ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 78,209 క్యూసెక్కులు సముద్రంలోకి
కృష్ణాలో మరింత తగ్గిన వరద
సాక్షి, అమరావతి/ ధవళేశ్వరం: నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 88,409 క్యూసెక్కులు చేరుతుండగా బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.30 అడుగులకు చేరింది.
10,200 క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన 78,209 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీలో మొత్తం 175 క్రస్ట్‌గేట్లకుగాను 129 గేట్లను పైకిలేపి జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు విడుదల చేసిన నీటిలో తూర్పు డెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,200, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు వదిలారు.
ఆల్మట్టిలోకి 23,678 క్యూసెక్కులు
పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల కృష్ణా, ఉపనదుల్లో వరద తగ్గింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 23,678 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పిత్తి చేస్తూ 3,980 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 90.33 టీఎంసీల నీరుంది. ఆల్మట్టి నిండాలంటే 39 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర నదిలోను వరద ప్రవాహం తగ్గింది.
తుంగభద్ర డ్యామ్‌లోకి 12,194 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 31.7 టీఎంసీలకు చేరింది. ఇక తెలుగురాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలంలోకి 1,060 క్యూసెక్కులు చేరుతుండగా.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో నీటినిల్వ 36.24 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment