సాక్షి, ఆదిలాబాద్: గోదావరి ఉప నది పెన్‌గంగ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తింది. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న కోరాట–చనాఖా బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం 213 మీటర్లుకాగా.. దాన్ని మించి 215.7 మీటర్ల ఎత్తున ప్రవాహం వస్తోంది. దీనితో బ్యారేజీ సమీపంలో నిర్మించిన పంపుహౌస్ ప్రమాదం అంచున నిలిచింది.
మరో రెండు మీటర్ల ప్రవాహం పెరిగితే పంపుహౌజ్‌లోకి వరద పోటెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్‌గంగ ఉధృతికి భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 10 జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. డొల్లార సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిని తాకుతూ పెన్‌గంగ ప్రవహిస్తుండటంతో.. శనివారం రాత్రి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment