెందిన గుత్తుల సూర్యారావుకు, కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వీర రాఘవమ్మ(44)తో 24 ఏళ్లక్రితం వివాహమైంది. ఆమెపై అనుమానంతో కర్రతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. మే 19 : రాజోలు మండలం వేగివారిపాలేనికి చెందిన బొక్కా మధుసూదనరావుకు, పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన దుర్గభవాని(26)తో వివాహమైంది. గల్ఫ్‌లో ఉంటున్న అతడు వివాహహానంతరం భార్యను అక్కడకు తీసుకువెళ్ళాడు. గర్భవతి కావడంతో తిరిగి ఇంటికి పంపించాడు. గొడవల నేపథ్యంలో అత్తవారిపై దుర్గాభవాని కేసు పెట్టింది. గల్ఫ్ నుంచి వచ్చిన మధుసూదనరావు అత్తవారింటికి వెళ్లి భార్యను తనతో తీసుకువెళ్లాడు. ఆ రోజు రాత్రి తాటిపాకలో ఒక హోటల్లో గడిపారు. ఉదయం గదులు శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది దుర్గాభవాని మృతి చెంది ఉండడం గమనించారు. సెప్టెంబర్ 29 : గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన గుదే శ్రీనివాస్ తాపీపని చేసుకుని జీవిస్తాడు. భార్య ఝాన్సీ టైలరింగ్ చేస్తుంది. రాజమండ్రి తుమ్మలావలోని అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను కత్తెరతో పొడిచి హత్య చేశాడు. డిసెంబర్ 11 : యానాం దరియాలతిప్పవద్ద గౌతమీ గోదావరిలో కారు జలసమాధి అయి ఆరుగురు మృతి చెందారు. లక్షల రూపాయలు అప్పు చేసిన కొప్పాడ పవన్‌కుమార్.. వాటిని తీర్చే దారి కానరాక, ఒత్తిళ్లకు తాళలేక.. ఆత్మహత్యకు పథకం వేశాడు. తనతోపాటు కారులో కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్లి గోదావరిలో జలసమాధి అయ్యాడు. పేట్రేగిన చైన్‌స్నాచర్లు జిల్లాలో చైన్‌స్నాచర్లు పేట్రేగిపోయారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు, చెడు వ్యసనాలకు బానిసైన విద్యార్థులు, చదువు మధ్యలో ఆపేసినవారు వీటికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వారి మెడలోని బంగారు ఆభరణాలు దోచుకుపోతున్నారు. రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లాలో 120 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవగా.. మూడింటిలో మాత్రమే నిందితులను అరెస్టు చేయగలిగారు. కొందరు ఆటో డ్రైవర్లుగా అవతారమెత్తి, కిరాయికి ఎక్కిన మహిళలను నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి వారిపై దాడులకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న గంజాయి మత్తు గంజాయి కేసులు కూడా ఈ ఏడాది రికార్డు స్థాయిలోనే నమోదయ్యాయి. గత ఏడాది 27 కేసులలో 73 మందిని అరెస్టు చేసి రూ.82.59 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది 46 కేసులలో 115 మందిని అరెస్టు చేసి, రూ.1.61 కోట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహాపర్వం వేళ.. మాయని మచ్చ పావనవాహిని గోదావరి మహాపర్వం.. పుష్కరాల తొలి రోజైన జూలై 14న రాజమండ్రి పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాల చరిత్రలోనే ఈ సంఘటన మాయని మచ్చగా మిగిలింది. ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా పుష్కరాల రేవులో పుష్కర స్నానం ఆచరించడం.. పుష్కరాల ప్రారంభంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం మూడు గంటలపాటు అక్కడే ఉండిపోవడంతో వేలాదిగా వచ్చిన భక్తులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి వెళ్లిన తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. సీఎం బాధ్యతారాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇది జరిగిన చాలా నెలల తరువాత ఈ సంఘటనపై విచారణకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఈ నెల 12న విచారణ జరపనున్నట్టు ప్రకటించింది. కానీ ఆ రోజు విచారణ జరపలేదు. -
ఆకలిదప్పులు.. ‘ముంపు’ తిప్పలు
- మూడు రోజులుగా ముంపులోనే.. - వరద తగ్గుముఖం పట్టినా తీరని కష్టాలు - పాశర్లపూడిలో ఒకరి మృతి - అప్పనపల్లి కాజ్వే వద్ద దేవస్థాన ఉద్యోగి గల్లంతు - బ్యారేజ్ నుంచి 14.15 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల - జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు అమలాపురం : కనురెప్పల మాటున ఉప్పెనగా వచ్చి పడిన గోదావరి వరద లంకవాసులను ఇక్కట్ల పాల్జేస్తోంది. వరద తగ్గుతున్న కొద్దీ లంకవాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. మూడు రోజులుగా ముంపు బారిన పడడంతో వారు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఏ లంక గ్రామం చూసి నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు గోదావరి శాంతిస్తున్నా.. లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. వరదల వల్ల కోనసీమలో మురుగునీటి కాలువలు పొంగిపొర్లుతుండడంతో.. ఇక్కడ ముంపు తీవ్రత పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 14.70 అడుగులు నమోదు కాగా, బ్యారేజ్ నుంచి 14.15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి వేగంగా తగ్గడంతో బ్యారేజ్ వద్ద రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముంది. భద్రాచలం వద్ద వరద వేగంగా తగ్గుతున్నందున గురువారం ఉదయానికి తొలి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 75 లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బ్యారేజ్ ఎగువ ప్రాం తంలో ఉన్న దేవీపట్నం, సీతానగరం మండలాల్లోని లంకలతో పాటు రాజమండ్రి బ్రిడ్జి లంక, కేతావారి లంకల్లో ముంపు వీడుతోంది. అయినప్పుటికీ బాధితులు ఇంకా రాజమండ్రిలోనే తల దాచుకొంటున్నారు. బ్యారేజ్ దిగువన ఉన్న లం కల్లో మధ్యాహ్నం వరకు వరద ఉధృతి కని పించింది. మధ్యాహ్నం నుంచి ముంపు వీడుతోం ది. కోనసీమ లంకల్లో రెండు, మూడు అడుగుల మేర ముంపు తగ్గింది. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడికుదురు, అల్లవరం మం డలాల్లో లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపు కొద్దికొద్దిగా తగ్గుతున్నా.. ఇంకా ఇళ్లు, రోడ్లు, పొలాలు నీట మునిగే ఉన్నాయి. గురువారానికి కానీ లోతట్టు ప్రాంతాల్లోని లంకల్లో ముంపువీడే పరిస్థితి కనిపించడం లేదు. ఒకరి మృతి, మరొకరి గల్లంతు మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన బూల వెర్రియ్య(60) ఇంటి నుంచి బయటకొ స్తూ.. బుధవారం ముంపులో ఉన్న గోతిలో పడి చనిపోయాడు. ఇంటి చుట్టూ వరదనీరు చేరడం తో గొయ్యిని అతడు గుర్తించకపోవడంతో ఈ సం ఘటన జరిగింది. మామిడికుదురుకు చెందిన కాం డ్రేగుల శ్రీనివాస శాస్త్రి (50) అప్పనపల్లి కాజ్వే వద్ద వరద ఉధృతిలో గల్లంతయ్యాడు. విధులు ముగించుకుని వెళుతున్న అతడు పడవ అం దుబాటులో లేకపోవడంతో.. కాజ్వే మీదుగా నీటి లో దిగివెళుతూ కొట్టుకుపోయాడు. అలాగే మంగళవారం గల్లంతైన పి.గన్నవరం మండలం కె.ముం జవరానికి చెందిన చింతా కృష్ణమూర్తి ఆచూకీ లభ్యం కాలేదు. అతడి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పరామర్శించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్.. బుధవారం కూడా కోనసీమలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. క‘న్నీటి’ కాపురాలు మూడు రోజులుగా ముంపులో చిక్కుకోవడంతో గోదావరివాసులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ముంపు మధ్యే లంకవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. చుట్టూ నీరు ముంచెత్తడంతో.. గుక్కెడు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ముంపులో మునిగిన అనేక పూరిళ్లు కూలిపోయాయి. ముంపు బారి నుంచి ప్రాణాలతో ఒడ్డున పడ్డవారు ఏటిగట్లపై కొబ్బరి తడికెల మాటున కాలం వెళ్లదీస్తున్నారు. అనేక మంది తమ ఆస్తులకు రక్షణగా ఇళ్ల వద్దనే ఉండిపోయారు. పునరావాస కేంద్రాల్లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఎప్పుడు తమ ఇళ్లకు రెక్కలు కట్టుకుని వాలిపోదామా అని ఎదురు చూస్తున్నారు. అరకొర వసతుల మధ్య ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారుతో ఆకలి తీర్చుకుంటున్నారు. ఇళ్ల వద్ద ఉన్న వారి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. నిత్యావసర వస్తువులు నిండుకోవడం, బయటకు వెళ్లి తెచ్చుకొనే దారిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో పాటు వచ్చిపడుతున్న విష సర్పాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలు మూతపడ్డాయి. బడులు పోతాయన్న ఉద్దేశంతో చిన్నారులు పడవలపై పాఠశాలలకు వెళుతున్నారు. నిన్నటి వరకు వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వాటి మీదుగా పడవలతో రాకపోకలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఒకవైపు పంట దెబ్బతింటుందన్న ఆందోళన, మరోవైపు మార్కెట్‌కు కూరగాయలు, పండ్లు పడవలపై తరలించేందుకు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. డెల్టాలో పెరుగుతున్న ముంపు డెల్టాలో డ్రెయినేజీలను ఆనుకుని ఉన్న గ్రామాలు సైతం ముంపులో చిక్కుకున్నాయి. ముమ్మిడివరం మండలం అయినాపురం అవుట్‌ఫాల్ స్లూయిజ్ ధ్వంసం కావడంతో అయినాపురం, ముమ్మిడివ రం, సోమిదేవరపాలెంల్లో 1500 ఎకరాల్లోని వరి చేలు ముంపుబారిన పడ్డాయి. అమలాపురం మం డలం బండార్లంక అప్పర్ కౌశిక గట్టుపై నుంచి ముంపు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోరింకల అవుట్‌ఫాల్ స్లూయిజ్ షట్టర్లు సకాలంలో మూయక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.