![First Morning Tea Of Freedom Manish Sisodias Tweet After Bail](/styles/webp/s3/article_images/2024/08/10/manishsisodia_0_0.jpg.webp?itok=pBeE9XMl)
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి పదిహేడు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం(ఆగస్టు10) ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి టీ తాగుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రాన్ని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.
आज़ादी की सुबह की पहली चाय….. 17 महीने बाद!
वह आज़ादी जो संविधान ने हम सब भारतीयों को जीने के अधिकार की गारंटी के रूप में दी है।
वह आज़ादी जो ईश्वर ने हमें सबके साथ खुली हवा में साँस लेने के लिए दी है। pic.twitter.com/rPxmlI0SWF— Manish Sisodia (@msisodia) August 10, 2024
ఈ సందర్భంగా ‘17 నెలల తర్వాత.. ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ’అని తన ట్వీట్‌కు సిసోడియా భావోద్వేగపూరిత కామెంట్స్ జత చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్‌స్కామ్ కేసులో అరెస్టయిన సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
![](/sites/default/files/inline-images/25_13.png)
Comments
Please login to add a commentAdd a comment