సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై వచ్చేనెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డట్లూ్యడీఏ) రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి సవివర ప్రణాళిక నివేదిక(డీపీఆర్) త్వరలోనే రాష్ట్రాలకు పంపించి అ«ద్యయనం చేయడానికి గడువు ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులో ఆయా ప్రభావిత రాష్ట్రాల నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్‌ను ఎన్‌డబ్లు్యడీఏ హైదరాబాద్ విభాగం కేంద్రానికి పంపించింది. దీనికి ఎన్‌డబ్లు్యడీఏ ఆమోదముద్ర వేసిన వెంటనే సంబంధిత రాష్ట్రాలకు ఆ నివేదిక పంపిస్తారు. రెండు నదుల అనుసంధానికి రూ.74,329 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. ఈ పాజెక్టు పూర్తయితే ప్రతీ సంవత్సరం రూ.9824.49 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని లెక్కకట్టారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.3381 కోట్లు అవుతుందని అంచనా. ఇక ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని149 టీఎంసీల నీటిని గోదావరి–కావేరి అనుసంధానం కింద తరలించాలని కేంద్రం భావిస్తున్న సంగతి విదితమే. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ ఈ 140 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పక్షంలో.. మహానది–గోదావరి మధ్య 230 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని కావేరికి తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలు సమావేశాల్లో గోదావరి–కావేరి నదుల అనుసంధానికి సంబంధించి సమ్మతి లభించింది.
త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం కూడా...
గోదావరినది యాజమాన్య బోర్డు సమావేశం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. తదుపరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల సమాచారం అందులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ కూడా రాశారు. ఎల్లంపల్లి బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు కుప్తి, ఎస్సారెస్పీ రెండో దశ వినియోగం, ఇందిరమ్మ వరద నీటి కాలువ, కాళేశ్వరం అదనపు టీఎంసీల వినియోగంపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలు
ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం కోటాను సాగర్‌కు మళ్లించింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు 80 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయామని, అందువల్ల నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి ఐదు టీఎంసీల నీటి విడుదల చేయాలని ఏపీ కోరిక మేరకు బోర్డు అనుమతినిచి్చంది. బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఈనెల 12వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment